Friday, October 19
Log In

TEST: 359, 360- CA- DEC 29 &30

రాష్ట్రీయం
1) తెలంగాణ ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా ఎవరిని సీఎం కేసీఆర్ నియమించారు ?
జ: మాజీ మంత్రి గొడిశల రాజేశం గౌడ్
(సభ్యుడిగా రిటైర్డ్ జడ్పీ సీఈఓ ఎం.చెన్నయ్య )
2) స్మార్ట్ పోలీసింగ్ రోబో (రోబో పోలీస్ ) హైదరాబాద్ లో కూడా అందుబాటులోకి వచ్చింది.  దీన్ని తయారు చేసిన సంస్థ ఏది ?
జ: హెచ్ - బోట్స్ రోబోటిక్స్
(నోట్: దీన్ని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ప్రయోగాత్మకంగా 31న పరీక్షించనున్నారు )
3) రాష్ట్రంలోని ప్రైవేటు స్కూలు ఫీజులు నియంత్రణ, అధ్యయనంపై పనిచేస్తున్న కమిటీ ఏది ?
జ:ప్రొఫెసర్ తిరుపతి రావు కమిటీ
4) ఫిబ్రవరి, 2018 లో హైదరాబాద్ 3 అంతర్జాతీయ సదస్సులు వేదిక అవుతోంది. అవి ఏంటి ?
జ: 14-17 (మైనింగ్ టుడే ), 19-21 - ఐటీ కాంగ్రెస్, 22-24 - బయో ఆసియా
5) రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఏ సంస్థను ఏర్పాటు చేయనుంది ?
జ: క్లీన్ అథారిటీ


6) రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై ప్రత్యేక యాప్ ను విడుదల చేశారు.  ఈ సర్వే ఎప్పుడు జరిగింది ?
జ: 2014 ఆగస్టు 19న
7) రాష్ట్రంలో ఏర్పడిన వన్యప్రాణుల, పర్యావరణ పరిరక్షణ శాసనసభా కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు ?
జ: స్పీకర్ మధుసూదనాచారి
8) దివ్యాంగులను సాధారణ వ్యక్తులు పెళ్లి చేసుకుంటే ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఎంత మొత్తం ఇవ్వనుంది ?
జ: లక్ష రూపాయలు (గతంలో రూ.50వేలు)
9) దక్షిణభారత దేశంలోనే తొలిసారిగా ఏ నదిపై తీగల వంతెనను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: మానేరు నదిపై ( సస్పెన్షన్ బ్రిడ్జి)
10) మహిళా క్రికెట్ లో ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్ కి రాష్ట్ర ప్రభుత్వం ఎంత బహుమతి ప్రకటించింది ?
జ: కోటి రూపాయలు
11) బతుకుపోరు, విలువలు పుస్తకాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. ఈ పుస్తక రచయిత ఎవరు ?
జ: బి.ఎస్ రాములు ( బీసీ కమిషన్ ఛైర్మన్)
12) IMA డాక్టర్ ఎంజీ గార్గ్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు ఎవరికి దక్కింది ?
జ: డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి
(నోట్: జీర్ణకోశ వ్యాధుల నిపుణులు, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ )
13) రాష్ట్రంలో మిమిక్రీ కోర్సులో డిప్లోమా  కోర్సును ప్రవేశపెడుతున్న యూనివర్సిటీ ఏది ?
జ: కాకతీయ విశ్వవిద్యాలయం

జాతీయం
14) ఫోన్ కాల్స్ నిఘాకి సంబంధించిన పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడినందుకు ఏ సంస్థపై CBI కేసు నమోదు చేసింది ?
జ: ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ECIL)
15) ఆకాశంలో తక్కువ ఎత్తులోనే శత్రు క్షిపణిని నేలకూల్చే సామర్థ్యం కలిగిన అడ్వాన్సుడ్ ఎయిర్ డిఫెన్స్ సూపర్ సోనిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. దాని పేరేంటి ?
జ: వినాశని
(నోట్: ఒడిశాలోని చాందీపూర్ ITR నుంచి దీన్ని ప్రయోగించారు. క్షిపణి పొడవు 7.5 మీటర్లుమ )
16) కొత్త సంవత్సరం ఈవెంట్స్ కి ఎంత శాతం జీఎస్టీ కట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ?
జ: 28 శాతం
17) మనదేశానికి చెందిన కార్టో శాట్ - 2 సిరీస్ ఉపగ్రహంతో పాటు మొత్తం ఎన్ని ఉపగ్రహాలను జనవరి 10న నింగిలోకి పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది ?
జ: 31 ఉపగ్రహాలు
18) మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI) స్థానంలో ఏ పేరుతో కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకువస్తోంది. (ప్రస్తుతం ఈ బిల్లుపై లోక్ సభలో చర్చ నడుస్తోంది )
జ: నేషనల్ మెడికల్ కమిషన్ ( NMC)
19) ఏపీ, ఒడిశాలోని పుణ్యక్షేత్రాలు అరకు అందాలను చూపించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించనున్న రైలు పేరేంటి ?
జ: భారత్ దర్శన్

అంతర్జాతీయం
20) పేగులో వ్యాధులను వాసనతో కనిపెట్టే ముక్కును స్పెయిన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని పేరేంటి ?
జ: మూసీ 32 ఇ-నోస్
21) నిద్ర లేమి సమస్యలకు చెక్ పెట్టేందుకు జర్మనీ శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త పరికరం ఏది ?
జ: ఆక్టిమీటర్

===========================================================

TRT జాబ్ కి 50 రోజుల ప్లాన్
SGT /SA (SOCIAL, BIOLOGY, TELUGU ) కి మాక్ టెస్ట్ లు
https://tsexams.com/trt-50days/

AEE/ CDPO/EXTN. OFFICERS మాక్ టెస్టులు రాయాలనుకునేవారు వివరాలకు క్లిక్ చేయండి :

http://tsexams.com/aeecdpo-mock-tests/

==================================================

SI/CONSTABLE/VRO/GROUP.IV
మిమ్మల్ని విజేతలుగా తీర్చిదిద్దుతాం...
మీరు జాబ్ సాధించే మార్గం చెబుతాం..
Perfect Planning + Perfect Coaching
(Material+Mock tests+Intensive Coaching)
పూర్తి వివరాలకు విజిట్ చేయండి:
http://telanganaexams.com/siconstable-4steps/

(ఇప్పటికే 20 వేల మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు రెడీగా ఉన్నాయి. ఎగ్జామ్స్ కల్లా 50 వేల ప్రశ్నల తయారీకి సిద్దం.  అలాగే మెటీరియల్ కూడా ప్రింట్ చేయిస్తున్నాం)