TGPSC Groups Results: 2025 మార్చి నాటికి ఇప్పటివరకూ జరిగిన అన్ని Groups Results వెల్లడిస్తామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మార్చి నెలాఖరు కల్లా Group1, Group2, Group3 పరీక్షల ఫలితాలన్నీ రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇక నుంచి జారీ చేసే నోటిఫికేషన్లలో Prelims, Mains రెండు విడతల్లో పోటీ పరీక్షలు ఉంటే మొత్తం ప్రక్రియను 9 నెలల్లోగా పూర్తి చేస్తామన్నారు TGPSC Chairman. ఒకే Mains Exam ఉంటే 6 నెలల్లోగా Final Results ఇస్తామన్నారు. ఈ షెడ్యూల్ ను ముందుగానే రిలీజ్ చేస్తామని తెలిపారు. గతంలో Group.2 Notification 2015లో వస్తే పోస్టులు భర్తీ 2019లో పూర్తయింది. కానీ ఇప్పుడు తక్కువ టైమ్ లోనే Recruitment పూర్తి చేస్తామని తెలిపారు.
Read this also : Group 2 Exam ముందు రోజు… ఎగ్జామ్ హాల్లో ఎలా ?
Read this also: ఊరుకో రెవెన్యూ అధికారి 6000 VRO Posts
ఏ పుస్తకాలు చదవాలి ?
TGPSC కేవలం ఉద్యోగ ప్రకటనలు మాత్రమే జారీ చేస్తుందని ఏ పుస్తకాలు చదవాలి అన్నది అభ్యర్థులదే నిర్ణయమని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం క్లారిటీ ఇచ్చారు. దాంతో తెలుగు అకాడమీ పుస్తకాలకు లైన్ క్లియర్ అయినట్టు భావించవచ్చు. పుస్తకాలు ఏవి చదివినా… TGPSC విడుల చేసిన Final Key ఆధారంగానే Paper valuation ఉంటుంది.
UPSC, SSC అధికారులతో మీటింగ్
TGPSC ఎగ్జామ్స్ మరింత పారదర్శకంగా ఎలా నిర్వహించాలో స్టడీ చేసేందుకు ఈనెల 18,19 తేదీల్లో కమిషన్ అధికారులు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈనెల 18న UPSC, CIC అధికారులను కలుస్తారు. ఆ తర్వాత 19నాడు SSC, NTA సంస్థలను consult అవుతారు. ఉద్యోగాల ప్రకటనలు, పరీక్షల నిర్వహణ, సంస్కరణలు, అదనపు సిబ్బంది లాంటి అంశాలపై స్టడీ చేస్తారు. దీనిపై జనవరి నెలాఖరుకల్లా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని TGPSC ఛైర్మన్ తెలిపారు. 2 నెలల్లోగా ఆ సంస్కరణలు అమలు చేసి next recruitment రెడీ అవుతామన్నారు. ఇక నుంచి UPSC, SSC Exams schedules పరిశీలించాకే TGPSC exams schedule ని ప్రకటిస్తామన్నారు. ఒక్కసారి పరీక్షల షెడ్యూల్ ప్రకటించాక ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేయబోమని GPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టంగా చెప్పారు.
Read this also : Group.3 ఫలితాలు లేట్ : 1,2 పోస్టుల భర్తీ తర్వాతే ….
Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO లాంటి Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Click here for Telangana Exams plus app Link
ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.
🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK
🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams