తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

1) తెలంగాణలో మిగులు నిధులపై నియమించిన కమిటీ ఏది?
జ) భార్గవ కమిటీ
2) పార్లమెంటులో నోట్ ఆన్ సేఫ్ గార్డ్ ప్రపోజ్డ్ ఫర్ ది తెలంగాణ ఏరియా అనే పేరుతో పత్రాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జ) 1956 ఆగస్టు 1
3) తెలంగాణ మిగులు నిధులను తెలంగాణలోని TRC పధకాలను అమలుపరుచుటకు ఏ సంవత్సరంలో వినియోగించారు?
జ) 1961-62.
4) జై ఆంధ్ర ఉద్యమం ఎప్పుడు ప్రారంభం అయినది?
జ) 1972
5) రాష్ట్ర్రపతి రాజేంద్రప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లును ఎప్పుడు ఆమోదించారు?
జ) 1956 ఆగస్టు 31
6) ఆంధ్రప్రదేశ్ తొలి భాషా ప్రాతిపదిక రాష్ట్రంగా ఎప్పుడు అవతరించింది?
జ) 1956 నవంబర్ 1
7) 1956లో రాష్ట్ర స్థాపన జరిగే నాటికి తెలంగాణలో సాగైన మొత్తం భూమి నికర విస్తీర్ణం ఎంత?
జ) 46,57,282 హెక్టార్లు
8) 1956కు పూర్వం చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ విధిగా పూర్తి చేయాలని రాష్ట్రాల పునర్ వ్యవస్తీకరణ చట్టం లోని ఏ సెక్షన్ ల ద్వారా భారత పార్లమెంట్ నిర్దేశించింది?
జ) 107, 108 సెక్షన్లలో
9) ఏ సంవత్సరంలో నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారు?
జ) 1931
10) రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేశారు?
జ) నిబంధన 371(1)
11) తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏ సంవత్సరములో చట్టబద్ద సంస్థగా ఏర్పడింది?
జ) 1958
12) తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది పరివాహక ప్రాంతం ఎంత శాతం?
జ) 79 శాతం
13) రాష్ట్ర విద్యుత్ విభాగాన్ని ఏ ఏడాదిలో హైదరాబాద్ లో నెలకొల్పారు?
జ) 1910
14) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు ఎప్పుడు ఏర్పాటైంది ?
జ) 1956
15) కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ను ఎప్పుడు నియమించింది?
జ) 1953 డిసెంబర్ 29
16) ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి మొదటి SRC నివేదికను సమర్పించింది?
జ) 1955, సెప్టెంబర్ 30
17) మొదటి రాష్ట్రాల పునర్విభజన కమిషన్ లో ఎంత మంది సభ్యులు ఉన్నారు?
జ) ముగ్గురు
18) పోచంపాడు జలవిద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో ఉంది?
జ) నిజామాబాద్
19) జూరాల జలవిద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో ఉంది?
జ) మహబూబ్ నగర్
20) 1969లో మిగులు నిధులపై వేసిన కమిటీ ఏమిటి?
జ) భార్గవ కమిటీ.
21) 1969లో కాపు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ మిగులు నిధుల వివరాల గురించి అద్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏది?
జ) కుమార్ లలిత్ కమిటీ
22) నిజాంసాగర్ జలవిద్యుత్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
జ) నిజామాబాద్.
23) 1956-68 లెక్కల ప్రకారం లలిత్ కమిటీ నివేదిక ప్రకారం రెవిన్యూ రాబడిలో తెలంగాణ శాతం ఎంత?
జ) 42 శాతం
24) 1961లో తెలంగాణ జనాభా వాటా ఎంత శాతం?
జ) 35 శాతం
25) వశిష్ట భార్గవ కమిటీని ఎప్పుడు నియమించారు?
జ) 1969,ఏప్రిల్ 22
26) నిజామ్ షుగర్ ఫ్యాక్టరీ ఏ జిల్లాలోఉన్నది?
జ) నిజామాబాద్
27) తెలంగాణలో కృష్ణానది పరివాహక ప్రాంతం ఎంత?
