Wednesday, September 18

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2019-20

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. అందువల్ల ఈ కింది లింక్ ద్వారా మీరు వెబ్ సైట్ లో రాసుకోగలరు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2019-20 క్విజ్

1. రాష్ట్ర తలసరి ఆదాయం 2018-19 సంవత్సరానికి రూ.2,05,696 గా నమోదైంది.  అయితే జిల్లాలు – వాటి తలసరి ఆదాయం జతపరచండి

1) రంగారెడ్డి జిల్లా

2) హైదరాబాద్ జిల్లా

3) మేడ్చల్ మల్కాజ్ గిరి

 

ఎ) రూ. 3,61,256

బి) రూ.4,57,034

సి) రూ.2,59,510లు

2. 2019-20 రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయ శాఖకు ప్రభుత్వం రూ.20,566.36 కోట్లు కేటాయించింది.  అయితే ఇందులో ఏయే స్కీములకు ఎంతెంత కేటాయించారో జతపరచండి

1) రైతు బంధు

2) రైతు బీమా

3) రుణ మాఫీ

4) వ్యవసాయ యంత్రాలు, రాయితీలు

 

ఎ) రూ.12వేల కోట్లు

బి) రూ.1,137 కోట్లు

సి) రూ.6 వేల కోట్లు

డి) రూ.304 కోట్లు

3. రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి ఇచ్చిన ప్రకటనల్లో సరైనవి గుర్తించండి

1) ఓటాన్ అకౌంట్ లో 1.82 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రభుత్వం ప్రతిపాదించింది

2) ఇప్పుడు 1.46 లక్షల కోట్లకు తగ్గింది. అంటే ఓటాన్ అకౌంట్ కన్నా రూ.36 వేల కోట్ల తగ్గుదల కనిపించింది

3) 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రాష్ట్ర బడ్జెట్ అంచనాలు రూ.28 వేల కోట్ల తగ్గుదల కనిపించింది

4) రాష్ట్ర మనుగడకు అప్పులు, భూముల విక్రయాలే ముఖ్యమని సీఎం కేసీఆర్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు

4. ఐటీ ఎగుమతులకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

1) 2014-15లో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ రూ.52వేల కోట్లు

2) 2018-19 నాటికి రూ.1.00 లక్ష కోట్లకు చేరుకుంది

5. తెలంగాణ తలసరి ఆదాయానికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి

ఎ) 2017-18 లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,80,697

బి) 2018-19 లో రూ.2,05,696లు

సి) తలసరి ఆదాయంలో ఏడాది వ్యవధిలో 13.8శాతం వృద్ధిరేటు నమోదైంది

డి) జాతీయ తలసరి ఆదాయం రూ.1,26,406 లు

ఇ) జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే రాష్ట్రం 3.8శాతం ఆధిక్యత సాధించింది

6. 2019-20 రాష్ట్ర బడ్జెట్ లో సాగునీటి రంగానికి రూ.8,490.75 కోట్లు కేటాయించింది. వీటిల్లో ఏయే ప్రాజెక్టుకు ఎంతమొత్తాన్ని ఇచ్చిందో జతపరచండి

1) కాళేశ్వరం

2) పాలమూరు – రంగారెడ్డి

3) సీతారామ

4) దేవాదుల

5) కంతనపల్లి

 

ఎ) 100 కోట్లు

బి) 1080 కోట్లు

సి) 1324 కోట్లు

డి) 530 కోట్లు

ఇ) 500 కోట్లు

7. సంక్షేమ రంగానికి రాష్ట్ర బడ్జెట్ లో రూ.23,645.52 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఏయే వర్గాలకు ఎంతెంత కేటాయించారో తెలుపుతూ ఇచ్చిన ఈ కింది స్టేట్ మెంట్స్ లో సరైనవి గుర్తించండి

1) ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ది నిధికి మొత్తం కేటాయింపులు రూ.14,355.61 కోట్లు

2) ఎస్సీ లకు – రూ.2,753.88 కోట్లు

3) ఎస్టీలకు – రూ.1,898.68 కోట్లు

4) బీసీలకు – రూ.3,267.40 కోట్లు

5) మైనార్టీ – రూ.1369.95 కోట్లు

8. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఈ ప్రకటనల్లో తప్పుగా చెప్పినది గుర్తించండి

1) రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులు, HIV రోగులు, కల్లుగీత కార్మికులకు ఇచ్చే ఆసరా ఫించన్లకు రూ.9,402 కోట్లు కేటాయించింది

