Home BOOKS FOR YOU VRO/JRO Test series 2025

VRO/JRO Test series 2025

0

గతంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లుగా పిలిచేవారు… ఇప్పుడు కొత్త ROR చట్టం తర్వాత మళ్ళీ VRO లను నియమిస్తారని అంటున్నారు. ROR చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టేటప్పుడే… రేవంత్ రెడ్డి గవర్నమెంట్ VROలు లేదా JUNIOR REVENUE OFFICER గా పేరు మార్చి… ఇంకా ఏదైనా పేరు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ JRO లకు సంబంధించిన కొత్త ఫైల్ కూడా అసెంబ్లీలో పెట్టే ఛాన్సుంది. ఇప్పటికే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా … గ్రామస్థాయిలో VRO వ్యవస్థ లేదంటే రెవెన్యూ అధికారులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తామని అనేక సార్లు చెప్పారు. కొత్తగా 8000 మందిని భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. జాబ్ కేలండర్ 2025లో ఈ పోస్టుల నోటిఫికేషన్, ఎగ్జామ్ నిర్వహణ తేదీలు వెల్లడి అవుతాయి. 

ఈ ఎగ్జామ్ కోసం మేం టెస్ట్ సిరిస్ నిర్వహిస్తున్నాం.  ప్రస్తుతానికి గతంలో ఇచ్చిన VRO ఎగ్జామ్ మోడల్ లోనే టెస్టులు నిర్వహిస్తాం.  ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ లో మార్పులు, చేర్పులు ఉండవచ్చు.

VRO JRO TESTS

VRO/ JRO TEST SERIES

మీకు Telangana Exams plus ఈ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. కోర్సులో జాయిన్ అయ్యే ముందు test series లో ఇచ్చిన సూచనలు తప్పకుండా చదవండి…

1) 2025లో 8000కు పైగా (దాదాపుగా) పోస్టులు… VRO/JRO పేరుతో Posts భర్తీ చేసే అవకాశం ఉంది. చాలామంది అడుగుతుండటంతో… ముందస్తు ప్రిపరేషన్ కోసం మాత్రమే…. ఈ Test Series క్రియేట్ చేశాం. గతంలో VRO సిలబస్ ప్రకారం ఈ సిరీస్ ఇస్తున్నాం. ఒకవేళ Notification వచ్చాక మార్పులు, చేర్పులు ఉంటే కోర్సులో కూడా మార్పులు చేస్తాం.
2) గతంలో VROలకు ఇంటర్మీడియట్ అర్హత ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఉండవచ్చు. మార్పులు చేస్తే మా బాధ్యత లేదు
3) ఈ కోర్సు కేవలం ముందస్తు ప్రిపరేషన్ కోసం మాత్రమే క్రియేట్ చేశాం. ఎన్ని పోస్టులు వేస్తారు… వేయరు అన్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానిదే…

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version