జ) 68.5 శాతం
28) పులిచింతల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉన్నది?
జ) నల్గొండ
29) సింగూరు ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు?
జ) మంజీర
30) నాగార్జునసాగర్ ప్రాజెక్టు సామర్థ్యం ఎంత?
జ)161 టి.ఎం.సి.లు
31) కృష్ణానది జల వివాదాలపై ఏర్పాటు చేసిన రెండో కమిటీ బ్రిజేష్ కుమార్ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జ) ఏప్రిల్ 2, 2004
32) ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉన్నది?
జ) కరీంనగర్
33) 610 జివోని ఏ కమిటీల సిఫార్సుల ఆధారంగా జారీ చేశారు ?
జ) జై భారత్ రెడ్డి, సుందరేశన్ కమిటీ.
34) ప్రధాని ఇంధిరాగాంధీ 8 సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రకటించింది?
జ) ఏప్రిల్ 11.1969
35) ఏప్రిల్ 11, 1969న తెలంగాణ ప్రజల ఉద్యోగాలపై రక్షణ చర్యలను సిఫార్సుచేయడానికి కేంద్రప్రభుత్వం నియమించిన కమిటీ ఏది?
జ) కైలాస్ నాధ్ వాంఛూ కమిటీ
36) 2002 వ సంవత్సరం నాటికి తెలంగాణ ప్రాంతంలో చెరువుల కింద సాగయ్యే భూమి విస్తీర్ణం ఎంత?
జ) 1,92,814 ఎకరాలు
37) కృష్ణా బేసిన్ లో నిర్మించ తలపెట్టిన రాజోలిబండ ప్రాజెక్టు నీటి సామర్ధ్యం ఎంత?
జ) 15.90 TMCలు
38) సాలార్ జంగ్ సంస్కరణలకు పూర్వం హైదరాబాద్ రాష్ట్రంలో తాలూకాదార్లు వసూలు చేసే శిస్తుల్లో ఎన్నో వంతు మాత్రమే వేతనంగా చెల్లించడానికి అనుమతించింది?
జ) 1/8 వ వంతు
39) నిజాం ఉల్ ముల్క్ హైదరాబాదు రాష్ట్రంలో మొదటి జాగీరును ఏ సంవత్సంలోలో ఇచ్చాడు?
జ) 1726
40) నిజాంకు కప్పం చెల్లించేవారు ఎవరు?
జ) సంస్థానదారులు
41 నిజాం కాలంలో సేవలకు గుర్తింపుగా భూమి దానాలను పొందిన వారిని ఏమంటారు?
జ) ఇనాందార్లు
42) నిజాం కాలంలో ప్రభుత్వంతో సంబంధం కలిగిన స్థానిక భూస్వాములను ఏమనేవారు?
జ) దేశ్ ముఖ్ లు
43) నిజాం కాలంలో పెద్ద భూస్వాములైన గణక నిపుణులు ఎవరు?
జ) దేశ పాండ్యలు
44) గ్రామాల్లో శాంతి భద్రతలను ఎవరు కాపాడేవారు?
జ) పటేళ్ళు
45) గ్రామాల్లో భూమి లెక్కలు చూస్తూ భూమి శిస్తు ఎవరు వసూలు చేసేవారు?
జ) పట్వారీలు
46) హైదరాబాద్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ప్రణాళికా శాఖను ఏర్పాటు చేశారు?
జ) 1943
47) జాగీర్దారు రద్దు చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది?
జ) 1949
48) హైదరాబాదు కౌలుదారు చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది?
జ) 1950
49) కృష్ణానది జలాల అంతర్ రాష్ట్ర పంపిణీ కోసం భారతదేశ ప్రభుత్వం RS బచావత్ ఆధ్వర్యంలో మరో ఇద్దరు సభ్యులతో ఏ సంవత్సరంలో కమిటీని నియమించింది?
జ) 1969
50) ఏ సంవత్సరంలో బచావత్ ట్రిబ్యునల్ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది?
జ) 1973