Home Careers ఇస్రో లో 63 పోస్ట్లు భర్తీ

ఇస్రో లో 63 పోస్ట్లు భర్తీ

0
Table of Contents

ఇస్రో పిలుస్తోంది!

63 సైంటిస్ట్ కొలువుల భర్తీ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 63 సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. ఎంపికైనవారిని హైద రాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, మహేంద్రగిరి, అహ్మదాబాద్, హసన్, వలి యమల, శ్రీహరికోట కేంద్రాల్లో నియమించే అవకాశం ఉంటుంది.

మొత్తం ఖాళీల్లో సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సి’ (ఎలక్ట్రా నిక్స్)- 22, సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎసిసి’ (మెకాని కల్)- 33, సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సి’ (కంప్యూటర్ సైన్స్)- 8 ఉన్నాయి.

అర్హతలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ మెకాని కల్/ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ బీఈ/ బీటెక్/తత్సమాన పరీక్ష 65 శాతం మార్కులతో పాసవ్వాలి. 2024 25 2025 5 .

వయసు: 28 ఏళ్లు మించకూడదు. ప్రత్యేక వర్గాలకు చెందినవారికి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.250, ఎస్సీ/ఎస్టీ/ దివ్యాం గులు/ మాజీ సైనికోద్యోగులు/ మహిళలకు ఫీజు లేదు.

వేతన శ్రేణి: రూ.56,100. మూలవేతనానికి అద నంగా డీఏ, హెచ్ఎస్ఏ, టీఏ, న్యూ పెన్షన్ స్కీమ్ /యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, వ్యక్తిగత, కుటుంబ సభ్యు లకు వైద్య సదుపాయాలు, ఎల్డీఏ, గ్రూప్ ఇన్సూ

రెన్స్, హౌస్బల్డింగ్ అడ్వాన్స్ మొదలైన సదుపా యాలు ఉంటాయి. మెరిట్ బేస్డ్ పర్ఫార్మెన్స్ రివ్యూ సిస్టమ్ ద్వారా ప్రతిభ ఆధారంగా ఉద్యోగులు పదోన్న తులు పొందే అవకాశం ఉంటుంది.

ఎంపిక ఎలా?

* 2024/2025 గేట్ స్కోరు ఆధారంగా 1:7 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

* ఇంటర్వ్యూకు 100 మార్కులు. టెక్నికల్ (అకడ మిక్) నాలెడ్జు 40 మార్కులు, జనరల్ అవేర్నెస్కు 20 మార్కులు, ప్రజెంటేషన్/ కమ్యూనికేషన్ స్కిల్కు 20 మార్కులు, కాంప్రహెన్షన్ కు 10 మార్కులు, అకడ మిక్ అచీవ్మెంట్స్కు 10 మార్కులు.

* ఇంటర్వ్యూలో 60 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. దివ్యాంగులకు 50 శాతం సరిపోతుంది. ఇంటర్వ్యూకు 50 శాతం, గేట్ స్కోరుకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు.

◆ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నవారు ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ను ఇంటర్వ్యూ సమయంలో సమ ర్పించాలి.

* ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు సెకండ్ క్లాస్ రైలు ఛార్జీలను చెల్లిస్తారు.

◆ ఇంటర్వ్యూ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాలి.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 19.05.2025 http://www.isro.gov.in/http://www.isro.gov.in/

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version