తెలంగాణ ప్రభుత్వం ఏడాదిలో మొత్తం 54 వేల కొలువులను భర్తీ చేసింది. ఇందులో BRS ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రకటనల్లో 50,127 పోస్టులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా ఇచ్చిన ప్రకటనల్లో 12,527 పోస్టులను భర్తీ చేసింది. అయితే త్వరలో మరో 16 వేల కొలువులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణ అంశం తేలగానే మళ్ళీ ప్రభుత్వ కొలువులకు నోటిఫికేషన్లను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 16 వేల పోస్టులను గుర్తించినట్టు తెలుస్తోంది.
గ్రూప్ 3 పోస్టులే ఎక్కువ
కొత్త ఏడాదిలో 2025 కొత్త జాబ్ కేలండర్ ప్రకటించి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా 16 వేల దాకా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. వీటిల్లో టీచర్ పోస్టులతో పాటు ఎక్కువగా గ్రూప్ 3 ఉద్యోగాలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేశారు. మరో నాలుగైదు వేల టీచర్ పోస్టులను కొత్త ఏడాదిలో భర్తీ చేసే ఛాన్సుంది. ఇవి కాకుండా మిగిలిన పోస్టుల్లో ఎక్కువగా ఉన్న గ్రూప్ 3 పోస్టులకు మళ్ళీ TGPSC ద్వారా నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యే ఛాన్సుంది.
(Telangana Exams you tube channel లో ప్రసారం అయ్యే 7pm MCQs PDF మెటీరియల్ కోసం ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి )
7PM MCQs MATERIAL LINK
ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.
🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK
🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams