గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ మళ్లీ రాబోతోంది. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఈ నెలలోనే డిసిషన్ వెలువడనుంది.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10,909 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గతంలో ఉన్న VRO, VRA లను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. వాళ్ళ సంఖ్య దాదాపు 3 వేల మంది దాకా ఉండే అవకాశముంది. మిగిలిన 8 వేల పోస్టులను TGPSC ద్వారా direct notification వేసి నిరుద్యోగులకు అవకాశం ఇస్తారు. గతంలో VRO/VRAలను TGPSC ద్వారా రిక్రూట్ చేసుకుంది BRS ప్రభుత్వం. వివిధ శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళని తిరిగి గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టుల్లోకి తీసుకుంటారు. ప్రభుత్వ ఆదేశాల ద్వారా వాళ్ళని డైరెక్ట్ గా నియమించబోతున్నారు. TGPSC రిక్రూట్ మెంట్ ద్వారా కాకుండా మిగిలిన వాళ్ళల్లో తగిన విద్యార్హతలు ఉన్నవాళ్ళకి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి నియామకాలు చేపడతారు.
ఇది కూడా చదవండి : JRO VRO ఎగ్జామ్ ఎలా ఉండొచ్చు ?
VRO…. JRO ఏం పేరు పెడతారు ?
గ్రామస్థాయిలో నియమించే రెవెన్యూ అధికారుల వ్యవస్థకు ఏం పేరు పెడదామన్న దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జూనియర్ రెవెన్యూ ఆఫీసర్స్ (JRO) పేరు పెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను క్రియేట్ చేసేందుకు న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి : TG Job Calendar : జాబ్ నోటిఫికేషన్లకు ఇంకా 2 నెలలకు పైగా టైమ్
8 వేల పోస్టులకు నోటిఫికేషన్ ! ( ఈ వీడియో చూడండి :https://youtu.be/fWzjODQ2Xms)
తెలంగాణలో మొత్తం 10,909 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిల్లో అన్నింటిలోనూ VROలను నియమించబోతోంది ప్రభుత్వం. గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులకు పాత వాళ్ళని 3వేల మందిని భర్తీ చేస్తారు. వీళ్ళల్లో మిగిలిన 8 వేల పోస్టులకు కొత్తవాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. డిసెంబర్ లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ROR చట్టం, గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చట్టం ఆమోదం పొందాక పాత VRO/VRAల్లో 3 వేల మందిని తిరిగి ఆ స్థానాల్లో భర్తీ చేస్తారు. ఆ తర్వాత ఏయే రెవెన్యూ గ్రామాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయో అధికారులు గుర్తిస్తారు. తర్వాత కొత్త జాబ్ కేలండర్ లో 8వేల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ? ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహస్తారో వివరాలను ప్రకటిస్తారు.
( NOTE: JRO/VRO ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారికి ముందస్తుగా పాత VRO సిలబస్ ప్రకారం మన Telangana Exams plus యాప్ ద్వారా Test Series ప్లాన్ చేశాం. టెస్ట్ సిరీస్ లో ప్రస్తుతం Current Affairs పోస్ట్ చేశాం. మిగతా అప్ డేట్స్ ఈ నెల 15 తర్వాత అందిస్తాం. ఈలోగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింద లింక్ ద్వారా ఆ కోర్సులో జాయిన్ అవ్వండి. త్వరలో మన యాప్ లో కోర్సుల subscription రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడే జాయిన్ అయితే Rs.450/1 year, Rs.250/6 months కి ఛాన్స్ ఉంటుంది. ఈ కింది లింక్ ద్వారా కోర్సులో జాయిన్ అవ్వగలరు. కోర్సులో జాయిన్ అయ్యే ముందు description లో సూచనలు చదవండి )
VRO/JRO-2025 Test Series
JRO/VRO కోర్సులో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఉద్యోగాలు, కోర్సులు, నోటిఫికేషన్లు, ప్రిపరేషన్ ప్లాన్స్ లాంటివి తెలుసుకోడానికి ఈ కింద లింక్ ద్వారా TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
https://t.me/group1aspirants_ExamsCentre