Home Careers Data Science : డేటా సైన్స్ లో మస్తు అవకాశాలు

Data Science : డేటా సైన్స్ లో మస్తు అవకాశాలు

0

డేటా సైన్స్ రంగంలో ప్రతి ఏడాది ఉద్యోగాలు 45 శాతం పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అద్భుతమైన ఉపాధి అవకాశాలను ఇస్తున్న డేటా సైన్స్ పనిచేయాలంటే మీకు ఏ అర్హతలు ఉండాలి… ఏమేమి నేర్చుకోవాలి…

Data science

మనం ఏదైనా వస్తువు కొనాలి అనుకుంటే… ఈ-కామర్స్ ఆప్ లో తరుచుగా వెతుకుతుంటాం. అప్పటికప్పుడు ఆ వస్తువును కొనకపోయినా… కొన్ని రోజుల తర్వాత  మనం ఇంట్రెస్ట్ చూపించిన వస్తువు ఆఫర్లతో కనిపించింది అనుకోండి… వెంటనే ఆర్డర్ ఇచ్చేస్తాం. అదేంటి మనం కోరుకున్నవాటినే ఆఫర్లుగా ప్రకటించడం ఎలా సాధ్యమవుతుంది. మన లాంటి వాళ్ళు లక్షల మంది ఉంటారు.  వాళ్ళల్లో ఒకరికి ఉన్న టేస్ట్ మరొకరికి ఉండకపోవచ్చు.  కానీ ఇంతమంది టేస్టులను ఆ వ్యాపార సంస్థలు ఎలా గుర్తిస్తాయి.  ఇదే .. డేటా సైన్స్

మన దేశంలో పాతికేళ్ల నుంచి సాఫ్ట్ వేర్ బాగా డెవలప్ అయింది.  ప్రతి పని కూడా సాఫ్ట్ వేర్ తో ముడిపడి ఉండటంతో… మన పనులు కూడా ఈజీగా అయిపోతున్నాయి.  అందుకే ఎలాంటి సవాళ్లకైనా పరిష్కారం చూపించే సత్తా సాఫ్ట్ వేర్ రంగానికి సాధ్యమవుతోంది.  అయితే ఈ సాఫ్ట్ వేర్ ని రూపొందించడానికి అవసరమైన సమాచార సేకరణ, దాన్ని క్రోడీకరించడం అనేది ఓ శాస్త్రంగా అవతరించింది.  అంటే మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలాగో… అలాగే సాఫ్ట్ వేర్ కోసం డేటా సైన్స్ కూడా దాదాపు పదిహేనేళ్ళుగా అభివృద్ధి చెందుతోంది. ఎనలిటిక్స్ ఇండియా మ్యాగజీన్ అంచనాల ప్రకారం.. 2021-2031 మధ్యన ఉన్న పదేళ్ల కాలంలో డేటా సైన్స్ లో ఉద్యోగాలు బాగా పెరిగిపోయాయి. ప్రతి యేటా డేటా సైన్స్ ఉద్యోగాలు 45 శాతం పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. Data Analyst, Machine Learning Engineer, Data Engineer, Data Scientist, Database Administrator, Business Analyst, Product Analyst, Financial Analyst … ఈ పోస్టులన్నీ కూడా డేటా సైన్స్ రంగం నుంచి వచ్చినవే.

Read also : Semi Conductors Jobs : 10 లక్షల కొలువుల్లో మీకూ ఒకటి

Data Science కి ఎలాంటి నైపుణ్యాలు (Skills) కావాలి ?

డేటా సైన్స్ కి ఆల్గారిథమ్స్ ప్రధానం. అందుకే వీటి గుర్తించడం,  కొత్తగా సృష్టించడం, వాటిని నిర్వహణ కోసం  డేటా సైన్స్ స్పెషలిస్టులు అవసరం అవుతున్నారు.  కొత్తగా ఆదాయ వనరులను సృష్టించాలంటే కొత్త అల్గారిథమ్స్ ను సృష్టించగలిగే సత్తా  ఉన్నవారికి గుర్తింపు ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ తో పాటు పైథాన్ ప్రోగ్రామింగ్, లాంగ్వేజ్ పై పట్టు సాధించిన వారికి డేటా సైన్స్ స్పెషలిస్ట్ గా గుర్తింపు దక్కుతుంది. SAS, Excel, Tab Leak, SQL లాంటి తెలిసి ఉండాలి.

గుర్తుంచుకోండి…..

  • బీటెక్ ఫ్రెషర్స్ గ్రాడ్యుయేషన్ తో పాటు స్టాటిస్టిక్స్ పై కూడా పట్టు పెంచుకుంటే డేటా సైన్స్ ఉద్యోగాల్లోకి జాయిన్ అవ్వొచ్చు.
  • మిడ్ లెవెల్ ఎంట్రీకి అయితే మూడు నుంచి ఐదేళ్ల లోపు డేటా సైన్స్ రంగంలో పనిచేసిన అనుభవం, ఎంటెక్ ఉండాలి.
  • సీనియర్ పొజిషన్లు కావాలని అనుకునేవారికి డేటా సైన్స్ రంగంలో ఆరేడేళ్ల అనుభవంతోపాటు గతంలో కొన్ని ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి. Chief Data Officer, Director of Data Sciences లాంటి పోస్టులను మంచి ప్యాకేజీతో ఆఫర్లు ఉంటాయి.

సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి

Technical Skills తో పాటు Soft Skills కూడా అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఈ డేటా సైన్స్ రంగంలో రాణించడానికి అవకాశం ఉంటుంది. పని మీద ఇంట్రెస్ట్ ఉండాలి… బిజినెస్ పై ఐడియా, టీమ్ వర్క్ , కొత్త కొత్త ఆలోచనలకు పదును పెట్టడం లాంటివి అభ్యర్థులు అలవాటు చేసుకోవాలి.  అప్పుడే కంపెనీలు మంచి జీతాలు, హయ్యర్ పొజిషన్స్ ఇస్తాయి.

డేటా సైన్స్ లో అడుగు పెట్టాలంటే…

డేటా సైన్స్ లో పనిచేయాలనే ఆసక్తి ఉన్నవారు… సమాచారాన్ని గుర్తించగలగాలి, నాణ్యమైన సమాచారాన్ని సేకరించడంపై దృష్టి పెట్టాలి. డేటా మేళవింపు, మదింపు ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. విస్తృతమైన సమాచారాన్ని తీసుకొని… కస్టమర్ల ఆలోచనలకు అనుగుణంగా దాన్ని మలిచే స్వభావం డేటా సైంటిస్టులకు చాలా అవసరం.

* మెడికల్ సెక్టార్ లో ఇమేజెస్ విశ్లేషణ, ఫార్మా రంగంలో పరిశోధనలు, కొత్త ఫార్ములాలను తయారు చేయడం,

*ఈ-కామర్స్ లో భవిష్యత్తులో అమ్మకాలకు అవకాశం గల వస్తువుల గుర్తించడం, వినియోగదారుల కొనుగోళ్ల ధోరణి,  అమ్మకాల పెరుగుదల కోసం తీసుకునే నిర్ణయాలకు డేటా సైన్స్ సేవలు బాగా ఉపయోగపడుతున్నాయి.

ప్రస్తుత నాలెడ్జ్ బేస్డ్ సొసైటీకి డేటా  బేస్ మార్కెట్ ను సృష్టించే సత్తా ఉన్న డేటా సైన్స్ స్పెషలిస్టులకు మంచి అవకాశాలు ఉన్నాయి.  అలాంటి వారి కోసం వేల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version