తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు

తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే జూన్ 9 వరకూ ఈ లాక్ డౌన్ కొనసాగనుంది. అంతేకాకుండా లాక్ డౌన్ మినహాయింపుల టైమింగ్స్ మార్చింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ లాక్ డౌన్ నుంచి జనానికి మినహాయింపు ఉంది. ఒంటి గంట నుంచి రెండు గంటల లోపు బయటకు వెళ్ళిన వారు ఇంటికి చేరుకోడానికి టైమ్ ఇస్తారు. ఆ తర్వాత అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి మళ్ళీ తెల్లారి ఉదయం ఆరంటి దాకా కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తారు. గతంలో లాగే లాక్ డౌన్ అమల్లో ఉన్న టైమ్ లో అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కేసులు పెట్టడంతో పాటు బండ్లు సీజ్ చేయడం, జరిమానాలు విధించడం లాంటివి కొనసాగుతాయి.