TS EAMCET 2021 షెడ్యూల్ రిలీజ్

TS EAMCET 2021 షెడ్యూల్ రిలీజ్

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( EAMCET 2021) షెడ్యూల్ ను ఉన్నతవిద్యామండలి విడుదల చేసింది. జులై 5 నుంచి 9 వరకూ జరిగే ఈ ఎగ్సామ్స్ ను JNTU, హైదరాబాద్ నిర్వహించనుంది. అగ్రికల్చరల్ అండ్ మెడికల్ తో పాటు... ఇంజనీరింగ్ విభాగాలకు 2021 జులై 5,6,7,8,9 తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ లో నిర్వహించే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మారలేదని అధికారులు తెలిపారు. మొత్తం 160 ప్రశ్నలను 180 నిమిషాల్లో (3గంటల్లో) రాయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 55శాతం, రెండో సంవత్సరంనకు సంబంధించి 45శాతం ఇంటర్ సిలబస్ వెయిటేజ్ ఉంటుంది.

షెడ్యూల్ ఇదే

నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే తేది: మార్చి 18
ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం: మార్చి 20 నుంచి
అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేది: మే 18
తప్పులు దిద్దుకోడానికి టైమ్: మే 19 నుంచి 27 వరకూ
రూ.250 ఫైన్ తో అప్లికేషన్ సబ్మిట్ కు : మే 28

ఫీజుల వివరాలు

ఇంజినీరింగ్ : రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.400 (SC/ST/PHC)
రూ.800 ( for others)
అగ్రికల్చరల్ & మెడికల్ : రూ.400 (SC/ST/PHC)
రూ.800 ( for others)
రెండూ (ఇంజనీరింగ్ & అగ్రికల్చర్ & మెడికల్) రూ.800 (SC/ST/PHC)
రూ.1600 (for others)

పూర్తి వివరాలకు ఈ నోటిఫికేషన్ చూడండి

షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి