తెలంగాణలో TGPSC గ్రూప్ 3 ఫలితాలు ఆలస్యంగా రిలీజ్ అవ్వనున్నాయి. మొదట Group.1, Group.2 ఫలితాల తర్వాత Group 3 విడుదల చేయాలని TGPSC నిర్ణయించింది. గ్రూప్స్ పరీక్షల రిజల్ట్స్, పోస్టుల భర్తీలో అవరోహణక్రమం పాటించాలని భావిస్తోంది.
ఇది కూడా చదవండి : 8000 VRO పోస్టులపై అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు
Group.1 పరీక్షలు అక్టోబరు 21 నుంచి 27 వరకూ జరిగాయి. Group.3 పరీక్షలు November 17, 18 లో నిర్వహించారు. Group.2 పరీక్షలు ఈ నెల అంటే December 15,16 తేదీల్లో జరుగుతున్నాయి. అయితే Groups Results, పోస్టుల భర్తీ విధానం మాత్రం ఈ వరుసలో కాకుండా.. అవరోహణ క్రమంలో పూర్తి చేయాలని కమిషన్ నిర్ణయించింది. అంటే ముందుగా Group.1 ఫలితాలను రిలీజ్ చేస్తారు. ఆ పోస్టుల భర్తీ పూర్తయ్యాక… Group.2 రిజల్ట్స్ ఇస్తారు. ఆ పోస్టులు కూడా భర్తీ చేసిన తర్వాతే Group.3 Results విడుదల చేయాలని TGPSC నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో relinquishment విధానం అమలులో లేదు. కానీ ఇలా భర్తీ చేయడం వల్ల Jobs backlog ఉండకుండా, మెరిట్ ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాలు కోల్పోకుండా ఉంటారు. లేకపోతే ముందే గ్రూప్ 3 ఫలితాలు ఇస్తే… అభ్యర్థులకు ఆ తర్వాత అంతకంటే హైపొజిషన్ లో ఉన్న Group.1, Group.2 లో కొలువులు వస్తే… Group.3 పోస్టులు ఖాళీ అవుతాయి. దానివల్ల నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని TGPSC భావిస్తోంది. అందుకే High position పోస్టుల భర్తీ తరువాత దిగువ category కొలువులను ఫిలప్ చేస్తే పోస్టులు backlog అయ్యే అవకాశం ఉండదని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి.
ఫిబ్రవరిలో Group.1 Results
Group.1 Mains పరీక్షల పేపర్లు దిద్దే కార్యక్రమం స్పీడ్ గా జరుగుతోంది. 2025 February లోగా Mains results ప్రకటించాలన్న భావిస్తోంది. ఆ తర్వాత documents పరిశీలించి… Final results ప్రకటిస్తుంది. 2025 మార్చి కల్లా Group.1 నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత Group.2 ఫలితాలు వెల్లడించి ఆ పోస్టుల భర్తీని TGPSC చేపడుతుంది. ఆ తర్వాత Group.3 Results రిలీజ్ అవుతాయి.
Group.3లో 1388 పోస్టుల భర్తీ కోసం November 17, 18 ల్లో TGPSC పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల evaluation త్వరలో స్టార్ట్ కాబోతోంది. Group.3 ఫలితాలు 2025 March తర్వాతే వచ్చే ఛాన్సుంది. అలాగే Group.1,2 &3 నియామకాల ప్రక్రియ అంతా 2025 April లోపు పూర్తవుతాయి. .
వాళ్ళని నమ్మొద్దు
Groups ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా దళారులు సంప్రదిస్తే తమకు complaint చేయాలని TGPSC తెలిపింది. తప్పుడు హామీలతో మోసం చేయాలని చూసే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా దళారులు… అభ్యర్ధులను సంప్రదిస్తే Vigilence Mobile Number. 99667 00339కు సమాచారం ఇవ్వాలి. లేదంటే vigilance@tspsc.gov.inకు ఈ-మెయిల్ ద్వారా complaint చేయొచ్చు.
ఇది కూడా చదవండి : Telangana Jobs 2025: త్వరలో మరో 16వేల పోస్టులకు నోటిఫికేషన్
ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.
🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK
🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams