G-948507G64C
Home Blog Page 3

10 English vocabulary words

Of course! Here are 10 English vocabulary words that are useful for UPSC, Bank, and RRB aspirants, along with their synonyms, antonyms, alternate words, and usage sentences:

1. **Abundant**
– **Synonyms**: plentiful, ample, bountiful
– **Antonyms**: scarce, limited, insufficient
– **Alternate Words**: copious, profuse
– **Usage Sentence**: The region has an abundant supply of natural resources.

2. **Candid**
– **Synonyms**: honest, frank, straightforward
– **Antonyms**: deceitful, dishonest, insincere
– **Alternate Words**: open, truthful
– **Usage Sentence**: Her candid remarks were appreciated during the meeting.

3. **Diligent**
– **Synonyms**: hardworking, industrious, meticulous
– **Antonyms**: lazy, negligent, careless
– **Alternate Words**: thorough, persistent
– **Usage Sentence**: He was diligent in his efforts to learn the new software.

4. **Eloquent**
– **Synonyms**: articulate, fluent, expressive
– **Antonyms**: inarticulate, tongue-tied, unclear
– **Alternate Words**: persuasive, poignant
– **Usage Sentence**: The politician’s eloquent speech won over the audience.

5. **Frugal**
– **Synonyms**: thrifty, economical, prudent
– **Antonyms**: extravagant, lavish, wasteful
– **Alternate Words**: sparing, stingy
– **Usage Sentence**: They lived a frugal lifestyle to save money for their children’s education.

6. **Gregarious**
– **Synonyms**: sociable, outgoing, extroverted
– **Antonyms**: reserved, introverted, shy
– **Alternate Words**: amiable, convivial
– **Usage Sentence**: His gregarious nature made him popular among his peers.

7. **Impartial**
– **Synonyms**: unbiased, neutral, fair
– **Antonyms**: biased, partial, prejudiced
– **Alternate Words**: objective, equitable
– **Usage Sentence**: The judge remained impartial throughout the trial.

8. **Obscure**
– **Synonyms**: unclear, vague, ambiguous
– **Antonyms**: clear, obvious, evident
– **Alternate Words**: cryptic, concealed
– **Usage Sentence**: The meaning of the ancient text was obscure to the researchers.

9. **Prolific**
– **Synonyms**: productive, fertile, fruitful
– **Antonyms**: unproductive, barren, infertile
– **Alternate Words**: abundant, bountiful
– **Usage Sentence**: She is a prolific writer, having published numerous books.

10. **Tenacious**
– **Synonyms**: persistent, determined, resolute
– **Antonyms**: yielding, weak, irresolute
– **Alternate Words**: steadfast, relentless
– **Usage Sentence**: His tenacious attitude helped him overcome many challenges.

These words should be quite helpful for your preparation.

Group 2 Exam ముందు రోజు… ఎగ్జామ్ హాల్లో ఎలా ?

TGPSC గ్రూప్ 2 ఎగ్జామ్ కి ఇంకా ఎంతో టైమ్ లేదు.  ఈ కొద్ది రోజుల్లో అభ్యర్థులు ఏ మాత్రం టెన్షన్ పడకుండా తమ ప్రిపరేషన్ సాగించాలి.  మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటే… ఎగ్జామ్ ని మీరు అనుకున్న దాని కంటే ఇంకా perfect గా రాయగలుగుతారు.  ఎగ్జామ్ కి వెళ్ళే ముందు రోజు ఎలా ఉండాలి ? అలాగే ఎగ్జామ్ హాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఈ ఆర్టికల్ లో వివరిస్తాం.. 

Group.2 Exam

2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో Group.2 exam నిర్వహణకు TGSPSC  అన్ని ఏర్పాట్లు చేస్తోంది.  అదే రోజు RRB JE ఎగ్జామ్ ఉన్నందున పోస్ట్ పోన్ చేయాలని కొందరు అభ్యర్థులు కోరుతున్నారు.  అయితే ఈ RRB పోస్టులకీ – గ్రూప్ 2 ని కూడా రాస్తున్న అభ్యర్థుల 20 మందికి మించి లేరని వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ Group 2 ఎగ్జామ్ నిర్వహణకు ఇప్పటికే 33 జిల్లా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు జరిగాయి.  అందువల్ల ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మార్చేది లేదని TGPSC అధికారులు చెబుతున్నారు.  గతంలో ఇలాగే గ్రూప్ 1 మెయిన్స్ కి మంచి ప్రిపేర్ అయిన అభ్యర్థులు కూడా  చివరి నిమిషంలో వాయిదా పడుతుందని ఆశలు పెట్టుకొని సరిగా ప్రిపేర్ అవ్వలేకపోయారు.  అందుకే మళ్ళీ అలాంటి ఊహాగానాలకు అవకాశం ఇవ్వకుండా… మీరు మాత్రం ప్రిపరేషన్ లోనే ఉండగలరు.  ఈ నెల డిసెంబర్ 9 నుంచి TGPSC WEBSITE లో గ్రూప్ 2 హాల్ టిక్కెట్స్ అందుబాటులోకి వస్తాయి.

మీ సెంటర్ ముందే తెలుసుకోండి !

మీకు హాల్ టిక్కెట్స్ రాగానే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడిందో తెలుసుకోండి.  దాదాపు మీరు అప్లయ్ చేసిన మీ జిల్లా కేంద్రంలోనే ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది.  కాకపోతే… ఏ సెంటర్ లో ఎగ్జామ్ రాయాలన్నది తెలుస్తుంది కాబట్టి… ఆ కేంద్రానికి  టైమ్ కి చేరుకోడానికి ఉన్న ఏర్పాట్లను చూడండి.  బస్సులు లేదా బండ్ల మీద వెళ్ళడానికి ముందే ప్లాన్ చేసుకోండి.  ఈ విషయం మాకు తెలుసు కదా అని అనుకోవద్దు.  చాలామంది ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసిన తర్వాత  వచ్చి రిటర్న్ వెళ్ళిపోతున్న సంఘటనలు చాలా జరుగుతున్నాయి.  మీరు గ్రూప్ 2 ఆఫీసర్ కోసం పోటీపడుతున్నారు. అందువల్ల ఇలా టైమ్ అయిపోయాక వచ్చి… ఇంటికి వెళ్ళిపోయే సందర్భాన్ని కలిగించుకోవద్దు.

ఇది కూడా చదవండి : Group.3 ఫలితాలు లేట్ : 1,2 పోస్టుల భర్తీ తర్వాతే ….

Exam centre

పరీక్ష ముందు రోజు ఎలా ఉండాలి ?

పరీక్షకు ఒక రోజు ముందు అభ్యర్థులు తెల్లారి ఎగ్జామ్‌ సెంటర్‌కు వెళ్లేందుకు అవసరమైన వాటిని సిద్ధం చేసుకోండి. మొదటి రోజు పేపర్ 1కి తీసుకెళ్ళిన  హాల్ టిక్కెట్ నే మిగతా అన్ని పరీక్షలకు తీసుకెళ్ళాలి. పైగా Group.2 రిక్రూట్ మెంట్ ప్రాసెస్ పూర్తి అయ్యేదాకా కూడా అదే హాల్ టిక్కెట్ మీ దగ్గర ఉండాలి.  అందువల్ల ఆ హాల్ టిక్కెట్ ను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు.  చాలా భద్రంగా దాచుకోండి.

గ్రూప్ 2 ఎగ్జామ్ కి చాలా తీవ్ర పోటీ ఉంది. అందువల్ల చివరి నిమిషం దాకా టైమ్ వేస్ట్ చేసుకోకుండా చదవాలి అనే కోరిక చాలా మంది ఉంటుంది. కానీ అతిగా చదవడం వల్ల మానసిక ఒత్తిడి, అలసటకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. రేయింబవళ్లు శ్రమిస్తేనే మంచి మార్కులు వస్తాయని భ్రమలో ఉండొద్దు. అలాంటి భ్రమలోనే కొందరు ఆరోగ్యం లెక్క చేయకుండా… ప్రిపేర్ అవుతూ ఉంటారు. పరీక్షకు ముందు రోజు కూడా అర్థరాత్రి దాకా చదువుతారు. కానీ అలా చేయొద్దు. ముందు రోజు అర్థరాత్రి దాకా మెలకువతో ఉంటే… తెల్లారి exam centre లో మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందువల్ల ముందు రోజు  ఎలాంటి ఆందోళన లేకుండా… హాయిగా కంటి నిండా నిద్ర పోండి. ప్రశాంతంగా పరీక్షకు హాజరవ్వండి.

