Home TGPSC Prep GROUP 1 TGPSC : మే తర్వాత కొత్త నోటిఫికేషన్లు

TGPSC : మే తర్వాత కొత్త నోటిఫికేషన్లు

0

TGPSC ఎగ్జామ్స్ సిలబస్ లో మార్పులు

తెలంగాణలో 2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి TGSPSC శుభవార్త చెప్పింది. కొత్త ఉద్యోగాలకు ఏప్రిలో 2025 నుంచి నోటిఫికేషన్లు జారీ చేస్తామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. TGPSC ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్లు 2025 ఏప్రిల్ తర్వాతే జారీ చేయబోతున్నారు.

2025 మార్చి 31 లోపు పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు ఇస్తారు. అంటే ఇప్పటికే పూర్తయిన TGPSC గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను మార్చి నెలాఖరు, ఏప్రిల్ కల్లా రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత కొత్త నోటిఫికేషన్ల మీద కసరత్తు జరుగుతుంది. మార్చి 31 లోపు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తిస్తారు. అందుకోసం మార్చి 31 లోగా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీ అయిన పోస్టుల లెక్కను TGPSC తెప్పించుకుంటుంది. ఆ తర్వాత ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి … జాబ్ కేలండర్ రిలీజ్ చేసి … ఆ ప్రకారం ఉద్యోగాల భర్తీ ఉంటుంది.
అంటే
మార్చి 31 లోపు రాష్ట్రంలో … గ్రూప్ 1,2,3 వారీగా ఏ శాఖలో ఎన్ని కొలువులు ఖాళీగా ఉన్నాయో తెలుసుకొని … ఆ తర్వాత ఏప్రిల్ లోగా వాటికి జాబ్ కేలండర్ రిలీజ్ చేస్తే… దాదాపు ఏప్రిల్ నెలాఖరు లేదా మే నుంచి తెలంగాణలో కొత్త నోటిఫికేషన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ అభ్యర్థులు ఇంకో విషయం గమనించాలి.

TGPSC సిలబస్ ను కూడా మార్చబోతున్నారు… గ్రూప్ 2, 3 కి మూడు, నాలుగు పేపర్లు కూడా అక్కర్లేదని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం అంటున్నారు. వెంకటేశం … ఛైర్మన్ బాధ్యతలు చేపట్టాక… ఢిల్లీలో UPSC, SSC ఆఫీసులకు తమ బృందంతో కలసి వెళ్ళి వచ్చారు. అక్కడి ఎగ్జామ్స్ నిర్వహణ పనితీరు, ఆ రెండు రిక్రూట్ మెంట్ సంస్థలు జాబ్ కేలండర్ ను ఏడాదికి సరిపడా ఒకేసారి ప్రకటించడం లాంటి అంశాలపై స్టడీ చేశారు. అందుకే TGPSC ని కూడా అదే ఫార్మాట్ లో తీసుకెళ్ళాలని భావిస్తున్నారు. ఇప్పటికే TGPSC గ్రూప్ 1, 2,3 సిలబస్ మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాంతాడంత సిలబస్ ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిని తగ్గించాలని గత BRS గవర్నమెంట్ నుంచి నిరుద్యోగ అభ్యర్థులతో పాటు… మేథావులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకే సిలబస్ తగ్గింపు… పేపర్ల కుదింపు మీద కూడా TGPSC పూర్తిగా దృష్టి పెట్టింది. UPSC, SSC ఫార్మెట్లో వెళ్ళాలని డిసైడ్ అయింది. అంటే ఇకపై TGPSC గ్రూప్ 1 కి నిర్వహించినట్టే… ప్రిలిమ్స్, మెయిన్స్ తరహాలో ఎగ్జామ్స్ పెట్టే అవకాశ ముంది.

ప్రస్తుతం UPSC, SSC ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే….

మొదట ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించి… అందులో కొందర్ని వడపోత ద్వారా మెయిన్స్ కి ఎంపిక చేస్తున్నారు. ఆ తర్వాత ఉద్యోగాల సంఖ్యకు తగ్గట్టుగా మెయిన్స్ కటాఫ్ ను డిసైడ్ చేసి ఆ మేరకు అభ్యర్థులను భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే తరహా విధానం నడుస్తోంది.
మనకు మాత్రం… గ్రూప్ 1 కి ప్రిలిమ్స్, మెయిన్స్ విధానం ఉన్నప్పటికీ… మెయిన్స్ లో కూడా ఐదు పేపర్లను పెట్టడం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇబ్బందిగానే ఉంటోంది. సరే… గ్రూప్ 1 రిక్రూట్ మెంట్ లో మార్పులు చేయకపోయినా… అందులో కొంత సిలబస్ తగ్గించినా ఫర్వాలేదు.

