Site icon

మార్చి 12 నుంచి పోలీస్ ఉద్యోగాల మెయిన్స్

పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి మెయిన్స్ పరీక్షలను మార్చి 12 నుంచి నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్ణయించింది. కానిస్టేబుల్, ASI, SI పరీక్షలు విభాగాల వారీగా మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకూ నిర్వహిస్తారు. ఇప్పటికే డిసెంబర్ 8న ప్రారంభమైన దేహ దారుఢ్య పరీక్షలు ఈనెల 5తో ముగుస్తాయి.

మార్చి 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ IT & Communications SI అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష ఉంటుంది. ఆ రోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఫింగర్ ప్రింట్ ఎస్సై అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష

మార్చి 26న ఉదయం Transport SI అభ్యర్థులకు,

ఏప్రిల్ 2న ఉదయం కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు టెక్నికల్ పరీక్షలు

ఏప్రిల్ 2 మధ్యాహ్నం సెషన్లో కానిస్టేబుల్ మెకానిక్ అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష
ఈ పరీక్షలన్నీ హైదరాబాద్ లోనే జరుగుతాయి.

SI రాత పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి.

ఏప్రిల్ 8న సివిల్, IT, Transport SI, Finger Print విభాగం 1,2 పేపర్లను నిర్వహిస్తారు. ఉదయం సెషన్లో అర్థమెటిక్, రీజనింగ్, మధ్యాహ్నం ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది.

ఏప్రిల్ 9న ఉదయం Civil SI అభ్యర్థులకు మూడో పేపర్ జనరల్ స్టడీస్, మధ్యాహ్నం తెలుగు లేదా ఉర్దూ పరీక్షలు జరుగుతాయి.

SI Mainsకు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ పరీక్షా కేంద్రాలు ఉంటాయి.

సివిల్, Transport, Excise కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏప్రిల్ 23 ఉదయం జనరల్ స్టడీస్. అదేరోజు మధ్యాహ్నం IT &Communication కానిస్టేబుల్ అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష

పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు TSLPRB చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 5న దేహదారుఢ్య పరీక్షలు అయిపోయాక రాత పరీక్షల హాల్ టికెట్ల జారీపై ప్రకటన చేస్తామని తెలిపారు.

 

PressNotedated01012023

ఈ కింది లింక్ ద్వారా GROUP.2,3&4 COMBINED కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కొలువు కల నెరవేర్చుకోండి.

(GROUP.2 అభ్యర్థుల కోసం కొత్త సిలబస్ ఛార్ట్ 2023 జనవరి మొదటి వారంలో ఇవ్వబడును. ఈలోగా కోర్సులో జాయిన్ అవ్వగలరు )

Course link: https://atvqp.courses.store/176632?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral-wa%26utm_campaign%3Dcourse-overview-app

Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ ఇదే

http://on-app.in/app/home/app/home?orgCode=atvqp

Exit mobile version