*(Telangana exams website ఇంకా under construction లో ఉంది. Dec 5 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది )*
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) చైర్మన్‌గా సీనియర్ IAS అధికారి బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. ఆయన నియామకానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ప్రస్తుత చైర్మన్ ఎం.మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో పూర్తవుతుంది. దాంతో కొత్త చైర్మన్ నియామకానికి ప్రభుత్వం ఈ మధ్యే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు 45 అప్లికేషన్లు వచ్చినట్టు సమాచారం. Retired IASలు, వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, సీనియర్ జర్నలిస్టులు ఈ పోస్టు కోసం అప్లయ్ చేశారు. వాళ్ళల్లో బుర్రా వెంకటేశ్ పేరును CM రేవంత్ రెడ్డి ఎంపిక చేసి ఆమోదం కోసం ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.
ఇది కూడా చదవండి : Semi Conductors : 2026 నాటికి 10 లక్షల ఉద్యోగాలు – మీకు గ్రిప్ ఉందా ?
బుర్రా వెంకటేశం ఎవరు ?
బుర్రా వెంకటేశం 1968 ఏప్రిల్ 10న తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాలో జన్మించారు. 1995 IAS బ్యాచ్‌కు చెందిన అధికారి. రాజ్‌భవన్ సెక్రటరీ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బుర్రా వెంకటేశం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో చదువుకున్నారు.