ఇది కూడా చదవండి : 8000 VRO పోస్టులపై అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు

ఎగ్జామ్ హాల్ టిప్స్

Exam

మీరు గత రెండేళ్ళుగా ఎంతో కష్టపడి చదివారు… అయినా ఎగ్జామ్ రోజు రెండున్నర గంటల టైమ్ లో మీరు చూపించే టాలెంట్ మీదే మీ ఉద్యోగం ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఎగ్జామ్ రోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎగ్జామ్ లో ఆన్సర్స్ పెట్టడానికి ఉద్దేశించిన OMR షీట్‌ ను జాగ్రత్తగా నింపాలి. ఎలాంటి తప్పులు రాకుండా చూసుకోండి. OMR షీట్ Fill చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండండి… షీట్ చేతికి రాగానే హడావిడిగా నింపే ప్రయత్నం చేస్తే… ఎంత బాగా రాసేవాళ్ళకి అయినా తప్పులు పోయే ఛాన్సుంది.

తర్వాత Question Paper ని కూడా తీసుకోగానే హడావిడిగా జవాబులు గుర్తించే ప్రయత్నం చేయొద్దు. ముందుగా ప్రశ్నాపత్రం మొత్తం ఒక్కసారి మొత్తం చూడండి. 1 నుంచి 150 వ ప్రశ్న వరకూ పైపైన చదవండి… కనీసం 10 నిమిషాల టైమ్ అయినా పెట్టండి.  దాంతో ప్రశ్నల స్థాయి మీకు అర్థమవుతుంది.  ముందు చూసినప్పుడు కఠినంగా అనిపించినా… రాసేటప్పుడు మాత్రం ఈజీగానే అనిపిస్తాయి.

ఇక్కడ మూడు స్టెప్స్ ఫాలో అవ్వాలి:

1st STEP:

మొదట మీకు బాగా ఈజీగా అనిపించిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఇవ్వండి.

2nd STEP

రెండో స్టెప్ లో ఓ మోస్తరు క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.

3rd STEP

చివరగా అత్యంత క్లిష్టంగా భావించిన ప్రశ్నలపై దృష్టి పెట్టాలి.

ఎలాగూ TGPSC ఎగ్జామ్స్ లో నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు కాబట్టి… దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే ప్రయత్నం చేయండి.

ఇంకో టెక్నిక్

ఎగ్జామ్ ఆబ్జెక్టివ్‌ టైప్ లో ఉన్న వాళ్ళు సాధారణంగా ఓ టెక్నిక్ ఫాలో అవుతూ ఉంటారు… ఎలిమినేషన్‌ టెక్నిక్‌…. అంటే  ప్రశ్నకు ఇచ్చిన 4 answersలో… ఆ question కి suit కాని answer ఒక్కోటి తొలగించుకుంటూ.. చివరగా మిగిలిన ఆప్షన్‌ను ఆన్సర్ గా గుర్తించండి. ఈ టెక్నిక్‌­ను కూడా ఎగ్జామ్ చివరి step-3 లో ఫాలో అవ్వండి. అప్పటికే మీకు ఆన్సర్లు తెలిసి­న అన్ని ప్రశ్నలను పూర్తి చేసుకొని ఉంటేనే…  elimination or guessing method ని ఫాలో అవ్వండి.

చివరగా మరో ముఖ్య విషయం….

