Home TGPSC Prep GROUP 1 Group.1 Supreme court : గ్రూప్ 1 రద్దు కుదరదు – తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

Group.1 Supreme court : గ్రూప్ 1 రద్దు కుదరదు – తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

0
Breaking news with world map background. Vector

తెలంగాణలో Group.1 Notification రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. Group.1 Notification రద్దు చేయడంతో పాటు… Mains వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను పక్కన పెట్టి 2024లో కొత్త ప్రకటన విడుదల చేయడం చట్ట విరుద్దమని అభ్యర్థులు వాదించారు. ఇదే విషయమై తెలంగాణ హైకోర్టులో కొందరు అభ్యర్థులు గతంలో పిటిషన్ ఫైల్ చేశారు. అలాగే 2024 గ్రూప్ -1 Prelims లో 14 తప్పులు ఉన్నాయనీ… Mains వాయిదా వేయాలని అభ్యర్ధులు కోరారు.

ఇది కూడా చదవండి : Telangana Jobs 2025: త్వరలో మరో 16వేల పోస్టులకు నోటిఫికేషన్

ఈ పిటిషన్ విషయంలో తెలంగాణ హైకోర్టులో అభ్యర్థులకు అప్పట్లో ఊరట లభించలేదు. వాళ్ళ పిటిషన్ ను కొట్టివేయడంతో… హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. జస్టిస్ P.S. నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. అయితే Supreme Courtను ఆశ్రయించిన ఈ అభ్యర్థులెవరూ Prelims పాస్ అవలేదు. అందువల్ల Group.1 Mains వాయిదా వేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదనీ… దీనివల్ల రిక్రూట్ మెంట్ ప్రక్రియ బాగా ఆలస్యం అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అభ్యర్థుల అభ్యంతరాలను పక్కన పెట్టి Mains నిర్వహణకు సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పేపర్ లీక్ తోనే ఇబ్బందులు

BRS ప్రభుత్వం 2022లోనే 503 Group.1 పోస్టులకు Notification ఇచ్చింది. అప్పట్లో 2 సార్లు పరీక్షలు నిర్వహించింది. అయితే ఓసారి పేపర్ లీక్ అయింది. మరోసారి బయోమెట్రిక్ తదిరత నిర్వహణ లోపాలతో రెండు సార్లూ రద్దయ్యాయి. రెండోసారి నిర్వహించిన Group. 1 prelims ఫలితాల వెల్లడికి అనుమతి కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఆ తర్వాత BRS అధికారం కోల్పోవడం… కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడం జరిగాయి. రేవంత్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంది. అందుకు సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత TGPSC మొదట ఉన్న 503 పోస్టులతో పాటు మరో 60 పోస్టులు కలిపి కొత్తగా 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది.

ఇది కూడా చదవండిGroup 2 Exam ముందు రోజు… ఎగ్జామ్ హాల్లో ఎలా ?

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version