
Telangana State Board of Technical Education & Training (SBTET), పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పాలి సెట్)2023 నోటిఫికేషనన్ రిలీజ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్/ అన్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో డిప్లొమా కోర్సులు ఎంచుకోవచ్చు.
1) ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(PJTSAU) అందించే అగ్రికల్చరల్ డిప్లొమాలు,
2)శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూని వర్సిటీ అందించే హార్టికల్చరల్ డిప్లొమాలు;
3) పీవీ నరసింహారావు తెలం గాణ వెటర్నరీ యూనివర్సిటీ అందించే యానిమల్ హజ్బెండ్రీ అండ్ ఫిష రీస్ డిప్లొమా ప్రోగ్రామ్స్ లు
ఈ టెస్ట్ ద్వారానే అడ్మిషన్స్ కల్పిస్తారు.
అర్హత: పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత ప్రస్తుతం పరీక్షలు రాసేవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
కంపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసి పాసైనవారు, రాస్తున్నవారు వారు కూడా అర్హులే.
టీఎస్ పాలిసెట్ వివరాలు:
మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
పదోతరగతి సిలబస్ ఆధారంగానే ప్రశ్నలు
పాలిటెక్నిక్ డిప్లొమా ప్రోగ్రామ్ లో చేరాలనుకున్న అభ్యర్థులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలకు సమాధానాలు రాస్తే చాలు.
అగ్రి కల్చరల్, హార్టికల్చర్, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో చేరాలంటే బయాలజీ ప్రశ్నలను కూడా అటెంప్ట్ చేయాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 18 నుంచి
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 24
పాలిసెట్ 2023 తేదీ: మే 17