తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలకు లైన్ క్లియర్ అయింది. SC వర్గీకరణపై GO రిలీజ్ అవ్వగానే కొత్త పోస్టుల భర్తీకి ప్రక్రియ మొదలవుతుంది.
కొత్త జాబ్ కేలండర్ 2025
SC వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియ పెండింగ్ లో ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం 2024లో విడుదల చేసిన Job calendar కొంతవరకే అమలు అయింది. 2024 అక్టోబర్ లో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సి ఉన్నా అది కూడా ఆగిపోయింది. SC వర్గీకరణపై అప్పటికే సుప్రీంకోర్టు తీర్పు రావడం, ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేయడంతో ఆ ప్రభావం కొత్త ఉద్యోగా నోటిఫికేషన్లపై పడింది. ఈమధ్యే SC వర్గీకరణపై కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో వివరాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టగా రెండు సభల్లో ఆమోదం కూడా లభించింది.. ఇప్పుడు దీనికి సంబంధించిన జీవో విడుదల అవగానే తెలంగాణలో కొత్తగా ఉద్యోగాల ప్రకటనలు జారీ చేసే అవకాశం ఏర్పడింది. దాంతో 2025 కొత్త జాబ్ కేలండర్ ను కూడా ప్రభుత్వం విడుదల చేయబోతోంది.
రెండు రోజుల్లో జీవో రెడీ
SC వర్గాల్లో మూడు గ్రూపులుగా చేస్తున్నట్టు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. దీనిపై మరో రెండు రోజుల్లో జీవో రెడీ అవుతోంది. ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగ నియామకాల్లో క్రమపద్దతిని ఫాలో అయ్యేందుకు ప్రాధాన్యత నమూనాను కూడా జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సిఫార్సు చేసింది. గ్రూప్ 1 కేటగిరీలో నోటిఫై చేసి, భర్తీ కాని ఖాళీలను తర్వాత ప్రాధాన్యత అంటే గ్రూప్ 2 లో ఉన్న వారితో భర్తీ చేయాలి. ఇందులో కూడా fillup కాని పోస్టులు ఉంటే గ్రూప్ 3లో ఉన్న SC కులాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని గ్రూపుల్లో తగినంత మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వకపోతే ఆ పోస్టులను మాత్రమే carry forward చేస్తారు. ఉద్యోగా నియామకాల్లో వారికి కేటాయించిన గ్రూపు వారీగా రిజర్వేషన్లకు రోస్టర్ పాయింట్ల నంబర్లను కూడా అక్తర్ కమిషన్ సిఫార్సు చేసింది.