G-948507G64C
Home Blog Page 4

Ordinance Factory Jobs : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 723 ఖాళీలు

దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆర్మీకి చెందిన ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ ప్రకటన విడుదల చేసింది.

Ordinance Factory jobs

Read this also : MAZAGON DOCK LIMITED JOBS: టెన్త్ అర్హతతో నాన్ ఎగ్జిక్యూటివ్స్

ఎన్ని ఖాళీలు ?

మొత్తం ఖాళీలు : 723

ఏయే పోస్టులు ?

Tradesmanmate, Fireman, Junior Office Assistant, Tele Operator, MTS etc.,

విద్యార్హతలు ఏంటి ?

పోస్టులను బట్టి డిగ్రీ, ఇంటర్, టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎక్కడ ఖాళీలు ఉన్నాయి ?

తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తో పాటు దేశంలోని 7 రీజనియన్లలో అనేక ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి.

వయస్సు ఎంత ?

18 నుంచి 25 యేళ్ళ లోపు ఉండాలి. SC/ST లకు 5యేళ్ళు, OBC లకు 3 యేళ్ళు, OC దివ్యాంగులకు 10యేళ్ళు, OBC దివ్యాంగులకు 13యేళ్ళు, SC/STలో దివ్యాంగులకు 15యేళ్ళు, మాజీ సైనికోద్యోగులకు 3 యేళ్ళు.

website:
https://www.aocrecruitment.gov.in

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://www.aocrecruitment.gov.in/AOC-PDF/Detailed-Advertisement.pdf

ఉద్యోగాలు, కోర్సులు, నోటిఫికేషన్లు, ప్రిపరేషన్ ప్లాన్స్ లాంటివి తెలుసుకోడానికి ఈ కింద లింక్ ద్వారా TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

@ExamsCentre247website

Agniveer Rallies : డిసెంబర్ 8 నుంచి అగ్నివీర్ ర్యాలీలు

AGNIVEERS

సైన్యంలోకి ప్రవేశించి దేశ సేవ చేయాలని అనుకునేవారికి శుభవార్త. అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీలు జరగబోతున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 2024 డిసెంబర్ 8 నుంచి 16 వరెకూ అగ్నివీర్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలకు చెందిన వారిని సైన్యంలోకి అగ్నివీర్ లను చేర్చుకోడానికి ఈ ర్యాలీలు జరుగుతాయి.

ఇది కూడా చదవండి : Semi Conductors Jobs : 10 లక్షల కొలువుల్లో మీకూ ఒకటి

అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/ స్టోర్ కీపర్ పోస్టులకు 10వ తరగతి, ట్రేడ్స్ మెన్ పోస్టులకు 8వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి.

Agniveers

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి (కరైకల్ -యానాం) నుంచి మహిళా మిలటరీ పోలీస్ అభ్యర్థులు ఈ ఏడాది ఫిబ్రవరి 12 నాటి నోటిఫికేషన్ ప్రకారం అన్నిడాక్యుమెంట్స్ తీసుకురావాలి.

రిక్రూట్ మెంట్ ప్రక్రియలో ఉత్తర్ణత సాధించడానికి, నమోదు చేయడానికి సహకరిస్తామంటూ మాయ మాటలు చెప్పే మోసగాళ్ళను నమ్మొద్దని అగ్నివీర్ రిక్రూట్ మెంట్ కార్యాలయం తెలిపింది.

అభ్యర్థులకు ఏవైనా డౌట్స్ ఉంటే : 040-27740059, 27740205 నంబర్లలో సంప్రదించవచ్చు.

ఇది కూడా చూడండి : MAZAGON DOCK LIMITED JOBS: టెన్త్ అర్హతతో నాన్ ఎగ్జిక్యూటివ్స్

BEL లో ఇంజినీర్స్ పోస్టులు ఖాళీ | Salary 40K -1.40 Lakh

Bharat Electronics లో Fixed term లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

BEL Recruitment

ఎన్ని ఉద్యోగాలు ?

బెల్ లో మొత్తం 229 ఇంజినీర్స్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
UR – 99, EWS-20, OBC-61, SC-32, ST-17 పోస్టులు

ఏయే విభాగాలు ?

