పెళ్ళి… ఇంట్లో ఫంక్షన్ ఏదైనా సరే…. హుందాగా కనిపించాలని కోరుకుంటారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరికీ ఇదే ఆలోచన. ఎవరి బడ్జెట్ వారిది… అయినా సరే… ఉన్నంతలోనే ఫ్యాషన్, అందంగా కనిపించడానికి ట్రై చేస్తుంటారు. అందుకోసం బట్టలు, వివిధ రకాల వస్తువులు కీలకంగా మారుతున్నాయి. కొందరైతే ఖర్చు ఎంతైనా ఫర్వాలేదు… తగ్గేదే లే… అంటున్నారు. అందుకే ఈమధ్యకాలంలో ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్ రంగాలకు డిమాండ్ పెరుగుతోంది. ఆ రంగంలో మొదటి నుంచీ ఇష్టం ఉన్నవాళ్ళు ఫ్యాషన్ టెక్నాలజీని ఎంచుకుంటున్నారు. ఈ రంగంలో కొన్ని సంస్థలు Under Graduation, Post Graduation, Diploma courseలు అందిస్తున్నాయి. అవేంటో చూద్దాం.
ఫ్యాషన్ డిజైనర్ అవుతారా ?
మన దేశంలో హైదరాబాద్ తో పాటు 19 ఏరియాల్లో NIFT (National Institute of Fashion Technology ) లు ఉన్నాయి. ఇవన్నీ 4 యేళ్ళ Under Graduation Fashion Technologyజీతో పాటు Accessory design, Nitware design, Fashion communication, Leather design, Fashion interiors కోర్సులు అందిస్తున్నాయి. రెండేళ్ల Post Graduationలో Design, Fashion Management, Fashion Technology కోర్సులు నిర్వహిస్తున్నాయి. Innovative ideas, డిజైన్ల మీద ఆసక్తి ఉంటే చాలు… ఈ ప్యాషన్ కోర్సుల్లో టాలెంట్ చూపించవచ్చు. NIFTలో మొత్తం 550కు పైగా సీట్లు ఉన్నాయి. అందుకోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ స్కోరుతో దేశవ్యాప్తంగా ఇతర సంస్థల్లో కూడా ప్రవేశాలకు అనుమతి ఇస్తారు.
Bachelor of Design:
అర్హత: ఇంటర్ లేదా సమాన ఉత్తీర్ణత. ఇంటర్ సెకండియర్ చదివేవాళ్ళు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
Bachelor of Fashion Technology
అర్హత: Maths, Physics తో ఇంటర్ పాస్ అయి ఉండాలి. లేదా మూడేళ్ళ డిప్లొమా చదివేవారు, చివరి ఏడాది చదువుతున్న వాళ్ళు కూడా అర్హులే.
వయసు: నోటిఫికేషన్ పడిన ఏడాదిని బట్టి …. Next year August 1st కి 24 యేళ్ళ లోపు వయస్సు ఉండాలి. SC/ST/దివ్యాంగులకు ఐదేళ్లు మినహాయింపు ఉంటుంది.
ఇది కూడా చదవండి : Data Science : డేటా సైన్స్ లో మస్తు అవకాశాలు
Master of Design, Master of Fashion management :
అర్హత: ఏదైనా డిగ్రీ పాస్, నిఫ్ట్ లేదా నిడ్ నుంచి కనీసం 3 యేళ్ళ వ్యవధితో UG Diploma చేసిన వారికి అర్హత ఉంటుంది.
అర్హత: నిఫ్ట్ నుంచి Bachlor of Fashion Technology (BS Tech.,) లేదా ఏదైనా సంస్థ నుంచి B.E., B.Tech., ఉత్తీర్ణత … చివరి ఏడాది విద్యార్థులు కూడా అప్లయ్ చేయొచ్చు. Post graduation చేయడానికి గరిష్ట వయసు నిబంధన ఏదీ లేదు.
General Ability Test (GAT):
Bachlor of Design, Master of Design కోర్సుల్లో అడ్మిషన్ కు General Ability Test (GAT) ఉంటుంది. ఈ ఎగ్జామ్ పేపర్ English, Hindi మీడియంల్లో ఉంటుంది. ఎగ్జామ్ ని రెండు గంటల్లో పూర్తి చేయాలి.
Exam Paper ఎలా ఉంటుంది ?
Bachelor of Design
క్వాంటిటేటివ్ ఎబిలిటీ : 20 మార్కులు
కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ : 40 మార్కులు
అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ : 15 మార్కులు
జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ : 25 మార్కులు ఉంటాయి.
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (BP), మాస్టర్ ఆఫ్ ప్యాషన్ టెక్నాలజీ (MF Tech), మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్ మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి కూడా General Ability Test (GAT) ఉంటుంది.
2 సెక్షన్ల నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 3 గంటల్లో రాయాలి.
Bachelor of Fashion Technology
క్వాంటిటేటివ్ ఎబిలిటీ 35 మార్కులు
కమ్యూనికేషన్ ఎబిలిటీ & ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ : 40 మార్కులు
అనలిటికల్ & లాజికల్ ఎబిలిటీ 30 మార్కులు
జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ : 25 మార్కులు
కేస్ స్టడీకి : 20 మార్కులు ఉంటాయి.
ఈ General Ability Tests లకు ఎలా ప్రిపేర్ అవ్వాలి… జనరల్ గా ఏ సిలబస్ ఉంటుంది… లాంటి విశేషాలు నెక్ట్స్ ఆర్టికల్ లో చూద్దాం.