తెలంగాణ – కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు

1) 1990లో తెలంగాణ ఫోరం ఎంతమందితో ఎప్పుడు ఏర్పడింది?
జ) వంద మంది తెలంగాణ ఎమ్మెల్యేలతో
2) తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను గణాంకాలతో ఎవరు వివరించారు?
జ) 1997లో జీవన్ రెడ్డి
3) 2000లో ఏర్పడిన తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ?
జ: 41 మంది
4) తెలంగాణకు మద్దతుగా 41మంది ఎమ్మెల్యేలు ఎవరి ఆధ్వర్యంలో సోనియా గాంధీకి వినతిపత్రం అందించారు ?
జ: జి.చిన్నారెడ్డి
5) 2000లో తెలంగాణ అంశంపై సోనియా గాంధీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో సభ్యులు ఎవరు ?
జ: మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, గులాంనబీ ఆజాద్
జ) 2000
6) కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీ SRC ఏర్పాటు చేయాలని ఎవరికి లేఖ రాసింది ?
జ: అప్పటి హోంమంత్రి ఎల్.కె.అద్వానీ
7) కాంగ్రెస్ ఏ సంవత్సరంలో జరిగిన ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చింది ?
జ: 2004లో
7) ఒక ఓటు రెండు రాష్ట్ర్రాలు - అని బీజేపీ ఏ సభలో తీర్మానం చేసింది?
జ) కాకినాడ సభలో
8) 1999లో వాజ్ పేయి ప్రభుత్వం ఏ రాష్ట్ర్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ?
జ) చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ మరియు తెలంగాణ.
9) ఎవరి అభ్యంతరంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిలిచిపోయింది ?
జ: చంద్రబాబు నాయుడు
10) చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ సర్కార్ లు ఎప్పుడు ఏర్పాటయ్యాయి ?
జ: 2000 నవంబర్ లో
11) 1997లో ఎక్కడ జరిగిన బీజేపీ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ ను రెండుగా విభజించాలన్న నిర్ణయం జరిగింది ?
జ: కాకినాడు ( ఒక ఓటు రెండు రాష్ట్రాలు )
12) తెలంగాణ సాధన సమితిని ఎవరు ఏర్పాటు చేశారు?
జ) ఆలె నరేంద్ర
13) 2001లో తెలంగాణ రాష్ట్ర్ర సమితిని స్థాపించకముందు KCR టీడీపీ ప్రభుత్వంలో ఏ మంత్రిగా పనిచేశారు?
జ) 1996-99 వరకూ రవాణా శాఖ మంత్రి
14) ఏ డాక్యుమెంట్ లో తెలంగాణ అభివృద్ది గురించి లేకపోవడంతో కేసీఆర్ బహిరంగంగా విమర్శించారు?
జ) విజన్ 2020 డాక్యుమెంట్ లో
15) కరెంట్ చార్జీల పెంపుపై చంద్రబాబునాయుడుకు కెసిఆర్ ఏమని లేఖ రాసారు?
జ) తెలంగాణ రైతులకు ఉన్న గోచీ కూడా ఊడిపోతోంది