తెలంగాణ – అడవులు ( టాప్ 10 బిట్స్)

1) రాష్ట్ర మొత్తం భూ విస్తీర్ణంలో అడవులు శాతం
జ: 24.35 శాతం
2) రాష్ట్రంలో మొత్తం అటవీ విస్తీర్ణం
జ: 27,292 చ.కి.మీ.
(దేశంలో 12వ స్థానం. దేశ అటవీ విస్తీర్ణం - 7,01,673 చ.కి.మీ)

హరితహారం కార్యక్రమం (మొత్తం బడ్జెట్ : రూ.5500కోట్లు )
2) మొదట ఎప్పుడు ప్రారంభించారు ?
జ: 2015 జులై 3 - కేసీఆర్ - చిలుకూరి బాలాజీ టెంపుల్ లో
3) రెండో దశ హరితహారం ఎక్కడ ప్రారంభించారు
జ: 2016 జులై 8 - గుండ్రాంపల్లి, నల్లగొండ జిల్లా (ముఖ్యమంత్రి కేసీఆర్)
4) మూడో దశ హరితహారం ఎక్కడ ప్రారంభించారు
జ: 2017 జులై 12 - కరీంనగర్ - కేసీఆర్
5) హరిత హారం స్లోగన్
జ: కోతులు వాపసు పోవాలె... వానలు వాపస్ రావాలె
6) రాష్ట్రంలో అత్యధిక అడవులు ఉన్న జిల్లా
జ: జయశంకర్ భూపాల పల్లి జిల్లా ( 4.50 లక్షల హెక్టార్లు )
7) అత్యల్ప అడవులు ఉన్న జిల్లా
జ: హైదరాబాద్
8) శాతాల పరంగా అడవులు
అత్యధికం - జయశంకర్ భూపాల పల్లి
అత్యల్పం - కరీంనగర్

9) తెలంగాణలో అభయారణ్యాలు - 9

1) కవ్వాల్ అభయారణ్యం - ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో విస్తరించింది ( పులులు, నీల్ గాయ్, జింకలు, అడవి దున్నలు)

2) శివారం అభయారణ్యం - పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో విస్తరించింది
( మొసళ్ళు, క్రిష్ణ జింక, ఎలుగుబంట్లు )

3) ప్రాణహిత అభయారణ్యం- మంచిర్యాల జిల్లా
(క్రిష్ణ జింక, చింకార, తాబేళ్ళు )

4) అమ్రాబాద్ అభయారణ్యం - దీన్ని రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ అభయారణ్యం అంటారు. నాగర్ కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో విస్తరించింది
( బెంగాల్ పులి, చిరుత, సాంబార్, క్రిష్ణ జింక)

5) కిన్నెరసాని అభయారణ్యం - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తరించింది
( చింకార, సాంబార్, అడవి దున్న, సాంబార్, అడవి పంది, పులి, క్రిష్ణ జింక)

6) పాకాల అభయారణ్యం - పాకాల, వరంగల్ గ్రామీణ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో విస్తరించింది )
( నీల్ గాయ్, నాలుగు కొమ్ముల దుప్పి, క్రిష్ణ జింక, స్లోత్ బేర్)

7) ఏటూరు నాగారం అభయారణ్యం - ఏటూరు నాగారం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విస్తరించింది.
(తోడేళ్ళు, నీల్ గాయ్, క్రిష్ణ జింక, మచ్చల జింక, సాంబార్ )

8) పోచారం అభయారణ్యం - కామారెడ్డి - మెదక్ జిల్లాల్లో విస్తరించింది
( పాములు, కొంగలు, బాతులు, నెమళ్ళు, చిరుత పులులు)

9) మంజీర అభయారణ్యం - మెదక్ జిల్లాలో విస్తరించింది
( 70 రకాల పక్షిజాతులు, వృక్ష జాతులు, క్షీరదాలు, సరీసృపాలు. మగ్గర్ మొసళ్ళు )

10) రాష్ట్రంలో ఫారెస్ట్ అకాడమీ ఎక్కడుంది
జ: దూలపల్లి (ప్రచురించే మాసపత్రిక వన సంరక్షణి )