2) వృద్యాప్య ఫించన్ల అర్హత వయసును 65 సంవత్సరాల నుంచి 57యేళ్ళకు తగ్గించారు. దీంతో లబ్దిదారుల సంఖ్య 7లక్షలకు పెరిగింది. వీరికి బడ్జెట్ లో 12.94 కోట్లు కేటాయించింది

3) ఫించన్ మొత్తాన్ని జూన్ నుంచి దివ్యాంగులకు రూ.3,016లు, ఇతరులకు రూ.2,016లు పెంచారు

4) రాష్ట్రంలో మొత్తం ఆసరా ఫించన్ లబ్దిదారుల సంఖ్య 52.40 లక్షలు

9. వివిధ రంగాలు – వాటికి 2019-20 రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించిన మొత్తాలు జతపరచండి

(కోట్ల రూపాయాల్లో )

1) వ్యవసాయం, సహకారం

2) నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి

3) వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

4) స్త్రీ, శిశు సంక్షేమం, వికలాంగులు, వయో వృద్ధులు

5) హోంశాఖ

 

ఎ) 5,694.17

బి) 1,507.70

సి) 4,989.97

డి) 8,490.75

ఇ) 20,566.36

10. రాష్ట్ర వృద్ధి రేటుకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి గుర్తించండి

ఎ) 2018-19 సంవత్సరానికి రాష్ట్ర వృద్ధి రేటు 10.5శాతంగా నమోదైంది

బి) ఇదే ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధి రేటు 6.8శాతంగా ఉంది

సి) GVA (గ్రాస్ వాల్యూ యాడెడ్ ) లో పశు సంపద, మైనింగ్, తయారీ, ఆర్థిక సేవలు, స్థిరాస్తి, విద్య, వైద్యం రంగాలు ఏటేటా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి

డి) GVAలో అధికవాటా 16.5శాతంతో సేవా రంగం మొదటి స్థానంలో ఉంది.

11. విద్యుత్ రంగానికి సంభంధించిన ఈ కింది ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

ఎ) ఎన్నడూ లేనివిధంగా విద్యుత్ శాఖ రాయితీల కోసం బడ్జెట్ లో రూ.8,289.77 వేల కోట్లు కేటాయించింది

బి) 2018-19 లో ఇంధన రంగానికి రూ.5,338.40 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

సి) ఇటీవల రోజువారీ కరెంట్ డిమాండ్ చరిత్రలోనే అత్యధికంగా 12 వేల మెగావాట్లకు చేరుకుంది

12. ఈ కింది ప్రకటనల్లో సరైనవి తెలపండి

1) రాష్ట్ర బడ్జెట్ లో నాలుగు సంక్షేమశాఖల ద్వారా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కు రూ.1540.45 కోట్లు కేటాయించారు

2) గత ఏడాది ఈ పథకాలకు రూ.1450.46 కోట్లు కేటాయించారు.

3) ఈసారి బడ్జెట్ లో షాదీ ముబారక్ కు అదనంగా రూ.89.99 కోట్లు పెంచారు.

13. ) రాష్ట్రానికి చెందిన అప్పుల గురించి ఈ ప్రకటనల్లో సరైనవి గుర్తించండి

ఎ) రాష్ట్ర అప్పులు 2,03,730 కోట్లు

బి) తలసరి అప్పు రూ.73,042

సి) GSDP లో అప్పుల శాతం 21గా ఉంది

డి) 2020 మార్చి నాటికి తలసరి అప్పు రూ.88,068కు చేరనుంది

14. 2019-20 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తంతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది ?

15. ఈ కింది ప్రకటనలు చదివి వీటిల్లో సరిగా చెప్పినది ఏదో గుర్తించండి

1) డబుల్ బెడ్రూమ్ పథకానికి కేటాయింపులు తగ్గాయి. గృహ నిర్మాణ బడ్జెట్ ఈసారి రూ.977.68 కోట్లు

2) ఆరోగ్యశ్రీకి ఈసారి ప్రభుత్వం 720.12 కోట్లు కేటాయించింది

3) విద్యాశాఖకు మొత్తం 9,899.79 కోట్లను కేటాయించారు

4) పోలీస్ శాఖకు 4955.77 కోట్లు కేటాయించారు


 

ఈ క్విజ్ ను వీడియో రూపంలో  చూడండి