Electronics, Mechanical, Computer Science, Electrical departments

విద్యార్హతలు :

BE/B.Tech/B.Sc.,/ Engineering (Electronics)/Mechanical/Computer Science/ Electrical Engineering) 65% Marks తో ఉత్తీర్ణత
SC/ST/ దివ్యాంగులు పాసైతే సరిపోతుంది.

వయస్సు ఎంత ఉండాలి ?

01.11.2024 నాటికి 28 సంవత్సరాలకు మించరాదు. SC/STలకు 5 Years, OBCలకు 3యేళ్ళు, దివ్యాంగులకు 10యేళ్ళు మినహాయింపు ఉంది.

ఎలా ఎంపిక చేస్తారు ?

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక

BEL Jobs

పరీక్ష ఎలా ?

85 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో General Aptitude, Technical Aptitude ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు

రూ.400 +GST. SC/ST/దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు

జీతం ఎలా ఉంటుంది ?

నెలకు రూ.40,000 – 1,40,000
Basicతో పాటు DA, House Rent, Convince Allowance, Performance Related Pay, Group, Medical Insurance, PF, Pension, Gratuity… etc.,

అప్లికేషన్లకు చివరి తేది:

10 డిసెంబర్ 2024

వెబ్ సైట్ :www.bel-india.in

For Job Notifications :
https://bel-india.in/job-notifications/

ఇది కూడా చదవండి : MAZAGON DOCK LIMITED JOBS: టెన్త్ అర్హతతో నాన్ ఎగ్జిక్యూటివ్స్

ఉద్యోగాలు, కోర్సులు, నోటిఫికేషన్లు, ప్రిపరేషన్ ప్లాన్స్ లాంటివి తెలుసుకోడానికి ఈ కింద లింక్ ద్వారా TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

https://t.me/group1aspirants_ExamsCentre

MAZAGON DOCK LIMITED JOBS: టెన్త్ అర్హతతో నాన్ ఎగ్జిక్యూటివ్స్

మాజ్ గావ్ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ లో రెగ్యులర్ బేసిస్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 234 ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. అప్లయ్ చేసుకోడానికి డిసెంబర్ 16 చివరి తేది

Jobs

విద్యార్హతలు:

పదో తరగతి, సంబధిత విభాగంలో ITT, NAC పరీక్ష, Diploma, Degree, PG, Certificate of competency (First Class Master) ఉత్తీర్ణత కలిగిన వారికి అవకాశం ఉంది.

వయస్సు ఎంత ఉండాలి ?

వయస్సు 18యేళ్ళ నుంచి 38 యేళ్ళ లోపు ఉండాలి.
అయితే Master First Calss/ Act Engineer కు లైసెన్స్ ట్రేడ్ కలిగిన వారికి 48యేళ్ళకు మించకుండా ఉండాలి.

ఎలా ఎంపిక చేస్తారు ?

Written Test ఉంటుంది. ఉద్యోగ అనుభవం, Trade/Skill Test, Documents verification, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎలా అప్లయ్ చేయాలి ?

అభ్యర్థులు Online 2024 December 16 లోగా అప్లయ్ చేసుకోవాలి

ఎగ్జామ్ ఎప్పుడు ?

Online లో ఎగ్జామ్ January 15న నిర్వహిస్తారు.

పూర్తి వివరాలకు ఈ వెబ్ సైట్ ను చూడండి.
https://www.mazagondock.in/English/career/Career-Non-Executives

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

MAZAGON DOCK LIMITED JOBS

 

ఉద్యోగాలు, కోర్సులు, నోటిఫికేషన్లు, ప్రిపరేషన్ ప్లాన్స్ లాంటివి తెలుసుకోడానికి ఈ కింద లింక్ ద్వారా TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

https://t.me/group1aspirants_ExamsCentre

TGPSC Group.2 పై హైకోర్టులో పిల్

TGPSC ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఈనెల 16న RRB Junior Engineer (JE) పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా టెస్ట్ నిర్వహిస్తోంది. RRB JE, గ్రూప్ 2 పరీక్షలు ఒకే రోజు ఉండటం వల్ల… ఏదో ఒక ఎగ్జామ్ ని వదులుకోవాల్సి వస్తోందని నిరుద్యోగులు అభ్యంతరం చెబుతున్నారు. తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఇవాళ (సోమవారం) హైకోర్టులో పిటిషిన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. గ్రూప్ 2 వాయిదా కోసం తాము TGPSC కి విన్నవించినా పట్టించుకోవడం లేదని వాదిస్తున్నారు.

GROUP.2 TGPSC

ఇది కూడా చదవండి: VRO/JROలకు పక్కా నోటిఫికేషన్… 8 వేల పోస్టులకు ప్రకటన !

RRB JE ఎన్ని పోస్టులు ?

Railway Recruitment Board జారీ చేసిన నోటిఫికేషన్ లో 7951 Junior Engineers పోస్టులను భర్తీ చేయబోతోంది. దీనికి అర్హత బీటెక్, డిగ్రీగా ఉన్నాయి. ఇదే అర్హతలు ఉన్న అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షలు కూడా రాస్తున్నారు. గ్రూప్ 2 పరీక్ష డిసెంబర్ 15, 16 తేదీల్లో ఉంది. 16న RRB Junior Engineer ఎగ్జామ్ జరగనుంది. పరీక్షలను వాయిదా వేయాలన్న విజ్ఞప్తిని TGPSC ఛైర్మన్ పట్టించుకోలేదని అభ్యర్థులు మండిపడుతున్నారు. అందుకే హైకోర్టులో పిటిషన్ వేయడానికి నిర్ణయించారు.

ఉద్యోగాలు, కోర్సులు, నోటిఫికేషన్లు, ప్రిపరేషన్ ప్లాన్స్ లాంటివి తెలుసుకోడానికి ఈ కింద లింక్ ద్వారా TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

https://t.me/group1aspirants_ExamsCentre

ఇది కూడా చదవండి : JRO VRO ఎగ్జామ్ ఎలా ఉండొచ్చు ?

JRO VRO ఎగ్జామ్ ఎలా ఉంటుంది ?

గతంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లుగా పిలిచేవారు… ఇప్పుడు కొత్త ROR చట్టం తర్వాత మళ్ళీ VRO లను నియమిస్తారని అంటున్నారు. ROR చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టేటప్పుడే… రేవంత్ రెడ్డి గవర్నమెంట్ VROలు లేదా JUNIOR REVENUE OFFICER గా పేరు మార్చి… ఇంకా ఏదైనా పేరు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ JRO లకు సంబంధించిన కొత్త ఫైల్ కూడా అసెంబ్లీలో పెట్టే ఛాన్సుంది. ఇప్పటికే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా … గ్రామస్థాయిలో VRO వ్యవస్థ లేదంటే రెవెన్యూ అధికారులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తామని అనేక సార్లు చెప్పారు. కొత్తగా 8000 మందిని భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. జాబ్ కేలండర్ 2025లో ఈ పోస్టుల నోటిఫికేషన్, ఎగ్జామ్ నిర్వహణ తేదీలు వెల్లడి అవుతాయి. 

TGPSC-Telangana Exams

ఇది కూడా చదవండి : VRO/JROలకు పక్కా నోటిఫికేషన్… 8 వేల పోస్టులకు ప్రకటన !

చివరిసారిగా VRO ల భర్తీ అనేది 2018 లో జరిగింది. అప్పట్లో 700 పోస్టులను భర్తీ చేశారు. మళ్ళీ ఆ పోస్టులను భర్తీ చేస్తే … ఏ సిలబస్ ఉంటుంది అని చాలా మంది డౌట్. అలాగే ఏ పుస్తకాలు చదవాలి… ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది… అని మన Telangana exams youtube channel లో వందల మంది మెస్సేజ్ లు పెడుతున్నారు. వాళ్ళకి అన్ని డౌట్స్ తీర్చేందుకు నేను అడ్వాన్స్ గా … అంటే ఇంకా పోస్టుల సంఖ్య ప్రకటించకముందే… మన Telangana Exams plus యాప్ లో VRO/JRO కోర్సు పేరుతో కొత్తగా పెట్టాం…

TGPSC - Telangana Exams

అందులో గతంలో అంటే 2018 లో వచ్చిన VRO ఎగ్జామ్ పేపర్ తో పాటు… ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది… అప్పట్లో ఇంటర్ అర్హత ఇచ్చారు. ఈసారి కూడా అలాగే ఇచ్చే ఛాన్సుంది… అప్పటి నోటిఫికేషన్ కూడా ఈ టెస్ట్ సిరీస్ లో ఇచ్చాం. 2025 లో SC రిజర్వేషన్ సంగతి తేలిన తర్వాత నోటిఫికేషన్లతో పాటు VRO లేదంటే JRO నోటిఫికేషన్ వేస్తే…. మీరు ముందస్తుగా ప్రిపేర్ అవ్వడానికి ఈ కోర్సును ఇస్తున్నాం….
అప్పట్లో VRO రెండు సెక్షన్లుగా
1) General Knowledge – 75 marks
2) Secretarial Abilities – 75 Marks
అందుకే మేం ఈ టెస్టు సిరీస్ లో

రెండు టాపిక్స్ లో

జీకే కింద 9 టాపిక్స్, సెక్రటేరియల్ కింద 5 టాపిక్స్ కవర్ చేస్తున్నాం.

అంటే….
1) Current Affairs,
2) General Science – Environmental Issues, Disaster Management
3) Geography & Economy of India, Telangana
4) Indian Constitution, Salient Features, Indian Political system and Governemnt , Panchayath Raj & Rural Development
5) Modern Indian History forcus on Indian National movement
6) History of Telangana & TG Movement
7) Society, Culture, Heritage, Arts & Literature of Telangana
8) Policies of Telangana State – Focus on Revanth Govt
9) Ethics, Sensitivity to Gender and weaker sections, social awareness.
అదనంగా జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు కూడా కవర్ చేస్తాం.

సెక్రటేరియల్ ఎబిలిటీస్ కింద….

1) Basic English – 8వ తరగతి….
2) Mental Ability (Verbal & Non Verbal )
3) Logical Reasoing
4) Numerical Abilities
5) Arithmetical Abilities
టాపిక్స్ కవర్ చేస్తాం…

మొత్తం 10 + 5 …. 15 టాపిక్స్ కవర్ చేస్తున్నాం. ఇవి కాకుండా… ఏడాది పొడవునా కొత్త టెస్టులు యాడ్ చేస్తూ ఉంటాం… మిగతా టెస్టు సిరీస్సుల్లో అప్ డేట్ చేసినప్పుడు ఇందులో కూడా కొత్త టెస్టులు యాడ్ చేస్తాం… ముఖ్యంగా ఎకనామీ, ప్రభుత్వ పథకాలు, పాలిటీ రీసెంట్ అంశాలు… వీటికి తోడు… ఏడాది పొడవునా… కరెంట్ ఎఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా కవర్ అవుతాయి.

8 వేల పోస్టులకు నోటిఫికేషన్ ! ( ఈ వీడియో చూడండి :https://youtu.be/fWzjODQ2Xms)

VRO JRO POSTS
VRO/ JRO TEST SERIES

మీకు Telangana Exams plus ఈ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. కోర్సులో జాయిన్ అయ్యే ముందు test series లో ఇచ్చిన సూచనలు తప్పకుండా చదవండి…

1) 2025లో 8000కు పైగా (దాదాపుగా) పోస్టులు… VRO/JRO పేరుతో Posts భర్తీ చేసే అవకాశం ఉంది. చాలామంది అడుగుతుండటంతో… ముందస్తు ప్రిపరేషన్ కోసం మాత్రమే…. ఈ Test Series క్రియేట్ చేశాం. గతంలో VRO సిలబస్ ప్రకారం ఈ సిరీస్ ఇస్తున్నాం. ఒకవేళ Notification వచ్చాక మార్పులు, చేర్పులు ఉంటే కోర్సులో కూడా మార్పులు చేస్తాం.
2) గతంలో VROలకు ఇంటర్మీడియట్ అర్హత ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఉండవచ్చు. మార్పులు చేస్తే మా బాధ్యత లేదు
3) ఈ కోర్సు కేవలం ముందస్తు ప్రిపరేషన్ కోసం మాత్రమే క్రియేట్ చేశాం. ఎన్ని పోస్టులు వేస్తారు… వేయరు అన్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానిదే…

6 నెలలకు 250 రూపాయలు

ఏడాదికి 450 రూపాయలకు కోర్సు అందుబాటులో ఉంది. జాయిన్ అవ్వండి.

ఉద్యోగాలు, కోర్సులు, నోటిఫికేషన్లు, ప్రిపరేషన్ ప్లాన్స్ లాంటివి తెలుసుకోడానికి ఈ కింద లింక్ ద్వారా TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

https://t.me/group1aspirants_ExamsCentre

VRO/JROలకు పక్కా నోటిఫికేషన్… 8 వేల పోస్టులకు ప్రకటన !

గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ మళ్లీ రాబోతోంది. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఈ నెలలోనే డిసిషన్ వెలువడనుంది.

TGPSC exams

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10,909 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గతంలో ఉన్న VRO, VRA లను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. వాళ్ళ సంఖ్య దాదాపు 3 వేల మంది దాకా ఉండే అవకాశముంది. మిగిలిన 8 వేల పోస్టులను TGPSC ద్వారా direct notification వేసి నిరుద్యోగులకు అవకాశం ఇస్తారు. గతంలో VRO/VRAలను TGPSC ద్వారా రిక్రూట్ చేసుకుంది BRS ప్రభుత్వం. వివిధ శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళని తిరిగి గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టుల్లోకి తీసుకుంటారు. ప్రభుత్వ ఆదేశాల ద్వారా వాళ్ళని డైరెక్ట్ గా నియమించబోతున్నారు. TGPSC రిక్రూట్ మెంట్ ద్వారా కాకుండా మిగిలిన వాళ్ళల్లో తగిన విద్యార్హతలు ఉన్నవాళ్ళకి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి నియామకాలు చేపడతారు.

ఇది కూడా చదవండి : JRO VRO ఎగ్జామ్ ఎలా ఉండొచ్చు ?

VRO…. JRO ఏం పేరు పెడతారు ?

Telangana Village

గ్రామస్థాయిలో నియమించే రెవెన్యూ అధికారుల వ్యవస్థకు ఏం పేరు పెడదామన్న దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జూనియర్ రెవెన్యూ ఆఫీసర్స్ (JRO) పేరు పెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను క్రియేట్ చేసేందుకు న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి : TG Job Calendar : జాబ్ నోటిఫికేషన్లకు ఇంకా 2 నెలలకు పైగా టైమ్

8 వేల పోస్టులకు నోటిఫికేషన్ ! ( ఈ వీడియో చూడండి :https://youtu.be/fWzjODQ2Xms)

తెలంగాణలో మొత్తం 10,909 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిల్లో అన్నింటిలోనూ VROలను నియమించబోతోంది ప్రభుత్వం. గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులకు పాత వాళ్ళని 3వేల మందిని భర్తీ చేస్తారు. వీళ్ళల్లో మిగిలిన 8 వేల పోస్టులకు కొత్తవాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. డిసెంబర్ లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ROR చట్టం, గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చట్టం ఆమోదం పొందాక పాత VRO/VRAల్లో 3 వేల మందిని తిరిగి ఆ స్థానాల్లో భర్తీ చేస్తారు. ఆ తర్వాత ఏయే రెవెన్యూ గ్రామాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయో అధికారులు గుర్తిస్తారు. తర్వాత కొత్త జాబ్ కేలండర్ లో 8వేల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ? ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహస్తారో వివరాలను ప్రకటిస్తారు.

( NOTE: JRO/VRO ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారికి ముందస్తుగా పాత VRO సిలబస్ ప్రకారం మన Telangana Exams plus యాప్ ద్వారా Test Series ప్లాన్ చేశాం. టెస్ట్ సిరీస్ లో ప్రస్తుతం Current Affairs పోస్ట్ చేశాం. మిగతా అప్ డేట్స్ ఈ నెల 15 తర్వాత అందిస్తాం. ఈలోగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింద లింక్ ద్వారా ఆ కోర్సులో జాయిన్ అవ్వండి. త్వరలో మన యాప్ లో కోర్సుల subscription రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడే జాయిన్ అయితే Rs.450/1 year, Rs.250/6 months కి ఛాన్స్ ఉంటుంది. ఈ కింది లింక్ ద్వారా కోర్సులో జాయిన్ అవ్వగలరు. కోర్సులో జాయిన్ అయ్యే ముందు description లో సూచనలు చదవండి )

VRO posts

VRO/JRO-2025 Test Series

JRO/VRO కోర్సులో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఉద్యోగాలు, కోర్సులు, నోటిఫికేషన్లు, ప్రిపరేషన్ ప్లాన్స్ లాంటివి తెలుసుకోడానికి ఈ కింద లింక్ ద్వారా TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

https://t.me/group1aspirants_ExamsCentre

Trump వస్తున్నాడు… తిరిగి వచ్చేయండి : భారతీయ విద్యార్థులకు పిలుపు

Donald trump

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20 నాడు ప్రమాణం చేస్తున్నారు. అయితే శీతాకాల సెలవుల కోసం విదేశాలకు వెళ్ళిపోయిన విద్యార్థులంతా తిరిగి అమెరికా రావాలని అక్కడి యూనివర్సిటీలు కోరుతున్నాయి. ట్రంప్ అధికారం చేపడితే… US Universities లో ప్రవేశాలు నిషిద్ధం. అలాగే విద్యార్థులకు ఎంట్రీని నిరాకరించే ఛాన్సుంది. విమానాల్లోనే విద్యార్థులను తనిఖీలు చేస్తారు. ఆపేస్తారు. అవసరమైతే స్వదేశాలకు వెనక్కి పంపుతారు. ఇలాంటి ఘటనలు గతంలో ట్రంప్ హయాంలో కూడా జరిగాయి. అందుకే ఇళ్ళకి Winter vacations కి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వచ్చేయాలని యూనివర్సిటీలు కోరుతున్నాయి.

ఇది కూడా చదవండి : TGPSC: కొత్త చైర్మన్‌ బుర్రా వెంకటేశం

Yale University

ఈసారి వలసదారులకు చుక్కలే !

అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వాళ్ళందర్నీ బలవంతంగా వెనక్కి పంపిస్తానని ఎన్నికల ముందు నుంచే ట్రంప్ చెబుతున్నారు. గతంలో ఇలాగే అనేక దేశాల ప్రయాణీకుల మీద ఆంక్షలు విధించారు. అయితే మన స్టూడెంట్స్ వచ్చిన ఇబ్బంది ఏంటి అని అనుమానం రావొచ్చు. ఖచ్చితంగా చెల్లుబాటు అయ్యే వీసా, ఇతర ట్రావెల్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉంటే… అలాంటి Indian Students కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ యూనివర్సిటీల్లో లోపాలు ఉన్నా కూడా విద్యార్థులను అమెరికా చేరుకోగానే Airports లో ఆపేసే ఛాన్సుంది. అందుకే ఛాన్స్ తీసుకోవద్దని విద్యాసంస్థలు హెచ్చరిస్తున్నాయి.

ఇది కూడా చదవండిSemi Conductors : 2026 నాటికి 10 లక్షల ఉద్యోగాలు – మీకు గ్రిప్ ఉందా ?

US Universities లో మనోళ్ళే ఎక్కువ !

అమెరికాలో చదువుతున్న విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువ మంది ఉన్నట్టు ఇటీవలి రిపోర్టుల బట్టి తెలుస్తోంది. అందులోనే తెలుగు రాష్ట్రాల నుంచి మరీ ఎక్కువగా ఉంటున్నారు. 2023-24 ఏడాదిలో చైనా కంటే మన భారతీయ విద్యార్థులే ఎక్కువగా అమెరికాలో చదువుల కోసం వెళ్ళారు. US Universitiesలో మనోళ్ళు 3.3 లక్షల మంది ఉంటే చైనా విద్యార్థులు 2.7 లక్షల మంది మాత్రమే ఉన్నారు.

US Indian Students

ట్రంప్ భయంతో ముందే క్లాసులు

జనరల్ గా New Year అయ్యాక వారం రోజులకు USA Universities లో క్లాసులు మొదలు పెడుతుంటారు. కానీ ట్రంప్ భయంతో… ఈసారి యూనివర్సిటీలో జనవరి 2 నుంచే క్లాసులు స్టార్ట్ చేస్తున్నాయి. జనవరి మొదటి వారం తర్వాత అమెరికాకు వెళ్ళడం బయటి దేశాల విద్యార్థులకు చాలా కష్టమయ్యే ఛాన్సుంది. అందుకే ముందే రమ్మని చెప్పినట్టు Indian Students చెబుతున్నారు. ఇప్పటికే యేల్ యూనివర్సిటీ ప్రత్యేకంగా విద్యార్థులకు Orientation class కూడా నిర్వహించింది.

