TS STATE BUDGE 2021-22

TS STATE BUDGE 2021-22

2021- 22 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీష్ రావు 2021 మార్చి 18న రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.  దీనికి సంబంధించి రాబోయే 50 వేల ఉద్యోగాల్లో తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. అందుకోసం ఈ క్విజ్ ను రూపొందించాం. మొత్తం 25 ప్రశ్నలు.  ఒక్కో ప్రశ్న రాసిన తర్వాత వెంటనే ఆన్సర్స్ చూసుకోవచ్చు

 

 

1. రైతు బంధు పథకం కింద రైతుకు ఒక్కొక్కరికి ఏడాదికి ఎంత మొత్తం చొప్పున చెల్లిస్తోంది.

Question 1 of 25

2. దేశంలో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది.  రాష్ట్రంలో 2020-21 నాటికి తలసరి విద్యుత్ వినియోగం ఎన్ని యూనిట్లుగా ఉంది

Question 2 of 25

3. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో స్థిర ధరల్లోనూ రంగారెడ్డి జిల్లాయే మొదటి స్థానంలో నిలిచింది. అయితే మొత్తం రాష్ట్ర జీడీపీ ఎంతగా నమోదైంది

Question 3 of 25

4. ఎమ్మెల్యేలు, MLCలకు నియోజకవర్గ అభివృద్ధి నిదులను (CDP) రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.  ఈసారి సీడీపీ కింద రూ.800 కోట్లను మంజూరు చేసింది.  అయితే ఒక్కో MLA/MLC కి ఏటా ఎంత మొత్తం నిధులను రిలీజ్ చేస్తారు

Question 4 of 25

5. వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రభుత్వం ఈసారి రూ.1500 కోట్లు కేటాయించింది. గత ఐదేళ్ళలో ఎన్ని ట్రాక్టర్లను సబ్సిడీపై రైతులకు అందించారు

Question 5 of 25

6. రాష్ట్ర బడ్జెట్ లో ఆరోగ్యానికి ఎంత మొత్తం కేటాయించారు

Question 6 of 25

7. రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 4 లక్షల కోట్లకు చేరింది.  ఏడేండ్లలో ఐదున్నర రెట్లు పెరిగినయ్.  రాష్ట్ర బడ్జెట్ ప్రకారం రాష్ట్రంలో తలసరి అప్పు ఎంతగా ఉన్నది

Question 7 of 25

8. ఐటీ శాఖకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపుల్లో ఏవి సరైనవి

  1. ఐటీశాఖకు ఈసారి ప్రభుత్వం గతం కంటే 12.81 రెట్లు అధికంగా నిధులు కేటాయించింది
  2. 2021-22 సం.నికి ఐటీ శాఖకు రూ.113.49 కోట్లు కేటాయించింది
  3. ఐటీ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయల కల్పనకు మొదటిసారిగా రూ.150 కోట్లను ప్రభుత్వం కేటాయించింది

Question 8 of 25

9. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో భవిష్యత్ ట్రాఫిక్ రద్దీని తట్టుకోడానికి రీజినల్ రింగ్ రోడ్డు ( RRR) ను నిర్మించేందుకు అవసరమై భూసేకరణ కోసం రూ.750 కోట్లను ఈ బడ్జెట్ లో కేటాయించారు.  అయితే ఎన్ని ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించాల్సి ఉంది ?

Question 9 of 25

10. రాష్ట్రం ఏర్పాటు తర్వాత మొదటిసారిగా బడ్జెట్ లో జడ్పీ, ఎంపీపీలకు 2021-22 సంవత్సరానికి ఎంత మొత్తం నిధులను కేటాయించారు ?

