న్యాయమూర్తుల జీతభత్యాలు, తాత్కాలిక న్యాయమూర్తులు

1) న్యాయమూర్తలు జీతభత్యాలు గురించి తెలిపే ప్రకరణ ఏది ?
జ: 125 ప్రకరణ
2) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు ?
జ: పార్లమెంటు చట్టం ద్వారా
3) న్యాయమూర్తుల జీతాలను ఏ నిధి నుంచి చెల్లిస్తారు.
జ: భారత సంఘటిత నిధుల నుంచి
4) న్యాయమూర్తు జీతాల్లో ఎప్పుడు కోత విధించవచ్చు ?
జ: ఆర్ధిక అత్యవసర పరిస్ధితి కాలంలో మాత్రమే
5) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత నెలసరి జీతం ఎంత ?
జ: రూ. 1 లక్ష
6) సుప్రీంకోర్టులో సాధారణ న్యాయమూర్తుల వేతనం ఎంత ?
జ: రూ.90 వేలు (2009లో సవరించిన ప్రకారం)
7) ఏ అధికరణం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను గురించి తెలియజేస్తున్నది ?
జ: 125వ అధికరణ
8) 126 వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమించే అధికారు ఎవరికి ఉంది ?
జ: రాష్ట్రపతి
9) 127 వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టులో అడహాక్ (తాత్కాలిక) ఇతర న్యాయమూర్తుల్ని నియమించుకోవచ్చు. రాష్ట్ర్రపతిని సంప్రదించి ఎవరు ఈ నియామకాలు చేస్తారు ?
జ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
10) సుప్రీంకోర్టులో తాత్కాలి (అడహాక్ ) న్యాయమూర్తుల పదవీకాలం ఎంత ?
జ: 2 యేళ్ళు
11) ఏ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టులో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను ఏవైనా ప్రత్యేక కేసుల విచారణ కోసం హాజరుకావాలని CJI కోరవచ్చు ?
జ: 128 వ అధికరణ
12) ఏ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంటుంది ?
జ: 130 వ అధికరణ
13) ఎవరి అనుమతితో సుప్రీంకోర్టు యొక్క కార్యక్రమాలను దేశంలోని ఇతర ప్రాంతంలో నిర్వహించే అధికారం ప్రధాన న్యాయమూర్తికి ఉంది ?
జ: రాష్ట్ర్రపతి ని సంప్రదించి
14) ముంభై,చెన్నై, కోల్ కతాల్లో సుప్రీంకోర్టు బెంచ్ లను ఏర్సాటు చేయాలని కేంద్ర కేబినెట్ చేసిన ప్రతిపాదనను ఏ సంవత్సరంలో 25 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది ?
జ: 2000సం.