Home Jobs & Results Central Govt ఉద్యోగాల పేరుతో భారీ మోసం: 24 లక్షలు టోకరా

ఉద్యోగాల పేరుతో భారీ మోసం: 24 లక్షలు టోకరా

0

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ సోషల్ మీడియాలో వచ్చే మెస్సేజ్ లు అస్సలు నమ్మకండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు… ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ అనేది నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే జరుగుతుందని గమనించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ back doorలో ఉద్యోగాలు వస్తాయని ఆశలు పెట్టుకోవద్దు. అలా ఇప్పిస్తామని వచ్చే ప్రకటనలు నమ్మారంటే సైబర్ క్రిమినల్స్ వలలో చిక్కుకున్నట్టే.

Fake jobs

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు… ఈ కింది నెంబర్లలో సంప్రదించండి అంటూ Instagram లో వచ్చిన ప్రకటన చూసి మోసపోయాడు ఓ యువకుడు. ఆ కేటుగాడు నకిలీ ఆఫర్ లెటర్ పంపించి… ఏకంగా రూ.24.50 లక్షలు దొబ్బేశాడు. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి Instagram లో రీల్స్ చూస్తుండగా Central Government ఉద్యోగం ప్రకటనల చూశాడు. ఆ నంబర్లకు కాల్ చేశాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థ National Remote Sensing Centre లో ఉద్యోగం ఉందనీ… తాను అందులో పెద్ద పోస్టులో ఉన్నానంటూ నకిలీ ఐడీ కార్డు పంపించాడు. అది నమ్మిన యువకుడు ఆ కేటుగాడికి దఫ దఫాలుగా రూ.24.50 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ యువకుడికి నకిలీ ఆఫర్ లెటర్ పంపాడు. ఈ ఆఫర్ లెటర్ ఫేక్ అని తెలుసుకున్న యువకుడు ఆ క్రిమినల్ సంప్రదించాడు. ఇది కాదు… ఇంకో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మళ్ళీ నమ్మించే ప్రయత్నం చేశాడు. తాను మోసపోయినట్టు గ్రహించిన ఆ యువకుడు గురు సైబర్ క్రైం పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేంద్ర ప్రభుత్వం లేదంటే రాష్ట్ర ప్రభుత్వం… ప్రభుత్వ రంగ సంస్థలు… ఇలా ఎందులో డబ్బులు ఇస్తే back door లో ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరూ నమ్మొద్దు.

ఈమధ్య కాలంలో Remote Jobs, ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేయొచ్చు (Work from Home), Apprentice jobs అంటూ కూడా బురిడీ కొట్టిస్తున్నారు.  ఇలాంటి ఫేక్ కాల్స్ ఎవరూ నమ్మొద్దు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు కాల్ చేయండి

TGPSC ఉద్యోగాలంటే నమ్మొద్దు

Groups ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా దళారులు సంప్రదిస్తే తమకు complaint చేయాలని TGPSC తెలిపింది. తప్పుడు హామీలతో మోసం చేయాలని చూసే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా దళారులు… అభ్యర్ధులను సంప్రదిస్తే Vigilance Mobile Number. 99667 00339కు సమాచారం ఇవ్వాలి. లేదంటే vigilance@tspsc.gov.inకు ఈ-మెయిల్ ద్వారా complaint చేయొచ్చు.

ఇది కూడా చదవండి : మీరూ Group.1 విజేతలు కావొచ్చు !

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version