Exam Centre

OMR షీట్ లో answers బబుల్స్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు సమాధానం గుర్తిస్తున్న ప్రశ్న సంఖ్య… ఆప్షన్ సరిగ్గా చూసుకొని… దానికి అనుగుణంగా OMR షీట్ లో అదే సంఖ్య దగ్గర సమాధానం అంటే bubbling చేస్తున్నామా లేదా చూసుకోండి. హడావిడి పడొద్దు. టైమ్ చాలా ఉంటుంది.

ఆరోగ్యం జాగ్రత్త….

Study

ఈ వారం, 10 రోజులు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి… సిలబస్ రివిజన్ కోసం ఆరాటపడి… రాత్రిళ్ళు ఎక్కువ టైమ్ మేల్కొని ఉండొద్దు.  అలాగే బయటి ఫుడ్ తినొద్దు… ఆలోచనలతో… టెన్షన్ తో గడపకుండా… ప్రశాంతంగా ఉండండి. ఎగ్జామ్ ముందు రోజు వరకూ డైలీ టైమ్ టేబుల్ ఫాలో అవ్వండి.

అంతా మంచే జరుగుతుంది… అంతా మన మంచికే అన్న సూత్రాన్ని ఫాలో అవ్వండి.

All the best….

 

 

 

 

 

 

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

Group.3 ఫలితాలు లేట్ : 1,2 పోస్టుల భర్తీ తర్వాతే ….

తెలంగాణలో TGPSC గ్రూప్ 3 ఫలితాలు ఆలస్యంగా రిలీజ్ అవ్వనున్నాయి. మొదట Group.1, Group.2 ఫలితాల తర్వాత Group 3 విడుదల చేయాలని TGPSC నిర్ణయించింది. గ్రూప్స్ పరీక్షల రిజల్ట్స్, పోస్టుల భర్తీలో అవరోహణక్రమం పాటించాలని భావిస్తోంది.

TGPSC

ఇది కూడా చదవండి : 8000 VRO పోస్టులపై అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు

Group.1 పరీక్షలు అక్టోబరు 21 నుంచి 27 వరకూ జరిగాయి. Group.3 పరీక్షలు November 17, 18 లో నిర్వహించారు. Group.2 పరీక్షలు ఈ నెల అంటే December 15,16 తేదీల్లో జరుగుతున్నాయి. అయితే Groups Results, పోస్టుల భర్తీ విధానం మాత్రం ఈ వరుసలో కాకుండా.. అవరోహణ క్రమంలో పూర్తి చేయాలని కమిషన్ నిర్ణయించింది. అంటే ముందుగా Group.1 ఫలితాలను రిలీజ్ చేస్తారు. ఆ పోస్టుల భర్తీ పూర్తయ్యాక… Group.2 రిజల్ట్స్ ఇస్తారు. ఆ పోస్టులు కూడా భర్తీ చేసిన తర్వాతే Group.3 Results విడుదల చేయాలని TGPSC నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో relinquishment విధానం అమలులో లేదు. కానీ ఇలా భర్తీ చేయడం వల్ల Jobs backlog ఉండకుండా, మెరిట్ ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాలు కోల్పోకుండా ఉంటారు. లేకపోతే ముందే గ్రూప్ 3 ఫలితాలు ఇస్తే… అభ్యర్థులకు ఆ తర్వాత అంతకంటే హైపొజిషన్ లో ఉన్న Group.1, Group.2 లో కొలువులు వస్తే… Group.3 పోస్టులు ఖాళీ అవుతాయి. దానివల్ల నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని TGPSC భావిస్తోంది. అందుకే High position పోస్టుల భర్తీ తరువాత దిగువ category కొలువులను ఫిలప్ చేస్తే పోస్టులు backlog అయ్యే అవకాశం ఉండదని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి.

TGPSC

ఫిబ్రవరిలో Group.1 Results

Group.1 Mains పరీక్షల పేపర్లు దిద్దే కార్యక్రమం స్పీడ్ గా జరుగుతోంది. 2025 February లోగా Mains results ప్రకటించాలన్న భావిస్తోంది. ఆ తర్వాత documents పరిశీలించి… Final results ప్రకటిస్తుంది. 2025 మార్చి కల్లా Group.1 నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత Group.2 ఫలితాలు వెల్లడించి ఆ పోస్టుల భర్తీని TGPSC చేపడుతుంది. ఆ తర్వాత Group.3 Results రిలీజ్ అవుతాయి.