కానీ గ్రూప్ 2 & గ్రూప్ 3 ఎగ్జామ్ ప్యాటర్న్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 2 లో నాలుగు పేపర్లు, గ్రూప్ 3 లో మూడు పేపర్ల విధానం చాలా మంది గ్రామీణ అభ్యర్థులకు సమస్యగా మారింది. పట్టణాల్లో ఉన్నవాళ్ళు కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నా… గ్రామీణ అభ్యర్థులకు కూడా పట్టణాల్లో హాస్టళ్ళల్లో ఉండి… గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపరేషన్ కోసం… 40 నుంచి 70 వేల రూపాయల దాకా కోచింగ్ కే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అందువల్ల … గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ప్యాటర్న్స్ మార్చి… వాటిని కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ లాగా అందుబాటులోకి తెచ్చి ఎగ్జామ్స్ నిర్వహిస్తే బెటర్.

ఇక సిలబస్ గురించి చూసుకుంటే… TGPSC ఏర్పడిన కొత్తలో మేథావులతో కమిటీలు వేసి సిలబస్ నిర్ధారణ చేశారు. కానీ ఆ సిలబస్ కొండవీటి చాంతాడులాగా ఉంది. నేను గతంలో చెప్పాను… దాదాపు 140కి పైగా పాఠాలను అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాల్సి వస్తోంది. TGPSC ఎగ్జామ్స్ సిలబస్ నిర్ణయంలో… UPSC నిర్వహించే సివిల్స్ సిలబస్ ను ఆదర్శంగా తీసుకున్నారు. అందువల్లే సిలబస్ భారం పెరిగిపోయింది. పైగా కొన్ని సబ్జెక్టుల్లో రిపిటేషన్స్ కూడా ఉన్నాయి. జనరల్ స్టడీస్ తో పాటు… ఎకానమీ, సోషియాలజీ, పాలిటీ, ఇండియన్ హిస్టరీ లాంటి సబ్జెక్టుల్లో చాలా రిపిటేషన్స్ ఉంటున్నాయి. అందుకే మేం వీడియోలు చేసేటప్పుడు… మీరు అన్ని పేపర్ల సిలబస్ చూసుకొని… సమన్వయం చేసుకొని చదవండి అని చెబుతున్నాం… ఇప్పుడు కొత్తగా సిలబస్ మారిస్తే… రిపిటేషన్స్ లేకుండా… సిలబస్ ను కనీసం సగానికి అయినా తగ్గించాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 4 ను రద్దు చేశాం. గ్రూప్ 3 ఎగ్జామ్ లోనే పోస్టులను ప్రాధాన్యత వారీగా భర్తీ చేస్తామన్నారు. కానీ గ్రూప్ 4 ను గతంలో టెన్త్, ఇంటర్ అర్హతతో నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల టెన్త్, ఇంటర్ చదివిన వారికి అవకాశం కల్పిస్తూ… మళ్ళీ గ్రూప్ 4ను నిర్వహించాలన్న డిమాండ్ బాగా వినిపిస్తోంది. ఇంటర్ వరకూ చదివిన వారికి పోలీస్ ఉద్యోగాలు, కోర్టుల్లో జాబ్స్ తప్ప… TGPSC ద్వారా ఏ ఉద్యోగానికి పనికి రాకుండా వ్యవస్థను మార్చేశారు. గవర్నమెంట్ ఈ విషయంలో కూడా చర్యలు తీసుకోవాలి… గ్రూప్ 2, 3 కి డిగ్రీ అర్హతను నిర్ణయించి… గ్రూప్ 4 కి ఇంటర్ క్వాలిఫికేషన్ నిర్వహించాలన్న డిమాండ్ వస్తోంది.

ఇక UPSC, SSC తరహాలో ఎగ్జామ్స్ అంటున్నారు కాబట్టి… రాబోయే రోజుల్లో TSPSC ఎగ్జామ్స్ లో కూడా మైనస్ మార్కులు ఉండే ఛాన్సుంది. అభ్యర్తులు దీని విషయంలోనూ ఇప్పటి నుంచే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.

  • కొత్త ఉద్యోగాల్లో గ్రూప్ 4 ని తిరిగి ప్రవేశపెట్టి Tenth, ఇంటర్ క్వాలిఫికేషన్ ఇవ్వాలి…
    అలాగే చాంతాడు సిలబస్ ను తగ్గించాలి.
    గ్రూప్ 2, 3 లో పేపర్ల సంఖ్యను తగ్గించాలి

ఎగ్జామ్ ప్యాటర్న్ ను మార్చడంతో పాటు… మైనస్ మార్కుల సిస్టమ్ వద్దు అని మేం Telangana Exams తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓ సీనియర్ జర్నలిస్టుగా నేను కూడా tgpsc ఛైర్మన్ బుర్రా వెంకటేశం గారికి ఈ విజ్ఞప్తిని చేస్తున్నా. మా ఒపీనియన్స్ ని మెయిల్ ద్వారా కూడా ఆయనకు పంపుతాను. మీరు కూడా మీ ఒపీనియన్స్ ని షేర్ చేసుకోండి… కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
అలాగే… ఏప్రిల్ తర్వాత tgpsc నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయని మాత్రం గుర్తు పెట్టుకోండి.

Read this also: మెంటల్ ఎబిలిటీలో టాప్ స్కోర్ ఎలా ?

Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO లాంటి Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version