టార్గెట్ SBI ప్రొబేషనరీ ఆఫీసర్లు !
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సంపాదించాలని చాలామంది కలలు కంటుంటారు. ప్రభుత్వం తీసుకుంటున్న నగదు రహిత లావాదేవీలు, ఇతర బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలతో రాబోయే కాలంలో బ్యాంకులు తమ ఖాతాలను విస్తరించనున్నాయి. దాంతో బ్యాంక్ ఉద్యోగాల ఖాళీల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. అందులోనూ దేశంలోనే అతి పెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో PO గా పోస్టు సంపాదించడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు చాలామంది.
రూ.27,620ల జీతంతో కెరీర్ మొదలవుతుంది. వీటికి DA, HRA/Lease Rental/CCA, Medical Allowance, Other Allowances కూడా తోడవుతాయి. మొత్తమ్మీద Yearly CTC రూ.8.20 లక్షల నుంచి గరిష్టంగా రూ.13.08 లక్షలు దాకా ఉంటుంది.
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. SBI PO ఎంట్రన్స్ ఎగ్జామ్ ను ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం.
ఎగ్జామ్ ఎలా ఉంటుంది ?
మొత్తం 3 దశల్లో అభ్యర్థుల ఎంపిక ఉంటు