Home TGPSC Prep GROUP 1 నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : తెలంగాణలో కొత్త కొలువులు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : తెలంగాణలో కొత్త కొలువులు

0
Breaking news with world map background. Vector

తెలంగాణలో కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి మే నెల దాకా నోటిఫికేషన్ల హడావిడి లేదు. ఇదే విషయాన్ని tgpsc ఛైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పేశారు. మార్చి 31 లోగా కొత్త ఉద్యోగాల ఇండెంట్ రావాలి… అలాగే గ్రూప్ 2,3 పేపర్ల సంఖ్య కుదింపు, సిలబస్ మీద కూడా అనాలసిస్ చేస్తున్నట్టు చెప్పారు. మే దాకా నోటిఫికేషన్లు రావు అన్న స్టేట్ మెంట్ తో చాలామంది నిరుద్యోగులు డీలా పడ్డారు. చాలామంది పుస్తకాలు పక్కన పెట్టేశారు. ఇంకా కొందరు రివిజన్ చేసుకుంటున్నారు.

నిరుద్యోగులకు శుభవార్త

ఈ టైమ్ లో ఓ శుభవార్త బయటకు వచ్చింది. ఈ వార్తను సాక్షి దినపత్రిక వెబ్ ఎడిషన్ లో ప్రచురించారు. ఇందులో నిజా నిజాలను నేను నిర్ధారించడం లేదు. అయినప్పటికీ… వాళ్ళు చెప్పిన సంఖ్యలో మాత్రం పోస్టులు ఉండే అవకాశం ఉంది. ఆ గుడ్ న్యూస్ ఏంటి… తెలంగాణలో కొత్త కొలువులను ఈ ఏడాదిలో ఎన్ని భర్తీ చేయబోతున్నారు అన్న దానిపై ఈ వీడియో చేస్తున్నా.

please subscribe our Telangana exams Plus you tube channel

తెలంగాణలో జరిగే అన్ని ఎగ్జామ్స్ అంటే group.1,2,3 తో పాటు SI, కానిస్టేబుల్స్ లాంటి పోలీస్ ఉద్యోగాలు… VRO పోస్టులు, హైకోర్టుకు సంబంధించిన జాబ్స్ కోసం Test Series నిర్వహిస్తున్న మన Telangana Exams plus యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.

తెలంగాణలో కొత్త కొలువుల జాతర మే నెల నుంచి స్టార్ట్ అవుతోంది. మార్చి 31లోగా వివిధ శాఖల నుంచి వచ్చిన ఇండెంట్ ఆధారంగా…. ఏప్రిల్ లో జాబ్ కేలండర్ రూపొందించి…ఆ తర్వాత అంటే మే నెలలో వరుసగా tgpsc నుంచి ఇతర నియామక సంస్థల నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయి.

ఫిబ్రవరిలో 6 వేల టీచర్ పోస్టుల భర్తీ

ముందుగా ఫిబ్రవరిలో ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం 6 వేల టీచర్ పోస్టులకు DSC ని రిలీజ్ చేయబోతోంది ప్రభుత్వం. జనవరి 20 లోపు తెలంగాణలో టెట్ పరీక్షలు కంప్లీట్ అవుతాయి. ఇవి అయిపోగానే… DSC నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి విద్యాశాఖ ప్రిపేర్ అవుతోంది. ఫిబ్రవరి నెల 2 వవారంలో DSC నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈసారి 5 వేల నుంచి 6 వేల దాకా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యాశాఖకు ఇప్పటికే ఆదేశాలు కూడా వెళ్ళాయి.

8 వేల నుంచి  10 వేలదాకా పోలీస్ ఉద్యోగాలు

ఇక కొత్త ఏడాదిలో రెండో హయ్యస్ట్ జాబ్స్ నోటిఫికేషన్… పోలీస్ ఉద్యోగాలు…
తెలంగాణలో ఈసారి 8 వేల నుంచి 10 వేల దాకా పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తారని సమాచారం. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్, SI ఉద్యోగాలకు కూడా తొందర్లోనే నోటిఫికేషన్ రాబోతోంది. ఈ పోలీస్ ఉద్యోగాలకు మేలోపే అంటే… ఫిబ్రవరి నెల చివరి వారం లేదా మార్చి నెల మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారు. సో … పోలీస్ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు ఇప్పటి నుంచి క్షణం కూడా వేస్ట్ చేయకుండా మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి.