Group.3లో 1388 పోస్టుల భర్తీ కోసం November 17, 18 ల్లో TGPSC పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల evaluation త్వరలో స్టార్ట్ కాబోతోంది. Group.3 ఫలితాలు 2025 March తర్వాతే వచ్చే ఛాన్సుంది. అలాగే Group.1,2 &3 నియామకాల ప్రక్రియ అంతా 2025 April లోపు పూర్తవుతాయి. .

వాళ్ళని నమ్మొద్దు

Groups ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా దళారులు సంప్రదిస్తే తమకు complaint చేయాలని TGPSC తెలిపింది. తప్పుడు హామీలతో మోసం చేయాలని చూసే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా దళారులు… అభ్యర్ధులను సంప్రదిస్తే Vigilence Mobile Number. 99667 00339కు సమాచారం ఇవ్వాలి. లేదంటే vigilance@tspsc.gov.inకు ఈ-మెయిల్ ద్వారా complaint చేయొచ్చు.

ఇది కూడా చదవండి : Telangana Jobs 2025: త్వరలో మరో 16వేల పోస్టులకు నోటిఫికేషన్

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ప్రభుత్వ పథకాలు (pdf)

TGPSC, APPSC తో పాటు Central, State exams అన్నింటిలోనూ బడుగు బలహీన వర్గా సంక్షేమం, ప్రభుత్వ  పథకాలకు సంబంధించి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి.  అందుకే ఈ టాపిక్ మీద MCQs తయారు చేశాం.

బడుగు, బలహీన వర్గాల సంక్షేమం

 

SSC CGL Results 2024 Out : టైర్ -1 ఫలితాలు (pdfs available)

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఉద్దేశించిన Staff Selection Commission (SSC) Combined Graduation Level (CGL) – పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. SSC CGL

2024 సెప్టెంబర్ లో దేశవ్యాప్తంగా కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను(CBT) నిర్వహించింది. Tier-1లో అర్హత సాధించిన అభ్యర్థులు Tier-2 పరీక్షకు ప్రిపేర్‌ కావాలి. Tier-2 పరీక్ష తేదీలను SSC ఈమధ్యే ప్రకటించింది.

SSC CGL TIER-2 ఎగ్జామ్స్ 18,19, 20 జనవరి 2025లో జరుగుతాయి. ఈసారి అత్యధికంగా 17 వేలకు పైగా పోస్టులను SSC ప్రకటించింది. SSC CGL రిజల్ట్స్ ను SSC వెబ్‌సైట్‌ https://ssc.nic.in/లో చూడవచ్చు.

LIST-1_51224

LIST-2_51224

SSC-CGL-Result-List-3

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

8000 VRO పోస్టులపై అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు

తెలంగాణలో 8 వేలకు పైగా గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సహాయకుల నియామకంపై ప్రభుత్వం ఈ నెలలోనే నిర్ణయం తీసుకోబోతోంది. ఈనెల 9 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టబోతోంది. బిల్లు చట్టంగా రూపొందగానే జనవరి 2025లో కొత్త జాబ్ కేలండర్ ద్వారా 8 వేలకు పైగా VRO పోస్టులను భర్తీ చేయనుంది.

ఇది కూడా చదవండి : JRO VRO ఎగ్జామ్ ఎలా ఉండొచ్చు ?

