విశాలాంధ్ర నినాదం- ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం

1) విశాలాంధ్ర నినాదం వెనుక సామ్రాజ్యవాద తత్వం ఉన్నది అన్నది ఎవరు ?
జ: జవహర్ లాల్ నెహ్రూ
2) విశాలాంద్ర్ర భావనను మొదట ఎవరు వ్యాస్తి చేశారు?
జ) కమ్యూనిస్టులు
3) కమ్యూనిస్టులు ఏమని ప్రచారం చేశారు?
జ) ఒకేజాతి, ఒకేభాష, ఒకేరాష్ట్ర్రం.
4) విశాలాంధ్ర పత్రికను ఎవరు ప్రచురించారు?
జ) పుచ్చలపల్లి సుందరయ్య
5) వావిలాల గోపాలకృష్ణయ్య విశాలాంధ్ర పుస్తకాన్ని ఎప్పుడు రాశారు ?
జ) 1940.
6) అయ్యదేవర కాళేశ్వరరావు 1949లో ఎక్కడ సభను నిర్వహించారు?
జ) విజయవాడ
7) విశాలాంధ్ర మహాసభ మొదటిసారిగా ఎక్కడ ఎవరి అధ్యక్షతన జరిగింది?
జ) వరంగల్, హయగ్రీవాచారి
8) అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో జవహర్ లాల్ నెహ్రూ హైదరాబాద్ ను ఏమని కొట్టి పారవేశాడు?
జ) లూజ్ టాక్
9) తెలంగాణను ప్రత్యేక రాష్ట్ర్రంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేసిన వారెవరు?
జ) కె.వి.రంగారెడ్డి, మర్రిచెన్నారెడ్డి.
10) విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినవారెవరు?
జ) బూర్గులరామకృష్ణారావు, మీర్ మహమ్మద్, అలీఖాన్, స్వామి రామానంద తీర్ధ.
11) తెలంగాణ ప్రజల భయాందోళనలను తొలగించడానికి ఏర్పాటు చేసిన ఒప్పందం ఏంటి?
జ) పెద్దమనుషుల ఒప్పందం.
12) పెద్దమనుషుల ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది?
జ) ఢిల్లీలోని హైదరాబాద్ భవన్ లో ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య
13) ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం శ్రీభాగ్ తరహా లేదా స్కాటిష్ డెవోల్యూషన్ లాంటివి పనిచేయవని అన్నది ఎవరు ?
జ: ఫజల్ అలీ కమిషన్ (384 పేరాలో)
14) పెద్దమనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది?
జ) 1956 ఫిబ్రవరి 20.
15) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్ర బిల్లును రాష్ట్ర్రపతి ఎప్పుడు ఆమోదించారు?
జ) 1956 ఆగష్టు 31
16) జై ఆంధ్ర ఉద్యమం ఎప్పుడు జరిగింది?
జ) 1972 -73 మధ్య కాలంలో
17) పి.వి.నరసింహారావు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు?
జ) 1971లో
18) తెలంగాణలోని ఉద్యోగాలను ఆక్రమించుకున్న ఆంద్ర ఉద్యోగుల సంఖ్య ఎంత?
జ) 22 వేలు.
19) తెలంగాణ రక్షణ దినం ఏ రోజు ఏర్పాటు చేయబడింది?
జ) 1968 .జులై 10.
20) చెన్నారెడ్డికి తెలంగాణలో ప్రధాన ప్రత్యర్ది ఎవరు?
జ) వందేమాతరం రామచంద్రరావు.
21) ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రంలో పనిచేసిన మొదటి తెలంగాణ నాయకుడు ఎవరు?
జ) పి.వి.నరసింహారావు.
22) ఏ ఉద్యమంతో పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు?
జ) జై ఆంధ్ర ఉద్యమం
23) గాంధీ మెడికల్ కాలేజీ ఎప్పుడు ప్రారంభించారు?
జ)1954 పెప్టెంబర్ 14.
24) గాంధీ మెడికల్ కాలేజీను ఎవరు ప్రారంభించారు?
జ) భారతదేశ ప్రధమ రాష్ట్ర్రపతి డా.రాజేంద్రప్రసాద్.
25) నిమ్స్ మొదటి డైరెక్టుగా ఎవరు ఉన్నారు?
జ) కాకర్ల సుబ్బారావు.
26) తెలంగాణలోని అతిపెద్ద చిన్నిపిల్లల హాస్పిటల్ ఏది?
జ) నీలోఫర్ హాస్పిటల్.
27) ఆసియా ఖండంలోనే పెద్ద వస్త్ర్ర పరిశ్రమ ఏది?
జ) వరంగల్ అజాంజాహీ మిల్స్.
28) ఆసియాలోనే పెద్ద చక్కెర పరిశ్రమ ఏది?
జ) నిజాం షుగర్ ఫ్యాక్టరీ
29) కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ను ఎప్పుడు ప్రారంభించారు?
జ) 1966
30) సింగూరు జలవిద్యుత్ కేంద్రం ఎక్కడ ఉన్నది?
జ) మెదక్.
31) పోచంపాడు ప్రాజెక్టును ఏవిధంగా మార్చారు?
జ) శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు.
32) కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కు బొగ్గు ఎక్కడ నుంచి సరఫరా అవుతుంది?
జ) సింగరేణి కాలరీస్
33) డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఎప్పుడు ఏర్పడింది?
జ) 1941.
34) జి.ఓ. 36ను తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు?
జ) కాసు బ్రహ్మానందరెడ్డి.
35) జి.ఓ.610 తెచ్చిన ముఖ్యమంత్రి ఎవరు?
జ) ఎన్టీ రామారావు 1985.