తెలంగాణలో అస్తిత్వ ఉద్యమాలు

1) గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా 1901లో హైదరాబాద్ లో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయంను స్థాపించింది ఎవరు ?
జ: మునగాల సంస్థానపు దివాన్ అయిన కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాధరావు
2) హన్మకొండలో స్థాపించబడిన గ్రంథాలయం ఏది ?
జ: రాజ రాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం (1904లో)
3) ఉస్మానియాలో ఉర్దూ భాషాభివృద్ధి కోసం స్థాపించిన సంస్థ ఏది ?
జ: అంజుమాన్ తారక్ ఇ ఉర్దూ ( మౌల్వీ అబ్దుల్ హక్)
4) నిజాం రాజ్యంలో దళితుల తరపున ఉద్యమం చేపట్టింది ఎవరు ?
జ: మాదిరి భాగ్యరెడ్డి వర్మ
4) అంటరానితనం నేరమంటూ వారికి భాగ్యరెడ్డి వర్మ ఏమని పేరు పెట్టారు?
జ: ఆది హిందువులు
5) భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన సంస్థ ఏది ?
జ: జగన్ మిత్ర మండలి
6) జగన్ మిత్ర మండలిలో ఎవరెవరికి సభ్యత్వాన్ని నిరాకరించారు ?
జ: మద్యపానం సేవించేవారు, సిగరెట్టు తాగే వారు
7) హిందువుల్లో చైతన్యం తెచ్చేందుకు భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన సంస్థ ఏది?
జ: ధర్మ ప్రచారిణీ సభ
8) స్వస్తిక్ దళ్ వాలంటీర్ల సంఘాన్ని స్థాపించింది ఎవరు ?
జ: భాగ్యరెడ్డి వర్మ
9) ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ను స్థాపించింది ఎవరు ?
జ: 1911లో భాగ్యరెడ్డి వర్మ
10) భాగ్యరెడ్డి వర్మతో పాటు హరిజనోద్దరణకు సేవ చేసిన వారెవరు ?
జ: బాలా ముకుంద్
11) తెలంగాణ ఒద్ది రాజు సోదరులు ఎవరు ? ఏ పత్రిక ప్రారంభించారు ?
జ: సీతారాంచందర్ రావు, రాఘవ రంగారావు (1920లో తెలుగు వారపత్రిక ప్రారంభించారు). వరంగల్ జిల్లా ఇనుగుర్తి నుంచి వెలువడింది
12) నీలగిరి పత్రిక ఎక్కడ నుంచి వెలువడింది ? ఎవరి సంపాదకత్వంలో ?
జ: నల్లగొండ నుంచి షబ్నవీసు రామనర్సింహారావు సంపాదకత్వంలో
13) దక్కన్ క్రానికల్ ఎవరి ఆధ్వర్యంలో వెలువడింది ?
జ: బుక్కపట్నం రామాచార్యులు ( ఇంగ్లీష్ పత్రిక)
14) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాసినది ఎవరు ?
జ: సురవరం ప్రతాపరెడ్డి
15) సురవరం సంపాదకత్వంలో వెలువడిన పత్రిక ఏది ?
జ: 1925లో గోల్కొండ పత్రిక
16) వానమలై వరదాచార్యలుని ఏమని పిలుస్తారు ?
జ: అభినవ పోతన