Wednesday, October 23

2 రోజుల్లో TRT ఫలితాలు

నిరుద్యోగ ఉపాధ్యయ అభ్యర్థుల ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్ట్ (TRT) ఫలితాలను రెండు రోజులుల విడుదల చేసేందుకు TSPSC ప్రయత్నిస్తోంది. ఇవి రిలీజ్ చేసిన వెంటనే GROUP.2 ఫలితాలు కూడా వెల్లడించాలని TSPSC అధికారులు నిర్ణయించారు.

ఇప్పటి టీఆర్టీ SGT ఫలితాలను ప్రకటించేందుకు ప్రక్రియ అంతా పూర్తి చేశారు. ఈ జాబితాను మరోసారి పరిశీలించి సోమవారం రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. టీఆర్టీపై మరోసారి రీలింక్విష్ మెంట్ తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం గ్రూప్ 2 ఫలితాలను పక్కనబెట్టిన అధికారులు, పూర్తిగా TRT పైనే కసరత్తు చేస్తున్నారు. మొదట TRT SGT తెలుగు మీడియం ఫలితాలు, తరువాత 4, 5 రోజుల్లో SGT ఇంగ్లీష్ మీడియం ఫలితాలను కూడా ప్రకటిస్తారు. వచ్చే వారంలోగా TRT ఫలితాలను పూర్తి చేస్తే... నెలాఖరు కల్లా గ్రూప్ 2 రిజల్ట్స్ కూడా ఇస్తామని TSPSC అధికారులు చెబుతున్నారు. టీఆర్టీ రీలింక్విష్ మెంట్ చేయడం వల్ల రెండు మీడియమ్స్ లో కలిపి అదనంగా మరో 100మంది దాకా అర్హత పొందినట్టు సమాచారం.