VRO

కొత్త రెవెన్యూ చట్టంలోనే VRO పోస్టులు 

ఈనెల 9 నుంచి జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు ROR బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టబోతోంది. గతంలో గ్రామాల్లో పనిచేసిన గ్రామ రెవన్యూ అధికారి (VRO), గ్రామ సహాయకుడు (VRA)ల లాగే కొత్త పోస్టులను క్రియేట్ చేయబోతోంది. దానికి ఏం పేరు పెడతారన్నది నాలుగైదు రోజుల్లో తేలిపోతుంది. తెలంగాణలో మొత్తం 10,909 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటన్నంటికీ VRA/VRO తరహా పోస్టులు అవసరం ఉంది. అయితే గతంలో ఈ పోస్టుల్లో పనిచేసిన 3 వేల మందికి తిరిగి ఆయా గ్రామాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వీళ్ళు కాకుండా మిగిలిన 8000 దాకా పోస్టులను TGPSC ద్వారా Direct Recruitment ద్వారా నియామకాలు చేపడుతుంది. ఈ పోస్టులకు సంబంధించిన సమాచారం ఇప్పటికే ROR బిల్లులో ఉన్నాయి.

VRO పోస్టులకు అర్హతలు ఏంటి ? వయస్సు ఎంత ?

తెలంగాణాలో 8000 దాకా విలేజ్ రెవెన్యూ అధికారులను ప్రభుత్వం నియమించబోతోంది. ఈ పోస్టులను TGSPSC ద్వారా భర్తీ చేస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జనవరి 2025లో వెలువడే అవకాశం ఉంది. ఈ పోస్టులకు 18 నుంచి 44 యేళ్ళ మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు. వివిధ వర్గాలకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. అలాగే ఇంటర్ లేదా డిగ్రీ అర్హత కలిగినవారికి అవకాశం ఉంటుంది.

మొత్తం పోస్టులు ఎన్ని ?

VRO పోస్టులు మొత్తం 8000 దాకా ఉంటాయి

వయస్సు:

18 నుంచి 44 యేళ్ళ మధ్య వయస్సు కలిగిన వారికి అవకాశం. SC, ST, OBC, అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10యేళ్ళ పాటు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎలా ఎంపిక చేస్తారు ?

గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం TGPSC ద్వారా రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో గతంలో లాగే

1) General Knowledge – 75 Marks

2) Secretarial Abilities – 75 Marks

కి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్… సిలబస్ లో ఏయే టాపిక్స్ ఉంటాయి అన్నది ఈ కింది లింక్ ద్వారా తెలుసుకోగలరు

https://telanganaexams.com/jro-vro-notification-exam-pattern/

శాలరీ వివరాలు:

గ్రామ రెవెన్యూ అధికారులుగా ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹30,000/- వరకు జీతం ఉంటుంది. ఇవి కాకుండా TA, DA, HRA లాంటి అలవెన్సులు కూడా ఉంటాయి.

నోటిఫికేషన్ ఎప్పుడు ?

డిసెంబర్ 9 నుంచి జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ROR బిల్లుతో పాటు గ్రామ రెవెన్యూ అధికారుల నియామకంపై బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. సభలో ఆమోదం తర్వాత గవర్నర్ సంతకంతో కొత్త ROR చట్టం రెడీ అవుతుంది. ఆ తర్వాత 2025 జనవరిలో ప్రకటించే కొత్త జాబ్ కేలండర్ లో 8000 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఉంటాయి.

ముఖ్య గమనిక: గ్రామాల్లో రెవెన్యూ అధికారుల వ్యవస్థ చాలా అవసరంగా ఉంది. అందుకే నియామకాలు చాలా త్వరగానే చేపట్టే అవకాశం ఉంది.

విద్యార్హతలు ఏంటి ?

ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉంటుంది. VRA పోస్టులు ఉంటే ఇంటర్, VROలకు డిగ్రీ ఉండే అవకాశం.

లేదా

గ్రేడ్ 1 రెవెన్యూ గ్రామాల్లో (పెద్ద గ్రామాలు) డిగ్రీ అర్హత కలిగిన వారిని, గ్రేడ్ 2 రెవెన్యూ గ్రామాలకు (చిన్న గ్రామాలు) ఇంటర్ అర్హత కలిగిన వారిని నియమించే అవకాశం ఉంది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత విద్యార్హతలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

CLICK HERE : VRO ఎగ్జామ్ ఎలా ఉంటుంది?

