FOR ENGLISH VERSION : CLICK HERE
TGPSC Group.1 : తెలంగాణలో గ్రూపు-1 నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. కోర్టులో విచారణ పూర్తయ్యే దాకా అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అనుమతి ఇచ్చింది. గ్రూప్-1 పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ 20 మంది దాకా నిరుద్యోగ అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ షిటిషన్లను విచారణకు స్వీకరించింది కోర్టు. తుది విచారణ పూర్తయ్యే దాకా అభ్యర్థులకు ఎలాంటి రిక్రూట్ మెంట్ లెటర్స్ ఇవ్వొద్దని ఆదేశించింది. కొన్ని రోజులుగా గ్రూప్-1పై లొల్లి జరుగుతోంది.
తెలుగు మీడియంలో అభ్యర్థులకు తక్కువ మార్కులు రావడం, ఫైనల్ ర్యాంకుల్లో ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉండటంపైనా వివాదం చెలరేగింది. కొన్ని సెంటర్లలోనే ఎక్కువ మంది ఫైనల్ లిస్టులో ఉన్నారనీ, అక్కడ అవకతవకలు జరిగాయని కూడా ఆరోపణలు వచ్చాయి. జీఆర్‌ఎల్‌లో అవకతవకలు చోటు చేసుకున్నాయని అభ్యర్థులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మెయిన్స్ పత్రాలను సరిగా దిద్దకపోవడం వల్ల అభ్యర్థులు నష్టపోయారని పిటిషనర్లు తెలిపారు. మూల్యాంకనం, నియామకాలు నిబంధనలకు విరుద్ధమని, తిరిగి వ్యాల్యుయేషన్ చేయాలని, లేదంటే మరోసారి మెయిన్స్ నిర్వహించాలని కోర్టుకు విన్నవించారు. పేపర్ల వ్యాల్యుయేషన్ పై హైకోర్టు పర్యవేక్షణ లేదా స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని కోరారు. ఈ పిటిషన్ లో తెలంగాణ ప్రభుత్వం, టీజీపీఎస్సీని ప్రతివాదులుగా చేర్చారు.
గ్రూప్-1 పరీక్షపై రెండు రోజుల క్రితం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నియామకాల్లో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని తెలిపారు. పరీక్ష రాయని 10 మంది మెయిన్స్ రిజల్ట్స్ లో ఎలా కనిపించారని ప్రశ్నించారు. పరీక్షను వెంటనే రద్దు చేసి సీబీఐ విచారణ జరిపించాలని కౌసిక్ రెడ్డి డిమాండ్ చేశారు. మరికొందరు ప్రతిపక్ష నేతలు కూడా గ్రూప్-1పై విమర్శలు చేశారు. టీజీపీఎస్సీ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఈ వివాదాలపైనే అభ్యర్థులు 20 మంది దాకా హైకోర్టు ఆశ్రయించారు. నియామక ప్రక్రియపై స్టే ఇవ్వడానికి మాత్రం హైకోర్టు నిరాకరించింది. అయితే తుది విచారణ పూర్తయ్యే వరకూ నియామకపత్రాలను ఇవ్వొద్దని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28కి హైకోర్టు వాయిదా వేసింది.
Read this also : పశుసంవర్ధక శాఖలో 354 పోస్టుల భర్తీ
Read this also : Want to Land a High-Paying IT Job? Here’s What Experts Say You Should Do https://examscentre247.com/high-paying-it-jobs/
SHARP NEWS E-PAPER
https://epaper.sharpnews.in/view/17/main-editon-17042025