Question 10 of 25

11. గొర్రెల పంపిణీ పథకాన్ని ఈ ఏడాది కూడాకొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అందుకోసం ఈసారి బడ్జెట్ లో ఎంత మొతాన్ని కేటాయించారు

Question 11 of 25

12. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ప్రభుత్వం ఈసారి బడ్జెట్ లో రూ.11 వేల కోట్లు కేటాయించింది. అయితే ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎన్ని డబుల్ ఇళ్ళు పూర్తయినట్టు మంత్రి హరీష్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు

Question 12 of 25

13. రాష్ట్రంలో పంటల ధరలపై పరిశోధన, విశ్లేషణ చేసి రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు కొత్తగా మార్కెటింగ్, విశ్లేషణ, పరిశోధనా విభాగంను మార్కెటింగ్ శాఖలో ఏర్పాటు చేయనుంది.  అందుకోసం ఎంత మొత్తాన్ని బడ్జెట్ లో కేటాయించారు.

Question 13 of 25

14. రాష్ట్రంలో 2020-21 ధరల ప్రకారం ఒక్కొక్కరి తలసరి ఆదాయం ఎన్ని లక్షల రూపాయలుగా ఉంది

Question 14 of 25

15. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు 2021 మార్చి 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.  స్టేట్ బడ్జెట్ మొత్తం ఎంత ?

Question 15 of 25

16. స్థూల జాతీయోత్పత్తిలో (ప్రస్తుత ధరల్లో ) మొదటి స్థానంలో నిలిచిన జిల్లా ఏది ? (2019-20 సంవత్సరానికి)

Question 16 of 25

17. బడుల్లో మౌలిక వసతులు పెంచడానికి వచ్చే రెండేళ్ళలో ఎన్ని వేల కోట్లతో సరికొత్త పథకం ప్రారంభిస్తున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీష్ రావు తెలిపారు

Question 17 of 25

18. తెలంగాణ రాష్ట్రంలో అర్భనైజేషన్ వేగంగా జరుగుతోంది.  అంటే పట్టణాల్లో నివసిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోది.  దేశంలో అర్భనైజేషన్ ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది.  రాష్ట్ర జనాభాలో ఎంత శాతం మంది పట్టణాల్లోనే నివసిస్తున్నట్టు సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ రిపోర్ట్ 2021 తెలిపింది

Question 18 of 25

19. 2021-22 రాష్ట్ర బడ్జెట్ లో ఫించన్లకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

  1. ఫించన్ల పంపిణీకి రూ.11,728 కోట్లు కేటాయింపు
  2. రాష్ట్రంలో మొత్తం 37.72 లక్షల మంది ఫించన్ లబ్దిదారులు
  3. రాష్ట్రంలో 57యేళ్ళ వయసు దాటిన వారికి కూడా ఫించన్లు ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది వీరు మరో 15 లక్షల మంది ఉంటారు

Question 19 of 25

20. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగితా శాతం ఎంతగా నమోదైంది.

Question 20 of 25

21. 2021- 22 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులకు సంబంధించి జతపరచండి

1) గ్రామీణాభివృద్ధి

2) వ్యవసాయం

3) నీటిపారుదల

4) డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు

 

ఎ) 29,271 కోట్లు

బి) 25,000 కోట్లు

సి) 16,919 కోట్లు

డి) 11,000 కోట్లు

Question 21 of 25

22. లక్ష లోపు రైతుల రుణమాఫీ కోసం 2021-22 సంవత్సరంలో ఎంత మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించింది

Question 22 of 25

23. రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయ కేటాయింపులకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి

1)వ్యవసాయానికి 2021-22 సం.నికి మొత్తం కేటాయింపులు రూ.25,000 కోట్లు

2) ఇందులో రైతుబంధుకు రూ.14,800 కోట్లు

3) రైతు బీమా పథకానికి రూ.1200 కోట్లు

4) రైతుల రుణమాఫీకి రూ.5,225 కోట్లు

Question 23 of 25

24. రాష్ట్రంలో సగటున ఒక్కో రైతు దగ్గర రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఏ జిల్లాలో అత్యధికంగా రైతుల దగ్గర 4.1 ఎకరాల భూమి ఉంది

Question 24 of 25

25. 2021-22 రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

Question 25 of 25