తెలంగాణ జానపద నృత్యాలు

1) యక్షగానంలో పేరొందిన కళాకారులు ఎవరు?
జ: ధర్మపురి శేషాచల కవి, యాముజాల శేషాచల కవి, మద్దుమ కవి
2) పద్య గద్యాలతో సంగీతాలతో కూడిన నృత్యరూపకాన్ని ఏమంటారు ?
జ: యక్షగానం
3) పేరిణి నృత్యంను సాధారణంగా ఎవరు ప్రదర్శిస్తారు?
జ: మగవారు
4) పేరిణి శివతాండవంలో పేరుపొందిన కళాకారులు ఎవరు?
జ: నటరాజ రామకృష్ణ
5) పేరిణి నృత్యంలో పేరున్న నటరాజ రామకృష్ణ కు శిష్యులు ఎవరు ?
జ: పేరిణి శ్రీనివాస్, రమేష్, కళాకృష్ణ, శ్రీధర్
6) గుసాడి నృత్యాన్ని ఎవరు ప్రదర్శిస్తారు?
జ: అదిలాబాద్ లోని రాజగోండులు
7) గుసాడీ నృత్యాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తారు ?
జ: దీపావళినాడు
8) గుసాడీ నృత్యం చేసేవారు ఏమేమి ధరిస్తారు?
జ: నెమలి ఈకలు, తలపాగా, జంతుచర్మాలు
9) ఒగ్గు కధ చెప్పడంలో పేరు పొందిన వారెవరు?
జ: మిద్దెరాములు (కరీంనగర్), చుక్క సత్తెయ్య (జనగాం)
10) తెలంగాణలో అత్యంత ప్రచారంలో ఉన్న ఒగ్గు కథకులు ఎవరు?
జ: గొల్ల సుద్దులు
11) తప్పెటగుళ్ళు నృత్యాన్ని ఎవరు ఎక్కువగా చేస్తారు?
.జ: గొల్లలు
12) కీలుగుర్రం నృత్యంలో కీలుగుర్రాన్ని దేనితో తయారు చేస్తారు?
జ: వెదురు బద్దలు, కాగితాలు, మెంతులు కలిపి