గ్రూప్ 1,2,3 కి సంబంధించి ఎగ్జామ్స్ అయిపోయాయి. ఫైనల్ రిజల్ట్స్ ని ఏయే తేదీల్లో ప్రకటిస్తామో tgpsc షెడ్యూల్ రిలీజ్ చేసింది. 2025 మార్చి 10 న సోమవారం GROUP.1 మెయిన్స్ ప్రొవిజినల్ మార్కులను ప్రకటించబోతోంది.
మార్చి 11న గ్రూప్ 2 జనరల్ ర్యాంకుల జాబితా
మార్చి 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకుల జాబితా రిలీజ్
మార్చి 17న వసతి గృహ సంక్షేమాధికారుల ఎగ్జామ్ రిజల్ట్స్
మార్చి 19న శిశు సంక్షేమ శాఖలో Extension Officers పరీక్షల ఫైనల్ రిజల్ట్స్
గ్రూప్ 1 మార్కులు మాత్రమే !
మార్చి 10నాడు గ్రూప్ 1 రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే…. మొత్తం 563 పోస్టులకు Mains జరిగింది. ఈ ఎగ్జామ్ కి 21,093 మంది హాజరయ్యారు. ఇప్పుడు ఇచ్చే గ్రూప్ 1 రిజల్ట్స్ లో ఎగ్జామ్ రాసిన మొత్తం అభ్యర్థుల Primary marks వెల్లడించబోతున్నారు. అంటే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయన్నది ప్రకటిస్తుంది TGPSC. ఇందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రీకౌంటింగ్ ఆప్షన్స్ స్వీకరిస్తుంది… ఆ తర్వాత 1;2 జాబితా ప్రకారం 563 పోస్టులకు డబుల్ మందితో లిస్ట్ రిలీజ్ చేస్తుంది.
అంటే
గ్రూప్ 1 లోని 6 పేపర్లలో అభ్యర్థులు సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితా ఇవ్వడంతో పాటు… సబ్జెక్టుల వారీగా ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయన్నది… వాళ్ళ individual logins లో ప్రకటిస్తుంది.
మీకు ఈ మార్కులపై డౌట్స్ ఉంటే… 15 రోజుల్లోపు ఒక్కో పేపర్ కి 1000 రూపాయల చొప్పున చెల్లించి… online లో recounting కి అప్లయ్ చేసుకోవాలి. మీ దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్ లను పరిశీలించి… ఆయా పేపర్లలో మళ్ళోసారి మార్కులు లెక్కిస్తారు. ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని సరి చేస్తారు. ఆ తర్వాత మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో … సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు అభ్యర్థులను పిలుస్తారు. మొత్తం గ్రూప్ 1 లో 563 పోస్టులు ఉన్నాయి. మెయిన్స్ కి 21 వేల 93 మంది హాజరయ్యారు. అంటే ఒక్కో పోస్టుకి 38 మంది దాకా పోటీ పడుతున్నారు. ఇది గ్రూప్ 1 రిజల్ట్స్ కి సంబంధించిన అంశం… మిగతా గ్రూప్ 2, 3 ఇతర పోస్టులకు సంబంధించి షెడ్యూల్ ప్రకారం రిజల్ట్స్ వెల్లడిస్తుంది TGPSC.
రిజల్ట్స్ పై వివాదం
గ్రూప్స్ రిజల్ట్స్ పై వివాదం ఒకటి నడుస్తోంది. SC వర్గీకరణ అంశం తేల్చకుండా రిజల్ట్స్ ఇవ్వడం ఏంటని దళితసంఘాలు, BRS నేతలు మండిపడుతున్నారు. అసలు ఇప్పటిదాకా జాబ్ కేలండర్ ప్రకారం నోటిఫికేషన్లు వేయకపోవడానికి కారణం కూడా SC రిజర్వేషన్లే. అలాంటిది ఇప్పుడు గ్రూప్ 1,2,3 ఇతర ఉద్యోగాలకు సంబంధించి SC వర్గీకరణ ప్రకారం రిజల్ట్స్ ఇవ్వకపోతే… ఆయా వర్గాలకు ఉద్యోగాలు దక్కకుండా పోతాయన్న వాదన వస్తోంది. SCలకు అమలు చేస్తున్న 15శాతం కోటాలో… A గ్రూప్ లో ఉన్న SC కేటగిరీ వాళ్ళకి 1 శాతం, B గ్రూపులో వాళ్ళకి 9శాతం, C గ్రూపులో ఉన్న వాళ్ళకి 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి అలాంటప్పుడు గ్రూప్స్ కి రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రశ్నిస్తున్నారు.
TGPSC ప్రకటించిన షెడ్యూల్ ను వెనక్కి తీసుకోవాలి… SC వర్గీకరణ ప్రకారం పోస్టులు కేటాయించిన తర్వాతే ఫలితాలు వెల్లడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
కొలువుల ప్రిపరేషన్ కి రెడీ !
మార్చి నెల వచ్చింది కదా… గ్రూప్ 1,2,3 రిజల్ట్స్ తర్వాత… కొత్త జాబ్ కేలండర్ కూడా రిలీజ్ అవుతుంది. మొన్నటి గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రభావం కూడా ప్రభుత్వం మీద పడుతుంది. అదేంటో మీకు అందరికీ తెలుసు. సో… మీరు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో బిజీ అవ్వండి.
అలాగే ఇంకో రిక్వెస్ట్… GROUP 1,2,3 రిజల్ట్స్ లో ఎవరైనా మన అభ్యర్థులు విజయం సాధిస్తే… దయచేసి … నాకు వాట్సాప్ లో ఒక మెస్సేజ్ పెట్టండి… నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.
All the best. Thank you
బెస్ట్ జాబ్ ఆఫర్
త్వరలో కొత్తగా NEWS Satellite Channel రాబోతోంది. మీలో ఎవరికైనా రిపోర్టర్, సబ్ ఎడిటర్, వీడియో ఎడిటర్ లేదా యాంకర్ లాంటి ఉద్యోగాలపై ఇంట్రెస్ట్ ఉంటే… అప్లయ్ చేయండి. ఆల్రెడీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళతో పాటు…. కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఉద్యోగాలు కావాలి… మీడియాలో పనిచేయాలి అన్న ఆసక్తి ఉంటే… జర్నలిజం డిగ్రీ లేదా మామూలు డిగ్రీ, బీటెక్ వాళ్ళు ఎవరైనా అప్లయ్ చేయొచ్చు. మీ రెజ్యూమ్ ని 703 6813 703 కి WHATS APP చేయండి. ఈ నెంబర్ కి కాల్ చేయొద్దు దయచేసి… ఎంప్లాయీస్ రిక్రూట్ మెంట్ కి ఇంకా టైమ్ పడుతుంది. మేమే కాల్ చేస్తాం… అప్పటి దాకా వెయిట్ చేయండి… ఇప్పటికే సోషల్ మీడియాలో చేస్తున్న వాళ్ళయితే… మీ work experience ని కూడా యాడ్ చేయండి… ప్రజెంట్ శాలరీ ఎంత లాంటి డిటైల్స్ ఇవ్వండి… అలాగే…మీకు సంబంధించి సోషల్ మీడియా లింక్స్ ని కూడా 703 6813 703 కి వాట్సాప్ చేయండి.
Read this also : రైట్స్ లిమిటెడ్ లో టెక్నికల్ పోస్టులు
Telangana Exams -Whats Group Channel – CLICK below
Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams