Home TGPSC Prep GROUP 1 మీరూ Group.1 విజేతలు కావొచ్చు !

మీరూ Group.1 విజేతలు కావొచ్చు !

0

మీరూ Group.1 విజేతలు అవ్వొచ్చు… అనగానే… ఇదేదో మనకు సంబంధించింది కాదులే అనుకోకండి… తెలివి కలిగిన వాళ్ళకే ఆ పోస్టులు… మెయిన్స్ లో ఎస్సేస్ మనం రాయలేం… అసలు నోటిఫికేషన్ వస్తుందా… ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు మీలో చాలామందికి వచ్చి ఉంటాయి… విజయం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదని గుర్తుంచుకోండి.  Group.1 కి ముందు నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి… గ్రూప్ 1 విజేతలు కావాలి ఎలాంటి ప్రిపరేషన్ వ్యూహం ఉండాలి అన్నది ఈ ఆర్టికల్ లో వివరిస్తాను.

Exams

గత అనుభవం… కొత్త పాఠం నేర్పుతుంది !

మీలో చాలామంది పోలీస్ ఉద్యోగాలు, TGPSC ఎగ్జామ్స్ చాలా రాసి ఉంటారు.  మంచిగా ప్రిపేర్ అయి ఉన్నారు. మీలో కాన్ఫిడెన్స్ లెవల్స్  కూడా బాగా ఉంటాయి.  మీరు విజేతలు అవ్వొచ్చు… కాకపోవచ్చు… కానీ మీరు ఎక్కడెక్కడ తప్పులు చేశారో ఇప్పటికే గ్రహించి ఉంటారు.. చాలా అనుభవం కూడా వచ్చి ఉంటుంది. మరి అలాంటప్పుడు…

మీరు గ్రూప్ 1 విజేత ఎందుకు కాకూడదు… Group.1 కి అర్హత డిగ్రీ… అది మీకు ఉంది. వయో పరిమితి కూడా ఉంది… మీరెందుకు విజేతలు కాకూడదు… మీలో ఆ స్ఫూర్తి నింపేందుకు, మీ వెన్నంటి గైడెన్స్ ఇచ్చేందుకు మన

1) Telangana Exams Website

2) Telangana Exams You tube Channel

3) Telangana Exams plus app అండగా ఉంటాయి.

ఇవి గుర్తుంచుకోండి

మీరు Group.1 లో విజేతలు కావాలంటే తప్పనిసరిగా  సుదీర్ఘకాలంగా ప్రిపరేషన్ కావాలి…. ఈ క్షణం నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టాలి.

Group.1 ఏ పోస్టులు ఉంటాయి ? (Group.1 Posts )

  • డిప్యూటీ కలెక్టర్
  • డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
  • కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్
  • జిల్లా రిజిస్ట్రార్లు
  • రవాణా శాఖ అధికారులు
  • మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ – 2 etc., పోస్టులు ఉంటాయి.

Group.1 ఎంపిక ఎలా ? (Group.1 Selection )

Group.1 ఆఫీసర్ కావాలంటే మూడు దశల్లో ఎంపిక ప్రక్రియలో విజేతలు కావాలి.

ముందుగా ప్రిలిమ్స్ (Group.1 Prelims)

ఇది ఆబ్జెక్టివ్ తరహాలో 150 మార్కులకు ఉంటుంది. పోస్టుల సంఖ్యకు దాదాపు 50 రెట్ల మందిని అంటే 1:50 మెయిన్స్ కి ఎంపిక చేస్తారు..

ఇక Group.1  మెయిన్స్  పూర్తిగా డిస్క్రిప్టివ్ తరహాలో ఉంటుంది… అంటే వ్యాస రచన

TSPSC ఏర్పడ్డాక గ్రూప్ 1 సిలబస్ లో అనేక మార్పులు, చేర్పులు చేసింది… గ్రూప్ 1 లక్ష్యంగా ప్రిపేర్ అయ్యేవారు సిలబస్ లో వచ్చిన మార్పులను ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోవాలి.  దాన్ని బట్టిన తమ వ్యూహాన్ని సిద్దం చేసుకోవాలి.

మెయిన్స్ లో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి… ఒక్కో పేపర్ 150 మార్కులు … అంటే టోటల్ గా 900 మార్కులకు మెయిన్స్ ఉంటుంది.

ఇవి కాకుండా జనరల్ ఇంగ్లీష్ 150 మార్కులు… ఇది అర్హత పరీక్ష మాత్రమే.

గతంలో మెయిన్స్ పూర్తి అయ్యాక 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉండేది.  కానీ ఇప్పుడు దాన్ని తొలగించారు.

Group.1 Prelims అర్హత పరీక్ష మాత్రమే !

గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ …. మెయిన్స్ కి అర్హత సాధించడానికి మాత్రమే… మీరు గ్రూప్ 1 ఆఫీసర్ గా ఎంపిక కావాలంటే మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులే ప్రాతిపదిక…. అంటే మెయిన్స్ లో 900 మార్కుల్లో మీరు ఎంత ఎక్కువ సాధిస్తే… విజయానికి అంత దగ్గర అవుతారు.

Group.1 Prelims ఎలా ?

జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకు ఉంటుంది.   రెండున్నర గంటలు టైమ్ ఉంటుంది…

Group. 1 Mains ఎలా ?

జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది… ఇది అర్హత పరీక్ష మాత్రమే ఇందులో వచ్చే మార్కులను ఉద్యోగానికి తుది ఎంపికలో లెక్కలోకి తీసుకోరు..

జనరల్ ఇంగ్లీష్ 150 మార్కులు…. 3 గంటల టైమ్ ఉంటుంది.

Group.1 First Paper : 

మెయిన్స్ లో పేపర్ 1 కింద జనరల్ ఎస్సేలో మొదటి పేపర్ – 3 గంటలు… 150 మార్కులు.

  • సమకాలీన సామాజిక అంశాలు, సాంఘిక సమస్యలు
  • ఆర్థిక వృద్ధి, న్యాయం సంబంధిత అంశాలు
  • భారత రాజకీయాలు – గతిశీలత
  • భారత చారిత్రక, సాంస్కృతిక వారసత్వం
  • శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగతి తాజా పరిణామాలు
  • విద్య, మానవ వనరుల అభివృద్ధి

Group. 1 Second Paper : 

చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం అంశాలు ఉంటాయి.  150 మార్కులు 3 గంటల టైమ్ ఉంటుంది

  1. మొదటి టాపిక్ భారత చరిత్ర, సంస్కృతి , ఆధునిక భారత దేశ చరిత్రకు ప్రాధాన్యం అంటే 1757 నుంచి 1947 సంవత్సరం వరకూ
  2. రెండో టాపిక్ తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం
  3. మూడో టాపిక్ భారత దేశం, తెలంగాణ భౌగోళిక శాస్త్రం

Group. 1 Third Paper : 

భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన… ఇది 150 మార్కులు… 3 గంటల టైమ్ ఉంటుంది.

  1. మొదటి టాపిక్ – భారతీయ సమాజం, అంతర్నిర్మాణం సమస్యలు, సామాజిక ఉద్యమాలు
  2. రెండో టాపిక్ – భారత రాజ్యాంగం గురించి
  3. మూడో టాపిక్ – ప్రభుత్వ పరిపాలన

Group. 1 Fourth Paper : 

ఆర్థిక వ్యవస్థ – అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఉంటాయి.  150 మార్కులకు 3 గంటల టైమ్ ఉంటుంది.

  1. మొదటి టాపిక్ – భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
  2. రెండో టాపిక్ – తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
  3. మూడో టాపిక్ – అభివృద్ధి, పర్యావరణ సమస్యలు

Group. 1 Fifth Paper : 

సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ ప్రిటేషన్ … ఈ పేపర్ 150 మార్కులకు… 3 గంటల టైమ్ ఉంటుంది

  1. మొదటి టాపిక్ – సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర, ప్రభావం
  2. రెండో టాపిక్ – సైన్స్ – దాని ఆధునిక అనువర్తనాలు, అంటే మోడ్రన్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్…
  3. మూడో టాపిక్ – డేటా ఇంటర్ ప్రిటేషన్ అండ్ ప్రాబ్లం.. సాల్వింగ్

Group. 1  Sixth Paper : 

తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం… 3 గంటల టైమ్ ఉంటుంది.  150 మార్కులు

  1. మొదటి టాపిక్ – 1948 నుంచి 1970 వరకూ తెలంగాణ భావన
  2. రెండో టాపిక్ – 1971 నుంచి 1990 తెలంగాణ ఉద్యమంలో సమీకరణ దశ
  3. మూడో టాపిక్ – 1991 నుంచి 2014 వరకూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశ వరకూ

ప్రిలిమ్స్ నుంచే కాంపిటేషన్ !

అయితే అసలు ప్రిలిమ్స్ నుంచే టఫ్ కాంపిటేషన్ మొదలవుతుంది…. గ్రూప్ 1 కి ప్రిపేర్ అయ్యే ముందు ఎలా వ్యూహం అనుసరించాలో ఇప్పుడు తెలుసుకోండి.

గ్రూప్ 1 ఎగ్జామ్ విధానం, సిలబస్ మీద ముందు పట్టు సాధించాలి.  ప్రిలిమ్స్, మెయిన్స్ లో ఉమ్మడిగా ఉన్న అంశాలను గుర్తించండి… వాటి ప్రిపరేషన్ ముందే మొదలుపెట్టి పూర్తి చేయండి… నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయినా… ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. సిలబస్ పై పట్టు సాధిస్తే చాలు… ఎగ్జామ్ లో సగం విజయం సాధించినట్టే. ఇందులో భాగంగా మీరు గత పరీక్షా పత్రాలను ఒకసారి పరిశీలించండి… ఆ తర్వాత మెటీరియల్ ను సేకరించాలి… ఎక్కువ మెటీరియల్ సేకరించి… అనవసరంగా చదివేసి… టైమ్ వేస్ట్ చేసుకోవద్దు.  లిమిటెడ్ బుక్స్ … క్వాలిటీ బుక్స్ కావాలి…  మీరు గమనించారో… లేదో…. చాలామంది సివిల్స్, గ్రూప్స్ విజేతలు చెప్పేది ఒక్కటే… తాము తక్కువ పుస్తకాలు ఎక్కువసార్లు చదివామని… మీరు ఎలాంటి బుక్స్ తీసుకోవాలి అన్నది మరో ఆర్టికల్ లో వివరిస్తాను.

