పశుసంవర్ధక శాఖలో 354 పోస్టుల భర్తీ

Table of Contents

▪ త్వరలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ
▪ వీఏలకు లైవ్ స్టాక్ అసిస్టెంట్లుగా ప్రమోషన్
▪ రాష్ట్రంలో 354 గ్రామీణ పశు ఆరోగ్య కేంద్రాలు పునఃప్రారంభం

పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న 354 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం, అలాగే లైవ్ స్టాక్ అసిస్టెంట్ (LSA) పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయకపోవడంతో దాదాపు పదేళ్లుగా 354 గ్రామీణ పశు ఆరోగ్య ఉప కేంద్రాలు మూతపడ్డాయి.  అసోసియేషన్ ప్రతినిధులు, శాఖ సంచాలకుడు గోపి గారిని కలిసి వివరించారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డికి నివేదించగా, వెంటనే స్పందించిన సీఎం వెటర్నరీ అసిస్టెంట్లకు ఎల్ఎస్ఏలుగా పదోన్నతులు మంజూరు చేశారు. దీంతో ఉద్యోగుల సీనియారిటీ సమస్య పరిష్కారం అయింది.

ఇప్పుడు LSAలుగా ప్రమోషన్ పొందిన వారితో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. అర్హత కలిగిన పశుసంవర్థక డిప్లొమా పూర్తి చేసిన నిరుద్యోగులతో 354 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు.

ఈ నియామకాలతో గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్య సేవలు మరింత బలోపేతం కానున్నాయి. మూతపడ్డ పశు ఆరోగ్య కేంద్రాలు పునరుద్ధరించబడి, రైతులకు వేటర్నరీ సేవలు మరింత చేరువ కావడం వల్ల గ్రామీణ ప్రజలకు మేలు జరగనుంది.

Read this also : ADAలో 133 ఖాళీలు

Read this also : GPO నియామకాలపై కన్ ఫ్యూజన్

telanganaexams@gmail.com  के बारे में
For Feedback - telanganaexams@gmail.com

---Advertisement---

Related Post

WhatsApp Icon Telegram Icon