వివక్షకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యం

మేథావులు, పౌర సమాజం ప్రతిస్పందన

1) ఇ.వి.పద్మనాభం ఏ పత్రికను స్థాపించారు?
జ) ఫ్లాష్ అండ్ ఫెలోమెన్.
2) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఎప్పుడు ఏర్పడింది?
జ)1988 జులై 14.
3) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఏ పత్రికను ప్రారంభించింది?
జ) మా తెలంగాణ.
4) మా తెలంగాణ పత్రిక ఆవిష్కరణ సభ ఎక్కడ జరిగింది?
జ) కాచిగూడలోని బసంతి టాకీస్ .
5) మా తెలంగాణ పత్రిక ఎడిటర్ ఎవరు?
జ) టి.ప్రభాకర్ (నాట్యకళ ప్రభాకర్).
6) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏ పుస్తకాన్ని ప్రచురించింది?
జ) పర్ స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ.
7) తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఎవరు ఏర్పాటు చేశారు?
జ) నాగారం అంజయ్య.
8) న్యాయవాదులు,రచయితలు,కవులు,కళాకారులు,అధ్యాపకులు,జర్నలిస్టులు కలసి ఏ గ్రూపుగా ఏర్పడి భువనగిరిలో సభను నిర్వహించారు ?
జ: సాహితీ మిత్ర మండలి
9) భువనగిరి సభ నిర్వహణకోసం సాహితీ మిత్రమండలి ఎంతమందితో ఓ ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసింది ?
జ: 43 మందితో (ఇందులో 17 మంది న్యాయవాదులే)
9) మార్చి 8న భువనగిరి సభ ఎక్కడ జరిగింది ? ఈ ప్రాంగణానికి ఏమని నామకరణం చేశారు?
జ) ఇండియా మిషన్ స్కూల్ లో... దీనికి అమరవీరుల ప్రాంగణం అని పేరు
10) మార్చి 8న భువనగిరి సభలో తెలంగాణ ఏర్పాటు కోసం డిమాండ్ చేసింది ఎవరు ?
జ: కాళోజీ నారాయణ రావు
11) విద్యా, వైద్య రంగాల్లో జరుగుతున్న అన్యాయాలను గురించి భువనగిరి సభలో ఎవరు ప్రసంగించారు ?
జ: ప్రొ. జయశంకర్
12) భువనగిరి సభలో గద్దర్ పాడిన రెండు పాటలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. అవి ఏవి ?
జ: 1) నా తల్లి తెలంగాణ తిరగబడ్డ 2) అమ్మా తెలంగాణమా... ఆకలి కేకల గానమా...
13) తెలంగాణకి జరిగిన అన్యాయం గురించి భువనగిరిసభలో పాటలు పాడిన డోల్ దెబ్బ సాంస్కృతిక సంస్థ నాయకురాలు ఎవరు ?
జ: బెల్లి లలిత
14) భువనగిరిలో మార్చి 8,9ల్లో జరిగిన సభకు ఏమని నామకరణం చేశారు?
జ) దగాపడ్డ తెలంగాణ
15) గద్దర్ పై కాల్పులు ఎప్పుడు జరిగాయి?
జ) 1997 ఏప్రిల్ 6.
16) తెలంగాణ మహాసభ ఎప్పుడు ఎక్కడ జరిగింది?
జ) 1997 ఆగస్టు 11 సూర్యాపేట.
17) సూర్యాపేటలో జరిగిన తెలంగాణ మహా సభను ఏమని అంటారు?
జ) దోఖాదిన్న తెలంగాణ సదస్సు
18) సూర్యాపేట సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర్ర తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
జ) వి.ప్రకాశ్.
19) 1997 ఆగస్టు 11న సూర్యాపేటలో జరిగిన తెలంగాణ మహాసభలో ఎన్ని డిమాండ్లతో సూర్యపేట డిక్లరేషన్ వెలువడింది ?
జ: 16 డిమాండ్లతో
20) ఓయూ గ్రంధాలయ భవనంలో ఎవరి ఆధ్వర్యంలో సదస్సు జరిగింది ?
జ) తెలంగాణ ఐక్యవేదిక
(నోట్: ప్రాంతీయ అసమానతలు మరియు అభివృద్ధి ప్రత్యామ్నాలు అనే అంశంపై 2 రోజుల సదస్సు జరిగింది )
21) తెలంగాణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఓయూలో సదస్సు ఎప్పుడు జరిగింది ?
జ) 1997 ఆగస్ట్ 16,17
22) ఓయూలో జరిగిన సదస్సులో ముఖ్యపాత్ర వహించిన వారు ఎవరు ?
జ: ప్రొ. పి.ఎల్ విశ్వేశ్వరరావు, ప్రొ. సింహాద్రి
23) 28 సంస్థల కలయికతో తెలంగాణ ఐక్యవేదిక ఎప్పుడు ఏర్పడింది?
