గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు గతంలో VRO, VRA లకు బదులు గ్రామపాలన అధికారుల (GPO)లను నియమిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 14 సంక్రాంతికల్లా నియామకాలు పూర్తవుతాయని చెప్పింది. అందుకోసం పాత VRO, VRA లకు ఆప్షన్లు కూడా ఇచ్చింది. తెలంగాణలో మొత్తం 10,495 రెవెన్యూ గ్రామాలకు GPO పోస్టులు అవసరం ఉంది. వీటిల్లో పాత వాళ్ళకు టెస్టులు పెట్టి తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం, వాళ్ళ నియామకం పూర్తయ్యాక ఖాళీగా ఉన్న స్థానాల్లో కొత్త వాళ్ళని డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనిపై అనేక సార్లు మీడియాతో కూడా చెప్పారు. కానీ GPO పోస్టుల భర్తీ ప్రక్రియ నాలుగు నెలలైనా ఇప్పటికీ ముందుకు కదలడం లేదు.
తేలని పూర్వ వీఆర్వోల రిక్రూట్మెంట్
పూర్వ VRO, VRAలను ప్రస్తుతం కొత్తగా నియమించే GPOల్లోకి తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 16 వరకు ఆప్షన్లు తీసుకుంటామని ప్రకటించింది. కానీ వీళ్ళకి ప్రమోషన్లపై క్లారిటీ ఇవ్వకపోవడంతో పూర్వపు VRO, VRAల్లో ఆందోళన కనిపిస్తోంది. ప్రభుత్వం దీనిపై ఖచ్చితమైన స్పష్టత ఇచ్చే దాకా ఆప్షన్లు పెట్టుకోవద్దని VRO, VRA లు నిర్ణయించినట్టు సమాచారం.
పూర్వపు VRO ల అభ్యంతరాలు ఏంటంటే…
1) GPOలుగా నియమిస్తామని చెప్పిన ప్రభుత్వం అది ఏ క్యాడర్ కిందకు వచ్చే పోస్టు అనేది స్పష్టత ఇవ్వడం లేదు.
2) పూర్వపు VROలు GPOలుగా జాయిన్ అయ్యాక వాళ్ళకి భవిష్యత్తులో ప్రమోషన్లు ఉంటాయా లేవా… అనేది తెలియట్లేదు. ప్రమోషన్ లేకపోతే రిటైర్డ్ అయ్యేదాకా ఒకే పోస్టులో ఎలా ఉండాలని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
3) డిగ్రీ పూర్తి చేసిన VROలు, VRAలు ఇప్పటికే వివిధ శాఖల్లో Junior Assistant హోదాలో పని చేస్తున్నారు. ఒకవేళ GPOలో జాయిన్ అయ్యాక RI లేదా Junior Assistant ప్రమోషన్ ఇస్తే మళ్లీ అదే క్యాడర్ లో పని చేయాల్సి వస్తుంది. అప్పుడు ప్రమోషన్ ఇచ్చినట్టు ఎలా అవుతుందని VROలు ప్రశ్నిస్తున్నారు.
4) పూర్వపు VRO, VRAలు వాళ్ళకి ఇతర శాఖల్లో వాళ్ళు తీసుకుంటున్న శాలరీలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే జూనియర్ అసిస్టెంట్ గా ఉన్న వారికి అదే వేతనం ఇస్తుంది. ఒకవేళ వారికి GPO నుంచి Junior Assistant గా ప్రమోషన్ వచ్చినప్పుడు… వేతనం ఎలా పెంచుతారన్న దానిపై క్లారిటీ లేదు.
5) పూర్వపు VRO, VRAలకు ఎగ్జామ్ నిర్వహించి రెవెన్యూ శాఖలో GPOలుగా తీసుకుంటామని ప్రభుత్వం అంటోంది. కానీ ఏ ఎగ్జామ్ పెడుతున్నారు ? సిలబస్ ఏంటి ? ఎప్పుడు పెడతారన్న దానిపైనా స్పష్టత లేదు.
డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ఎప్పుడు ?
పూర్వపు VRO, VRAలను GPOలుగా నియమించడానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఇటు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ అభ్యర్థులు కూడా అయోమయంలో ఉన్నారు. GPO పోస్టుల్లో పూర్వపు VRO, VRAలకు అవకాశం ఇవ్వొద్దని డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. డిగ్రీ , ఇంటర్ అర్హతతో పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.