VRO/ JRO TEST SERIES

VRO TEST SERIES

మీకు Telangana Exams plus ఈ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. కోర్సులో జాయిన్ అయ్యే ముందు test series లో ఇచ్చిన సూచనలు తప్పకుండా చదవండి…

6 నెలలకు 250 రూపాయలు

ఏడాదికి 450 రూపాయలకు కోర్సు అందుబాటులో ఉంది. జాయిన్ అవ్వండి.

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

 

Telangana Jobs 2025: త్వరలో మరో 16వేల పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణ ప్రభుత్వం ఏడాదిలో మొత్తం 54 వేల కొలువులను భర్తీ చేసింది. ఇందులో BRS ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రకటనల్లో 50,127 పోస్టులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా ఇచ్చిన ప్రకటనల్లో 12,527 పోస్టులను భర్తీ చేసింది. అయితే త్వరలో మరో 16 వేల కొలువులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణ అంశం తేలగానే మళ్ళీ ప్రభుత్వ కొలువులకు నోటిఫికేషన్లను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 16 వేల పోస్టులను గుర్తించినట్టు తెలుస్తోంది.

గ్రూప్ 3 పోస్టులే ఎక్కువ

కొత్త ఏడాదిలో 2025 కొత్త జాబ్ కేలండర్ ప్రకటించి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా 16 వేల దాకా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. వీటిల్లో టీచర్ పోస్టులతో పాటు ఎక్కువగా గ్రూప్ 3 ఉద్యోగాలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేశారు. మరో నాలుగైదు వేల టీచర్ పోస్టులను కొత్త ఏడాదిలో భర్తీ చేసే ఛాన్సుంది. ఇవి కాకుండా మిగిలిన పోస్టుల్లో ఎక్కువగా ఉన్న గ్రూప్ 3 పోస్టులకు మళ్ళీ TGPSC ద్వారా నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యే ఛాన్సుంది.

(Telangana Exams you tube channel లో ప్రసారం అయ్యే 7pm MCQs  PDF మెటీరియల్ కోసం ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి )

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

 

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాలు MCQs (PDF -Download)

Telangana Exams  You tube channel లో అందిస్తున్న 7pm MCQs లను PDF రూపంలో ఈ Telangana Exams website లో కూడా అందిస్తున్నాం.

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వ్యవసాయ పథకాల గురించి ఇచ్చిన వీడియో MCQs ఇవి.

డౌన్లోడ్ చేసుకోండి.

Central Agril Schemes -All time 1st

 

Ordinance Factory Jobs : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 723 ఖాళీలు

దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆర్మీకి చెందిన ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ ప్రకటన విడుదల చేసింది.

Ordinance Factory jobs

Read this also : MAZAGON DOCK LIMITED JOBS: టెన్త్ అర్హతతో నాన్ ఎగ్జిక్యూటివ్స్

ఎన్ని ఖాళీలు ?

మొత్తం ఖాళీలు : 723

ఏయే పోస్టులు ?

Tradesmanmate, Fireman, Junior Office Assistant, Tele Operator, MTS etc.,

విద్యార్హతలు ఏంటి ?

పోస్టులను బట్టి డిగ్రీ, ఇంటర్, టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎక్కడ ఖాళీలు ఉన్నాయి ?

తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తో పాటు దేశంలోని 7 రీజనియన్లలో అనేక ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి.

వయస్సు ఎంత ?

18 నుంచి 25 యేళ్ళ లోపు ఉండాలి. SC/ST లకు 5యేళ్ళు, OBC లకు 3 యేళ్ళు, OC దివ్యాంగులకు 10యేళ్ళు, OBC దివ్యాంగులకు 13యేళ్ళు, SC/STలో దివ్యాంగులకు 15యేళ్ళు, మాజీ సైనికోద్యోగులకు 3 యేళ్ళు.

website:
https://www.aocrecruitment.gov.in

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://www.aocrecruitment.gov.in/AOC-PDF/Detailed-Advertisement.pdf

ఉద్యోగాలు, కోర్సులు, నోటిఫికేషన్లు, ప్రిపరేషన్ ప్లాన్స్ లాంటివి తెలుసుకోడానికి ఈ కింద లింక్ ద్వారా TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

@ExamsCentre247website

Test purpose