TG TET 2025 రెండో విడత నోటిఫికేషన్ త్వరలో విడుదల ! ఫైల్ పంపిన విద్యాశాఖ – 45 వేల మంది టీచర్లలో టెన్షన్
TG TET 2025 రెండో విడత నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వ అనుమతి కోరుతూ పాఠశాల విద్యాశాఖ ఫైల్ పంపింది. డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది.
ఈ ఏడాది జూన్‌లో తొలి విడత TET పరీక్షలు నిర్వహించగా, జూలై 22న ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పుడు డిసెంబర్లో రెండో విడత నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఇప్పటికే విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టు తీర్పు – టీచర్లకు TET తప్పనిసరి!
ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లు ఉద్యోగాల్లో కొనసాగాలంటే TET పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో TET GOలో సవరణ చేసి నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడింది. రాష్ట్రంలో TET పాస్ కాని టీచర్లు దాదాపు 45 వేల మంది ఉన్నారని విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి.

నోటిఫికేషన్ ఎప్పుడు?
విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా డిసెంబర్ 12 వరకు సెలవులో ఉన్నారు. ఇన్‌ఛార్జి కార్యదర్శిగా ఉన్న శ్రీదేవసేన ఆలోపు TG TET నోటిఫికేషన్‌పై నిర్ణయం తీసుకుంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
TG TET 2025 Eligibility & Structure
- పరీక్ష విధానం: Paper-I (Class 1–5), Paper-II (Class 6–8)
- అర్హతలు: D.Ed, B.Ed, Language Pandit
- వయస్సు పరిమితి: 18 సంవత్సరాలు పైబడి
- ఫీజు: ₹400 (ప్రతి పేపర్‌కు)
- అధికారిక వెబ్సైట్: tstet2025.aptonline.in
TG TET 2025 – ఎందుకు కీలకం?
- TET పాస్ లేకపోతే DSC, Gurukulam, Model School, KGBV వంటి నియామకాలకు అర్హత ఉండదు.
- Adhoc, Contract Teachers కూడా TET పాస్ కావాల్సిందే.
TG TET 2025 – తాజా అప్డేట్ కోసం ఎక్కడ చూడాలి?
📢 Join Our Channels for Instant Alerts!
👉 Exams Centre Channel (English Jobs/Exams Info)
https://aratt.ai/@examscentre247_com
👉 AP/Telangana Exams (తెలుగు మీడియం వాళ్ళకి)
https://aratt.ai/@ap_telangana_exams
👉 Join our Arattai Group – https://aratt.ai/@indiaworld_in
👉 Join our Telegram Channel – https://t.me/ExamsCentre247website
👉 Join Telangana Telegram Group – https://t.me/telanganastategroup

TG TET 2025 Notification: డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారు. మీ ప్రిపరేషన్ కు పనికొచ్చే బెస్ట్ బుక్స్ Amazon లో అందుబాటులో ఉన్నాయి. మీరు వీటిని మా link ద్వారా కొనుగోలు చేస్తే small affiliated commission వస్తుంది. మీకు అదనంగా ఎలాంటి భారం పడదు. Thank you



