Home Do you know LIC Scholarships: ఏడాదికి Rs.40 వేలు …అర్హతలు ఏంటంటే !

LIC Scholarships: ఏడాదికి Rs.40 వేలు …అర్హతలు ఏంటంటే !

0

టాలెంట్ ఉండీ… చదువుకోడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి LIC శుభవార్త చెప్పింది. వాళ్ళ ఉన్నత చదువుల కోసం LIC Golden Foundation స్కాలర్ షిప్ అందిస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలా అప్లయ్ చేయాలి ? ఎవరు అర్హులు ? లాంటి సమాచారం తెలుసుకుందాం..

LIC Golden Jubilee Scholarships 2024 : పేద విద్యార్థులకు Life Insurance Corporation of India స్కాలర్షిప్స్ అందించేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల (EWS) విద్యార్థులు ఉన్నత చదువులకు LIC Golden Jubilee Scholarships (LIC GJF) అందిస్తోంది. అర్హులైన విద్యార్థులు https://licindia.in/ వెబ్‌సైట్‌ లో అప్లయ్ చేసుకోవచ్చు. 2024 డిసెంబర్‌ 22 వరకు అప్లయ్ చేసుకోడానికి చివరి తేది.

LIC

LIC Scholarshipకి అర్హతలు ఏంటి ?

2021-22, 2022-23, 2023 -24 విద్యా సంవత్సరాల్లో 10th/ఇంటర్‌/ డిప్లొమో లేదా తత్సమాన చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ Scholarshipకు అర్హులు. గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో కనీసం 60 శాతం మార్కులు లేదా తత్సమానమైన CGPA గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించాలి. 2024-25లో Higher Education చదవాలి అనుకునే లేదా చదువుతున్న Studentsకి ఈ Scholarships అందిస్తారు. మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, గ్రాడ్యుయేషన్‌, ఏదైనా విభాగంలో డిప్లొమో చేయాలనుకున్నా లేదా గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో వొకేషన్‌ కోర్సులు చేయాలన్నా, ITI వాళ్ళకి కూడా Scholarship ఇస్తారు. విద్యార్థుల తల్లిదండ్రుల/సంరక్షకుల Annual income రూ.2,50,000 మించరాదు. వితంతువు/ఒంటరి మహిళలైతే ఆ కుటుంబ వార్షికాదాయం రూ.4లక్షల వరకు ఉండవచ్చు.

ఇది కూడా చదవండి : Data Science : డేటా సైన్స్ లో మస్తు అవకాశాలు

Special girl child scholarship

ఈ స్కీమ్ కింద అప్లయ్ చేసుకోవాలనే విద్యార్థినులు 2021-23 / 2022-23 / 2023-24 విద్యాసంవత్సరంలో టెన్త్ క్లాసులో 60శాతం మార్కులు లేదా తత్సమాన CGPA గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్ లేదా 10+2లో చేరాలనుకునే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. UG కోర్సులకు మాత్రమే ఈ Scholarships అందిస్తారు. పీజీ కోర్సులకు ఇవ్వరు.

స్కాలర్షిప్స్ ఎంతమందికి ?

ఈ స్కాలర్షిప్స్ ఒక్కో LIC ఆఫీస్‌ నుంచి 30 మందిని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీళ్ళల్లో 20 మంది (10 మంది Boys, 10 మంది Girls)ని జనరల్‌ స్కాలర్‌షిప్‌నకు; అలాగే, అర్హులైన మిగతా పది మందిని Special scholarship for Girl Childకు ఎంపిక చేస్తారు.

ఇది కూడా చదవండి Semi Conductors Jobs : 10 లక్షల కొలువుల్లో మీకూ ఒకటి

LIC స్కాలర్షిప్ కింద ఎంత మొత్తం ?

General Scholarship కి ఎంపికైన విద్యార్థులకు మెడిసిన్‌ (MBBS/BAMS/BHMS/BDS) చదివే వాళ్ళకి ఏడాదికి Rs.40,000లను రెండు instalments లో విద్యార్థి Bank Account జమ చేస్తారు.
Engineering (BE/B.Tech/B.Arch) విద్యార్థులైతే ఏడాదికి Rs.30,000లు ఇస్తారు. ఈ మొత్తాన్ని రెండు instalments లో విద్యార్థి Bank Account జమ చేస్తారు.
Graduation, Integrated Courses, Diploma, Vocational Courses చేసేవారికి ఆ కోర్సు పూర్తయ్యేవరకు ఏటా రూ.20వేలు చొప్పున చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని 2 విడతల్లో (రూ.10వేలు చొప్పున) బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

Special Girl child scheme కింద ఎంపికైన విద్యార్థినులకు ఏడాదికి రూ.15వేలు చొప్పున మంజూరు చేస్తారు. టెన్త్ పూర్తయిన తర్వాత Inter/Vocational/Diploma కోర్సులు పూర్తి చేసేందుకు ఈ మొత్తాన్ని 2 instalments (రూ.7500 చొప్పున) చెల్లిస్తారు.

Rules తెలుసుకోండి

👉 PG Courses చదివే వారికి ఈ Scholarship scheme (Golden Jubilee Scholarship Scheme) వర్తించదు.

👉ఇప్పటికే ఇతర ట్రస్టులు/ సంస్థల నుంచి Scholarship తీసుకున్న వారికి ఇవ్వరు. కేంద్ర /రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది.

👉Distance Courseలు/ Part-Time చదవుల విద్యార్థులకు ఈ Scholarship వర్తించదు. అలాగే, CA/CS/ICWA లేదా ఇతర Self Study కోర్సులు చేసేవారికి కూడా అర్హత లేదు.

👉Special Girl Child Scholarshipనకు ఎంపికైన విద్యార్థినులు Inter First yearలో 50శాతం మార్కులు సాధిస్తేనే తర్వాతి Year కి renewal చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Medicine, Engineering లాంటి Professional Courseల్లో చేరిన విద్యార్థులు, సాధారణ డిగ్రీ కోర్సుల్లో చేరిన వారికి నిర్దేశించిన మార్కులు వస్తేనే తర్వాత ఏడాదికి Scholarship ఇస్తారు. రెగ్యులర్ హాజరు శాతం కూడా ఉండాలి.

👉ఒక్క కుటుంబానికి ఒక్కరికి మాత్రమే స్కాలర్‌షిప్‌ ఇస్తారు. ఒకవేళ ఆ ఫ్యామిలీలో Girl Child ఉంటే ఇద్దరికీ ఇస్తారు.

👉LIC నిబంధనలకు అనుగుణంగా లేకపోతే Scholarships తిరస్కరిస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చినా Fake Certificatesతో Scholarshipకి ఎంకైనట్టు తేలితే వాళ్ళ స్కాలర్షిప్ రద్దు చేయడంతో పాటు అప్పటి వరకూ ఇచ్చిన అమౌంట్ ను రికవరీ చేస్తారు.

👉అప్లయ్ చేసుకున్న విద్యార్థులు తప్పనిసరిగా Income Certificateతో పాటు Affidavit సమర్పించాలి

CLICK HERE FOR DETAILS

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version