US Students

ముందే టిక్కెట్లు బుకింగ్

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టేనాటికంటే ముందే అక్కడికి చేరుకోవాలని భారతీయ విద్యార్థులు భావిస్తున్నారు. అందుకే USA కు ఇప్పటి నుంచే టిక్కెట్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. గతంలో జనవరి 10, 15 సంక్రాంతి తర్వాత బుక్ చేసుకున్న స్టూడెంట్స్ కూడా డిసెంబర్ లాస్ట్ వీక్, జనవరి ఫస్ట్ వీక్ కి తమ Return journey Tickets ని బుక్ చేసుకుంటున్నారు. కొందరు అదనంగా డబ్బులు పెట్టి టిక్కెట్ షెడ్యూల్ ను ముందుకు జరుపుకుంటున్నారు. మొత్తానికి ట్రంప్ వస్తే ఏమవుతుందో అన్న భయం ఇండియాతో పాటు ఇతర దేశాల విద్యార్థుల్లోనూ వ్యక్తమవుతోంది.

US university students

TGPSC: కొత్త చైర్మన్‌ బుర్రా వెంకటేశం

*(Telangana exams website ఇంకా under construction లో ఉంది. Dec 5 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది )*

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) చైర్మన్‌గా సీనియర్ IAS అధికారి బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. ఆయన నియామకానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ప్రస్తుత చైర్మన్ ఎం.మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో పూర్తవుతుంది. దాంతో కొత్త చైర్మన్ నియామకానికి ప్రభుత్వం ఈ మధ్యే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు 45 అప్లికేషన్లు వచ్చినట్టు సమాచారం. Retired IASలు, వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, సీనియర్ జర్నలిస్టులు ఈ పోస్టు కోసం అప్లయ్ చేశారు. వాళ్ళల్లో బుర్రా వెంకటేశ్ పేరును CM రేవంత్ రెడ్డి ఎంపిక చేసి ఆమోదం కోసం ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.

ఇది కూడా చదవండి : Semi Conductors : 2026 నాటికి 10 లక్షల ఉద్యోగాలు – మీకు గ్రిప్ ఉందా ?

Burra Venkatesam

బుర్రా వెంకటేశం ఎవరు ?

బుర్రా వెంకటేశం 1968 ఏప్రిల్‌ 10న తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాలో జన్మించారు. 1995 IAS బ్యాచ్‌కు చెందిన అధికారి. రాజ్‌భవన్ సెక్రటరీ, విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బుర్రా వెంకటేశం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో చదువుకున్నారు.

ఇది కూడా చదవండి : TG Job Calendar : జాబ్ నోటిఫికేషన్లకు ఇంకా 2 నెలలకు పైగా టైమ్

Fresher Jobs: C-DACలో భారీగా ఉద్యోగాలు – Dec 5th Last Date

Centre for development of Advanced computing (CDAC) లో Hyderabad, Pune, Bengalore, Chennai, Delhi, Kolkata, Mohali, Mumbai, Noida, Patna, Thiruvananthapuram, Silchar నగరాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వివిధ నగరాల్లో minimum 100 నుంచి 200కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్ లో వీరి రిక్రూట్ మెంట్ ఉంటుంది. Experienced తో పాటు Freshersకి కూడా ఛాన్స్ ఉంది. అర్హులైన అభ్యర్థులు 2024 డిసెంబర్ 5 లోగా Online ద్వారా అప్లయ్ చేసుకోవాలి.

ఏయే పోస్టులు :

ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట ఇంజినీర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు, సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఏయే బ్రాంచ్ లు :

Cyber Security, Data collection & Management, Netwokr Administrator, Cyber Forensics, Data Analyst, Multimedia, UI/UX Designer, Microelectronics, VLSI Design, Network Administration, System Softward development (Linux), Content Writing, Quantum computing, AI/ML, Education & Training, Finance & Accounts, Outreach, Electronics & Telecom, Cloud and Server Management,

విద్యార్హతలు, ఇతర పూర్తి వివరాలకు ఈ కింద లింక్స్ క్లిక్ చేయండి

CDAC- Careers వెబ్ సైట్

https://cdac.in/index.aspx?id=current_jobs

హైదరాబాద్ లో పోస్టుల వివరాలకు :

https://careers.cdac.in/advt-details/HY-12112024-1UXD8

ఇతర అన్ని నగరాల పోస్టల వివరాలకు :

https://careers.cdac.in/

Test purpose