Thursday, September 19

టెలిగ్రామ్ లో కొత్త ఆప్షన్స్ ! ఇక గ్రూప్ లో 2 లక్షల మంది !!

సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతోంది. గ్రూప్ మెంబర్స్ లిమిట్ ను 2 లక్షల మందికి పెంచింది. దాంతో ఇకపై గ్రూపులో 2 లక్షల మంది దాకా చేరే అవకాశం ఉంటుంది. అలాగే గ్రూప్ అడ్మిన్స్ కి కూడా కొత్త ఆప్షన్స్ అందిస్తున్నట్టు మెస్సేజ్ లు పంపుతోంది టెలిగ్రామ్ యాప్. కొత్త ఆప్షన్స్ ఇకపై గ్రూప్ లో ఉండే సబ్యులను కొన్ని రకాల కంటెంట్ పెట్టకుండా అడ్డుకోడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెసేజ్ లు ఫార్వార్డ్ చేయకుండా కూడా అడ్డుకోవచ్చు. యూజర్ చాట్ లేదా క్లియర్ చాట్ హిస్టరీని డిలీట్ చేస్తే కన్ఫర్మేషన్ అడుగుతుంది. డిలీట్ చేసిన చాట్ ను 5 సెకన్లలోపు తిరిగి పొందే అవకాశం కూడా కల్పిస్తున్నారు. గ్రూప్ సెట్టింగ్స్ కూడా మార్చుకునే అవకాశాన్ని టెలిగ్రామ్ యాప్ కల్పిస్తోంది. గతంలో సూపర్ గ్రూప్స్, బేసిక్ గ్రూప్స్ అనేవి ఉండేవి. వీటిన్నింటినీ ఇకపై గ్రూప్స్ గానే వ్యవహరిస్తారు. థంబ్ నెయిల్స్, సెర్చ్ బార్స్ ని కూడా స్టైయిలిష్ గా తీర్చిదిద్దుతున్నట్టు టెలిగ్రామ్ తెలిపింది.

 

Telangana Exams... Current affairs టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

https://t.me/joinchat/AAAAAEUxZqx8I4QWSbT5kA

Telangana Exams ... State Group టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

https://t.me/joinchat/AAAAAENHnkdizD4r6VCaWg