మన Telangana Exams plus యాప్ లో SIతో పాటు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి టెస్ట్ సిరీస్ లు ఉన్నాయి. గతంలో ఎందరో విజేతలుగా తీర్చిదిద్దిన ఘనత మనకు ఉంది. వెంటనే ఆ కోర్సుల్లో జాయిన్ అవ్వండి.

భారీగా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు

మనం ముందు చెప్పుకున్నట్టు….

TGPSC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు మాత్రం … మే నెల నుంచే వచ్చే ఛాన్సుంది. గత అక్టోబర్ 2024లోనే గ్రూప్ 1 Fresh Notification రావాల్సి ఉంది. SC రిజర్వేషన్ వల్ల ఆ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. అయితే ఈసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మే నెలలో దాదాపు 450 గ్రూప్ 1 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్సుంది. దీంతో పాటు… 600 నుంచి 700ల దాకా గ్రూప్ 2 పోస్టులకు కూడా నోటిఫికేషన్ వస్తుందని సాక్షి డైలీలో న్యూస్ వచ్చింది.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల ఖాళీలను ప్రభుత్వం సేకరిస్తోంది. మే లేదా జూన్ నెలల్లో ఈ గ్రూప్ 1,2 నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయని అంటున్నారు.
గత నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలు.. అంటే గ్రూప్ 1,2,3 లకు ఇప్పటికే ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. వాటి ఫలితాలను మార్చి నెలాఖరులోగా పూర్తి చేస్తారు. ఆ తర్వాత మే లేదా జూన్ లో కొత్త గ్రూప్ 1, 2 లకు నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తారు.

2025లో ముందుగా వచ్చే నోటిఫికేషన్లు ఇవే

అంటే
మొత్తమ్మీద
రాబోయే రోజుల్లో అంటే ఫిబ్రవరిలో 6000 పోస్టులతో DSC టీచర్ పోస్టులు
ఫిబ్రవరి లేదా మార్చిలో 10 వేల దాకా పోస్టులతో పోలీస్ ఉద్యోగాలు
మే లేదా జూన్ నెలలో 450 పోస్టులతో గ్రూప్ 1, 700 దాకా పోస్టులతో గ్రూప్ 2 పడే ఛాన్సుంది.

సో….. అభ్యర్థులు ఎవరూ కూడా టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. మూలన పడేసిన మీ పుస్తకాలను మళ్ళీ తీయండి… ఈసారి మరింత ఉత్సాహంతో పరీక్షలకు సిద్ధం అవ్వండి. ప్రతి సబ్జెక్టులో నోట్స్ రాసుకోండి… మైండ్ మ్యాప్స్, క్విక్ గా గుర్తుండటానికి పాయింట్స్ వైజ్ గా నోట్సులను ప్రిపేర్ చేసుకోండి…
ఈ 4,5 నెలల టైమ్ లో మీరు ఏం చేయాలి అన్నది నేను మరో Article లో ఇస్తాను.
చివరగా ఓ మాట
మన Telangana Exams plus యాప్ లో

ప్రస్తుతం VRO తో పాటు హైకోర్టులో ఉద్యోగాలకు సంబంధించి టెస్ట్ సిరీస్ లు నడుస్తున్నాయి. 2025 టెస్టుల అప్ డేషన్ కూడా నడుస్తోంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే చేరిపోండి. అలాగే గ్రూప్ 1,2,3 తో పాటు తెలంగాణ పోలీస్ ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు, ఇంజినీరింగ్, అగ్రికల్చర్ లాంటి ఉద్యోగాల కోసం జనరల్ స్టడీస్ కి సంబంధించి ప్రత్యేకంగా తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్ సిరీస్ కూడా నడుస్తోంది. ముందుగా మీరు మన Telangana exams plus యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో store కి వెళితే కోర్సులు కనిపిస్తాయి. మీకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వొచ్చు.

కొత్త ఏడాదిలో మీరంతా ఉద్యోగాలు సాధించాలని మనసారా కోరుకుంటున్నాను.
Please subscribe and like our Telangana Exams you tube channel
రెగ్యులర్ గా మన Telangana Exams, Examscentre247.com వెబ్ సైట్స్ ను విజిట్ చేస్తూ ఉండండి.
Thank you.

Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO, HIGH COURT JOBS etc., Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

 Telangana Exams -Whats Group Channel – CLICK HERE

 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version