G-948507G64C
Home Popular Posts గుడ్ న్యూస్… త్వరలో 14,236 పోస్టుల భర్తీ

గుడ్ న్యూస్… త్వరలో 14,236 పోస్టుల భర్తీ

0
28

Telangana Jobs 2025: తెలంగాణలో మరో 14,236 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ‌లో ఈ కొలువులను భర్తీ చేయబోతున్నారు. మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌లో అంగ‌న్వాడీ టీచ‌ర్లు (Anganwadi Teachers), హెల్పర్ల (Angan wadi helpers) ఖాళీల భ‌ర్తీకి ప్రభుత్వం ఒకే చెప్పింది. జాబ్స్ రిక్రూట్ మెంట్ కి అనుమతించిన ఫైల్‌పై మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి సీత‌క్క సంత‌కం చేశారు. మొత్తం 14,236 పోస్టులను ప్రభుత్వం భ‌ర్తీ చేయబోతోంది. ఇందులో 6,399 అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, 7,837 హెల్పర్ల పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో MLC ఎన్నిక‌ల కోడ్ అయిపోగానే నోటిఫికేష‌న్ జారీ చేయాలని నిర్ణయించారు. ఆయా జిల్లా కలెక్టర్లు ఈ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. తెలంగాణలో ఇంత భారీ స్థాయిలో Anganwadi Teachers, Angan wadi helpers పోస్టులు భ‌ర్తీ చేయ‌డం ఇదే మొదటిసారి.

Read also : BOBలో 4000 ఖాళీలు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here