తెలంగాణకి హరితహారం

1) తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది ?
జ: 2015 జులై 3న రంగారెడ్డి జిల్లా చిలుకూరులో
2) హరితహారం కింద 3యేళ్ళల్లో ఎన్ని మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ?
జ: 230 కోట్ల మొక్కలు
3) అటవీయేతర ప్రాంతాల్లో ఎన్ని మొక్కలు నాటుతారు ?
జ: 120 కోట్లు
4) అటవీ ప్రాంతాల్లో ఎన్ని మొక్కలు నాటాలని లక్ష్యం ?
జ: 100 కోట్లు
5) HMDA పరిధిలో ఎన్ని మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 10 కోట్ల మొక్కలు
6) రాష్ట్రంలో ప్రస్తుతం 23 శాతం అడవులు ఉన్నాయి. దీన్ని ఎంత శాతానికి పెంచాలని హరితహారం కార్యక్రమం ప్రారంభించారు ?
జ: 33 శాతం
7) హరితహారంలో భాగంగా నియోజకవర్గం, గ్రామాలకు మొక్కలు నాటడంపై లక్ష్యం ఎంత ?
జ: నియోజకవర్గం - 40 లక్షలు, గ్రామం: 40 వేలు
8) తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి ట్యాగ్ లైన్ ఏంటి ?
జ: కోతులు వాపస్ పోవాలె... వానలు వాసప్ రావాలె ...!
9) ఏ కార్యక్రమంలో భాగంగా కూడా హరితహారాన్ని గ్రామాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: మన ఊరు - మన ప్రణాళిక
10) తొలి విడత హరితహారంలో ఎన్ని మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ?
జ: 40 కోట్ల మొక్కలు
11) రెండో విడత హరితహారం కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది ?
జ: 2016 జూలై 8
12) రెండో విడత హరితహారం కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైంది ?
జ: నల్లగొండ జిల్లా గుండ్రాం పల్లి
13) రెండో విడత హరితహారంలో ఎన్ని మొక్కలు నాటాలని లక్ష్యం ?
జ: 46 కోట్ల మొక్కలు

14) రెండో విడత హరితహారంలో భాగంగా జులై 10న హైదరాబాద్ లో ఒకే రోజు ఎన్ని మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు ?
జ: 29 లక్షల మొక్కలు