🪖 ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC – January 2026) నోటిఫికేషన్ విడుదల
👉 BE/B.Tech పూర్తిచేసిన యువకులకు గౌరవాన్నిచ్చే ఉద్యోగ అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC) కోసం 2026 జనవరి బ్యాచ్‌కి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ కోర్సు ద్వారా ఎంపికైన అభ్యర్థులకు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) లో శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాలో శాశ్వత ఉద్యోగం లభిస్తుంది.
📊 ఖాళీలు – మొత్తం పోస్టులు: 30
విభాగాల వారీగా:
- సివిల్ ఇంజినీరింగ్ – 08
- కంప్యూటర్ సైన్స్ – 06
- ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ – 02
- ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ – 06
- మెకానికల్ ఇంజినీరింగ్ – 06
- ఇతర బ్రాంచ్‌లు – 02
✅ అర్హతలు:
- అవివాహిత పురుషులు మాత్రమే దరఖాస్తు చేయవచ్చు
- సంబంధిత బ్రాంచ్‌లో BE/B.Tech ఉత్తీర్ణులు అర్హులు
- ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు
- 2026 జనవరి 1వ తేదీ నాటికి విద్యా అర్హతల సర్టిఫికెట్లు అందుబాటులో ఉండాలి
- వయస్సు: 20 నుంచి 27 ఏళ్ల మధ్య (01.01.2026 నాటికి)
🔍 ఎంపిక ప్రక్రియ:
- BE/B.Techలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు
- షార్ట్‌లిస్ట్ అయినవారికి SSB ఇంటర్వ్యూకు పిలుపు వస్తుంది
- SSB ఇంటర్వ్యూలు: ప్రయాగ్‌రాజ్, భోపాల్, బెంగళూరు, జలంధర్ కేంద్రాల్లో జరుగుతాయి
- ఎంపిక ప్రక్రియలో స్టేజ్ 1 (ఇంటెలిజెన్స్ టెస్ట్) & స్టేజ్ 2 (వ్యక్తిత్వ పరీక్షలు) ఉంటుంది
- చివరిగా మెడికల్ పరీక్షలు నిర్వహించబడతాయి
- అర్హత సాధించినవారే తుది ఎంపికలోకి వస్తారు
🎓 శిక్షణ:
- ఎంపికైనవారికి డెహ్రాడూన్ IMA లో 1 సంవత్సరం శిక్షణ
- శిక్షణ సమయంలో నెలకు ₹56,100 స్టైపెండ్
💰 వేతనం & ప్రోత్సాహకాలు:
- శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాతో శాశ్వత ఉద్యోగం
- ప్రాథమిక వేతనం: ₹56,100 (పే లెవెల్ – 10)
- డీఏ, మిలిటరీ సర్వీస్ పే, ఇతర అలవెన్సులతో కలిపి నెలకు రూ.లక్ష వరకు వేతనం అందుతుంది
🎯 కెరీర్ స్కోప్:
- 2 ఏళ్ల సర్వీస్ తర్వాత కెప్టెన్,
- 6 సంవత్సరాల తర్వాత మేజర్,
- 13 సంవత్సరాల తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ప్రమోషన్లకు అవకాశం
📅 దరఖాస్తు వివరాలు:
- దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా మాత్రమే
- చివరి తేదీ: 29.05.2025
- వెబ్సైట్: www.joinindianarmy.nic.in
Read this also : 🪖 ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆర్మీలో ఉద్యోగ అవకాశం + ఇంజనీరింగ్ డిగ్రీ