రేపటి నుంచే స్కూళ్ళు

రేపటి నుంచే స్కూళ్ళు

రేపటి నుంచి తెలంగాణలో స్కూళ్ళు యధావిధిగా ఓపెన్ అవుతాయని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లోనూ క్లాసులు కొనసాగుతాయని తెలిపింది. ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లేదా రెండూ నిర్వహించుకునే అవకాశం స్కూల్స్ యాజమాన్యాలకు ఉందని ప్రబుత్వం స్పష్టం చేసింది. గురుకుల సంక్షేమ, గిరిజన, సాంఘీక సంక్షేమ హాస్టళ్ళను మూసే ఉంచాలని నిర్ణయించింది. స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులను బలవంతంగా స్కూల్ కు రప్పించడానికి వీల్లేదు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోతే విద్యార్థులను స్కూల్ కు పంపాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ నుంచి కరోనాకు సంబంధించి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తీసుకునే ఎలాంటి డిక్లరేషన్ లీగల్ గా చెల్లదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మధ్యాహ్నం హైకోర్టు ఆదేశాల తరువాత మార్పులతో జీవోని జారీ చేసింది సర్కార్