చివరగా మీకు చెప్పేది ఒక్కటే…

ఈమధ్యే గ్రూప్ 1 కి మెయిన్స్ పూర్తయ్యాయి.  అయితే తెలంగాణ జాబ్ కేలండర్ ప్రకారం 2024 అక్టోబర్ లోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కొత్త నోటిఫికేషన్ రావాలి.  కానీ SC వర్గీకరణ వల్ల లేట్ అయింది.  అంటే ఖచ్చితంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ 2025 జనవరి, ఫిబ్రవరి తర్వాత అయినా వస్తుంది… రాష్ట్రంలో గ్రూప్ 1 కి ఖాళీలు ఉన్నాయి…   ఈ పోస్టు మీరు కొడితే…. రాష్ట్ర స్థాయిలో మీరు IAS, IPSతో సమానం.  అందుకే ఏ ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేసుకోవద్దు…

ప్రిపరేషన్ కు ముందు గుర్తుంచుకోండి !

గ్రూప్ 1 ప్రిపరేషన్ ప్రారంభించేముందు ఈ కింది విషయాలను గుర్తుపెట్టుకోండి.

—————————————————————————————————–

మొదటిది – సిలబస్, పాత ప్రశ్నాపత్రాల మీద పూర్తిగా అవగాహనకు రావాలి

రెండోది – పోటీ తీవ్రంగా ఉంటుంది… ప్రిలిమ్స్ పేపర్ కూడా కఠినంగా ఉంటుంది…  ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులవడం కూడా ఇంపార్టెంటే… అందువల్ల మంచి ప్లానింగ్ ఉండాలి.

మూడోది – కోచింగ్ లేకుండా కూడా గ్రూప్  1 కొట్టొచ్చని చాలామంది టాపర్స్ చెప్పారు.  మీరూ సాధించడానికి ఛాన్స్ ఉంది.  కాకపోతే దానికి ముందు నుంచి ప్లానింగ్ తో చదవాలి.  రోజువారీగా స్టడీ ప్లాన్ వేసుకోవాలి.

నాలుగో సూచన – ప్రిలిమ్స్ తో మెయిన్స్ కలిపి ప్రిపరేషన్ మొదలుపెట్టాలి.  ప్రిలిమ్స్ పాసయ్యాక చూద్దాం అని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ ఇంకో లాభం కూడా ఉంది…. మెయిన్స్ కోసం మీరు డెప్త్ గా ప్రిపేర్ అవ్వాలి… అప్పుడు ప్రిలిమ్స్ మీకు ఈజీ అవుతుంది.  ఎలాంటి ప్రశ్ననైనా అవలీలగా రాయొచ్చు.

—————————————————————————————————–ఈ నాలుగు ప్రాథమిక సూచనలు పాటిస్తూ… ముందుగా గ్రూప్ 1 ప్రిపరేషన్ మొదలు పెట్టండి…

కోర్టుల్లో ఎన్ని కేసులు పడినా ప్రభుత్వం అనుకున్నదే సాధ్యమైంది.  జనరల్ గా కోర్టులు కూడా రిక్రూట్ మెంట్స్ కీలక దశల్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోవు.  సో … మీరు కొత్త ఏడాది 2025లో గ్రూప్ 1 టార్గెట్ గా పెట్టుకుంటే మాత్రం… ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.

గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకూ మన Telangana Exams plus యాప్ లో కోర్సును అందుబాటులోకి తీసుకొస్తాం. 2024లో జరిగిన ప్రిలిమ్స్ లో చాలా మంది మన కోర్సులో జాయిన్ అయిన వారు విజయం సాధించారు. చాలా మంది మెస్సేజ్ లు కూడా పెట్టారు.

గ్రూప్ 1 ప్రిలిమ్స్ , మెయిన్స్ కలిపి ఎలా ప్రిపేర్ అవ్వాలో మరో ఆర్టికల్ లో వివరిస్తాను. మీరు పనిచేస్తున్న ఉద్యోగాలు ఇప్పుడే మానేసి చదవనక్కర్లేదు.  ఉన్న టైమ్ ని సద్వినియోగం చేసుకుంటూ ప్లాన్ చేసుకోండి.  నోటిఫికేషన్ పడ్డాక మరింత విస్తృతంగా ఎలా చదవాలన్నది అప్పుడు మళ్ళీ వేరే ప్లాన్ చేసుకోండి… ముందుగా గ్రూప్ 1 పాత ప్రశ్నాపత్రాలను తిరగేయండి…

All the best

Vishnu Kumar Medukonduru

Senior Journalist, Content Creator, Education motivator

ఇది కూడా చదవండి : Group.1 Supreme court : గ్రూప్ 1 రద్దు కుదరదు – తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version