తెలంగాణాలో TET, DSC కి ఒకే పరీక్ష ?

తెలంగాణాలో TET, DSC కి ఒకే పరీక్ష ?

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET), DSC(TRT) రెండింటికీ కలిపి ఒకే పరీక్ష నిర్వహించాలని ఆలోచిస్తోంది విద్యాశాఖ. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఇప్పటికే ఓ నిపుణుల కమిటీని కూడా వేసింది. ఈ కమిటీలో విద్యాశాఖ అధికారులు, SCERT డైరెక్టర్, OU B.Ed., కాలేజీలు ప్రిన్సిపాల్ తో పాటు మరికొందరు విద్యావేత్తలు ఉన్నారు. గతంలో టెట్ ను విద్యాశాఖ నిర్వహించగా... డీఎస్సీని TRT గా మార్చి... TSPSC ఎగ్జామ్ నిర్వహించింది. 50 వేల ఉద్యోగాల ప్రకటనలో ఉపాధ్యాయ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలంటే ముందుగా టెట్ నిర్వహించాల్సి ఉంది. టెట్ పాసైన వారికి మాత్రమే DSC రాసుకోడానికి అవకాశముంది. ఇప్పటికే చాలామందికి టెట్ గడువు పూర్తయింది. ఈ పరిస్థితుల్లో టెట్ నిర్వహించాలని డిమాండ్ వినిపిస్తోంది. రెండు వేర్వేరుగా నిర్వహించడం వల్ల అభ్యర్థులకు ఇబ్బందులు ఎదరవుతున్నాయనీ... అందువల్లే ఒకే ఎగ్జామ్ గా నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు.

టెట్ గడువు లైఫ్ టైమ్ ఉంటుందా ?

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యవధిని నేషనల్ కౌన్సిల్ ఆప్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) గతంలో పొడిగించింది. గతంలో 7యేళ్ళ కోసారి టెట్ వ్యాలిడిటీ అయిపోయేది. మళ్ళీ ఫ్రెష్ రాసుకోవాల్సి వచ్చేంది. అయితే NCTE మాత్రం ఒక్క సారి టెట్ పాసైతే లైఫ్ టైమ్ వరకూ పనికొస్తుందని ప్రకటించింది. దీనిపై ఇంకా గెజిట్ విడుదల కాకపోవడంతో టెట్ వ్యాలిడిటీపై ఇంకా డౌట్స్ కొనసాగుతున్నాయి. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా నిర్ణయం తీసుకోడానికి మరికొంత టైమ్ పడుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు.

 

2019లో టెట్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇచ్చిన వీడియో... మీకు పనికి వస్తుంది అనుకుంటే చూడగలరు.