జ) 1997 అక్టోబర్ 14 ఓయూ లైబ్రరీ బిల్డింగ్ లో
24) 1997 నవంబర్ 1న తెలంగాణ ఐక్యవేదిక ఎక్కడ నుంచి ఎక్కడికి భారీ ర్యాలీ నిర్వహించింది ?
జ) నిజాం కాలేజీ మైదానం నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్ పార్క్ వరకు
25) తెలంగాణ ఐక్య వేధిక సభలో తెలంగాణ పత్రికను ఎవరు ఆవిష్కరించారు?
జ) కాళోజీ నారాయణరావు.
26) తన నివాసమైన జలదృశ్యం తెలంగాణ ఐక్యవేదిక కార్యాలయంగా ఉపయోగించుకోమని ఎవరు పిలుపునిచ్చారు?
జ) కొండా లక్ష్మణ్ బాపూజీ.
27) తెలంగాణ కళా సమితి నల్గొండ నాయకురాలు ఎవరు?
జ) బెల్లి లలిత.
28) తెలంగాణ విద్యార్దుల వేదిక ఓ.యు.లో ఎప్పుడు ఏర్పడింది?
జ) 1998.
29) తెలంగాణ జనసభ ఎవరి అధ్యక్షతన ఏర్పడింది ?
జ) బి. సత్యనారాయణ
30) గోలకొండ కవుల సంచిక అనే సంకలనం రచించిన కవి ఎవరు ?
జ) సురవరం ప్రతాపరెడ్డి
31) రాష్ట్రంలో 531 మంది జ్యుడీషియల్ ఆఫీసర్లతో ఎంత మంది తెలంగాణ వారు ఉన్నారు ?
జ) 92 మంది
32) 1902లో తెలంగాణ ప్రాంత వాసి భండారు అచ్చమాంబ రచించిన మొదటి కథగా పేరొదింది ఏది ?
జ) ధనత్రయోదశి
33) 1956కు పూర్వం రాష్ట్రంలోని ఏ ప్రాంతం విద్యుత్ సప్లయ్ కేంద్రంగా ఉండేది ?
జ) తెలంగాణ ప్రాంతం
34) ఏ ఉద్యమ సంస్థను స్పూర్తిగా తీసుకుని తెలంగాణ ఉద్యమం నిర్వహించాలని ఉద్యమకారులు భావించారు ?
జ) అస్సాం గణపరిషత్
34) తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో వరంగల్ బహిరంగ సభ ఎప్పుడు జరిగింది ?
జ) నవంబర్ 1, 1996
35) మా తెలంగాణ మాస పత్రిక నుంచి ఎన్ని సంచికలు వెలువడ్డాయి ?
జ) 7
36) తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ ఉస్మానియా విశ్యవిద్యాలయంలో ఆందోళనలు ఎప్పుడు చేసింది ?
జ) 1991
37) 2004 మార్చిలో ఏర్పడిన తెలంగాణ సంస్థ ఏది ?
జ) తెలంగాణ విద్యావంతుల వేదిక
38) ప్రజాసంఘాలు తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి ఎన్ని రకాలైన పద్దతులను ఎన్నుకున్నారు ?
జ) భావజాల వ్యాప్తి, ఆందోళన కార్యక్రమాలు, రాజకీయ ప్రక్రియ
39) తెలంగాణ ప్రజలు చేసే పోరాటాల్లో ప్రధాన లక్ష్యాలు ఏవి ?
జ) స్వేచ్ఛ, స్వాతంత్య్రం, స్వపరిపాలన
40) తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలువెత్తు సంతకంగా నిలిచిన కవి ఎవరు ?
జ) సోమన
41) తెలంగాణ ప్రాంతం దాదాపు ఎన్ని సంవత్సరాలుగా ముస్లిం పాలనలో ఉండిపోయింది ?
జ) 400 సంవత్సరాలు
42) 1999లో అమెరికాలో న్యూయార్క్ లో ఏర్పడిన తెలంగాణ సంస్థ ఏది ?
జ) తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం
43) నిజాం నిరంకుశ పాలనలో ఫ్యూడల్ జాగీర్ దార్ల అణచివేత కారణంగా వెనుకబడిన ప్రాంతం ఏది ?
జ) తెలంగాణ
44) తెలంగాణ సంస్కృతి వైభవాన్ని తెలియజేయుటకు తెలంగాణ జనసభ ఏర్పాటు చేసిన సంస్థ ఏది ?
జ) తెలంగాణ కళాసమితి
45) తెలంగాణ ప్రజలు ముఖ్యంగా దేనికి వ్యతిరేకంగా పోరాడారు ?
జ) పెత్తందారీ వ్యవస్థ
46) తెలంగాణ పార్టీని ఎవరు స్థాపించారు ?
జ) దేవానందస్వామి