Friday, September 20

తెలంగాణ ఎంసెట్ కి ఏర్పాట్లు పూర్తి

తెలంగాణలో ఈనెల 3వ తేదీ నుంచి ఎంసెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రాష్ట్రంలో మొత్తం 94 పరీక్షా కేంద్రాల్లో ఆన్ లైన్ లో ఎంసెట్ పరీక్షలను నిర్వహిస్తారు.

మొదటి విడత... ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకూ

రెండో విడత ... మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకూ నిర్వహిస్తారు.

ఈనెల 3,4,6 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్ష, 8,9 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు జరుగుతాయి.

తెలంగాణ ఎంసెట్ కోసం మొత్తం 2,16,462 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,41,816 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 74,646 మంది అప్లయ్ చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ రెండు విభాగాల కోసం 234 మంది దరఖాస్తు చేశారు.

ఎంసెట్ విద్యార్థులకు సూచనలు:

1) రెండు గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి

2) పరీక్ష ప్రారంభం అయ్యాక ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించరు

3) ఆన్ లైన్ పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రతి విద్యార్థికి కంప్యూటర్ కేటాయిస్తారు

4) అభ్యర్థి వివరాలు ... అంటే పేరు, ఫోటో లాంటివి ఓపెన్ పేజీలో కనిపిస్తాయి

5) హాల్ టిక్కెట్ లో పేర్కొన్న విధంగా యూజర్ పేరు, విద్యార్థికి ఇచ్చే పాస్ వర్డ్ ను పరీక్ష సమయానికి 10 నిమిషాల ముందు ఎంటర్ చేసి తర్వాత సైనిన్ బటన్ పై క్లిక్ చేయాలి

6) పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థి కూడా యూజర్ గైడ్ లైన్స్ తప్పకుండా అనుసరించాలి

7) పరీక్షా కేంద్రాన్ని ఒక రోజు ముందుగా సందర్శిస్తే మంచిది

8) ఎంసెట్ ఆన్ లైన్ పరీక్షలకు కాలిక్యులేటర్స్, మ్యాథమెటిక్స్, లాగ్ టేబుల్, పేజర్స్, మొబైళ్ళు, గడియారాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్ళడానికి అనుమతి లేదు.

9) మాల్ ప్రాక్టీస్ చేసినా, ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాసినా... వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.