ఇంట్లోనే ఉండండి ! ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి !!

ఇంట్లోనే ఉండండి ! ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి !!

కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ వణికిస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం కరోనా స్టార్ట్ అయినప్పుడు మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మన కుటుంబాలు కూడా ఇబ్బంది పడ్డాయి. మళ్ళీ సరిగ్గా అలాంటి పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలను బంద్ చేయడంతో... కోచింగ్ సెంటర్లు కూడా మూత పడ్డాయి. నిరుద్యోగ అభ్యర్థులు తమ ఇళ్ళకు వెళ్ళి పోయారు.

డోంట్ వర్రీ !

చాలామంది కోచింగ్ మిస్ అయిందని వర్రీలో ఉన్నారు. ఇప్పటికే 2,3 సార్లు కోచింగ్ తీసుకున్నవాళ్ళు కూడా మళ్లీ ఈమధ్య కోచింగ్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడవి మూత పడటంతో... చాలామంది డిజప్పాయింట్ అవుతున్నారు.

ఒక్కసారి ఆలోచించండి !!

 • నిజంగా కోచింగ్ తీసుకుంటేనే ఉద్యోగం వస్తుందా ?
 • ప్రతి రిక్రూట్ మెంట్ లో కోచింగ్ తీసుకున్నవాళ్ళే కొలువులు కొట్టారా ?
 • సివిల్ సర్వీసెస్ ద్వారా IAS, IPS ఉద్యోగాలు పొందిన వాళ్ళంతా ఇలాగే కోచింగ్ తీసుకున్నారా ?
 • మరి మనం ఎందుకు కోచింగ్ తోనే కొలువు వస్తుందని అపోహలో ఉన్నాం.

(ఒక్కసారి ఈ వీడియో చూడండి... నేను గతంలో పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం తయారు చేసినది... అందరికీ పనికివస్తుంది ...https://youtu.be/SOhqR6o3Kag)

ప్లానింగ్ ఉంటే చాలు... కోచింగే అవసరం లేదు !!

కోచింగ్ తీసుకుంటేనే ఉద్యోగం వస్తుందన్న అపోహ మాత్రం పెట్టుకోకండి. మీకు గతంలోనే చాలా సార్లు చెప్పాను. ( కోచింగ్ లేకుండా విజేతలు ఎలా అయ్యారో... నేను ప్రత్యేకంగా వీడియోలను వచ్చే వారం నుంచి ఇస్తాను)

 • మీరు ప్రిపేర్ అయ్యే ఉద్యోగాల సిలబస్ పై మొదట దృష్టి పెట్టండి.
 • మీ కోర్సు పాత ప్రశ్నాపత్రాలను దగ్గర పెట్టుకోండి
 • మంచి మెటీరియల్ ( 6 నుంచి 10 తరగతుల టెక్ట్స్ బుక్స్), తెలుగు అకాడమీ బుక్స్ పై దృష్టి పెట్టండి.
 • రోజు వారీ టైమింగ్ - సబ్జెక్ట్ ఛార్ట్ ప్రిపేర్ చేసుకోండి... (ఉదయం 4 లేదా 5 నుంచి రాత్రి 10.30 గంటల వరకూ )
 • 6 నెలల సిలబస్ ఛార్ట్ ప్రిపేర్ చేసుకోండి
 • ప్రతి రోజూ తప్పనిసరిగా కనీసం 2 నుంచి 3 గంటలు అర్థమెటిక్ లేదా రీజనింగ్ మీద దృష్టి పెట్టండి... బాగా ప్రాక్టీస్ చేయండి
 • పాత ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేస్తూ ... ప్రశ్నల సరళిని గమనించండి
 • ప్రతి రోజూ మాక్ టెస్టులు రాయండి... వారానికోసారి గ్రాండ్ టెస్టులు రాయండి

మీకు గైడెన్స్ ఇవ్వడానికి నేను యూ ట్యూబ్ లైవ్ సెషన్స్, వీడియోలకు ప్లాన్ చేస్తున్నాం. పట్టుదల వదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నించండి... 50 వేల కొలువుల్లో మీరొక్కటి సాధించి... మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంచండి.

మీ ప్రాక్టీస్ కోసం మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు !!

మేం గతంలో అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు నిర్వహించాం. వాటితో చాలామంది బెనిఫిట్ పొందారు... ఉద్యోగాలు సాధించిన వారు చాలా మెస్సేజ్ లు పెట్టారు. వీడియోల్లో వాటిని మీకు కూడా చూపించాను. ఇప్పుడు Telangana Exams Plus అనే యాప్ ద్వారా మరింత మెరుగ్గా ( మీరు personal analysis చేసుకోడానికి వీలుగా) Mock & Grand Tests నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఒక్కో ఎగ్జామ్ సిరీస్ లో దాదాపు 300 టెస్టులు పోస్ట్ చేశాం... ఇంకా ఇస్తాం. మొత్తం 400 టెస్టులకు పైగా ఇస్తాం.  ఈ 400 టెస్టులు పూర్తవగానే.. గ్రాండ్ టెస్టులు కూడా మొదలుపెడతాం.

మీరు ఇంట్లోనే ఉండి ప్రాక్టీస్ చేసుకోండి. ఎన్ని ప్రాక్టీస్ టెస్టులు రాస్తే... అంత మంచిది. అలాగే టెస్టులు రాసిన తర్వాత మీరు ఏయే ప్రశ్నలు అటెంప్ట్ చేయలేకపోయారో చూసుకోండి. మళ్ళీ వాటిని బాగా చదువుకొని మళ్ళీ అదే టెస్టులు రాసే ప్రయత్నం చేయండి. దాంతో మీకు సబ్జెక్ట్ /లెసన్స్ మీద బాగా గ్రిప్ వస్తుంది.

మేం పూర్తిగా తెలుగు అకాడమీ బుక్స్ / 6 టు టెన్త్ టెక్ట్స్ బుక్స్ ఆధారంగా ప్రశ్నలు తయారు చేయించాం.

కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోండి... store కి వెళ్ళి.... మీకు ఇష్టమైన కోర్సు purchase చేయండి.
కోర్సు పూర్తి వివరాలకు ఈ కింది లింక్ లో వివరాలు ఉన్నాయి చూడండి.

కోర్సుల పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి http://telanganaexams.com/telangana-jobs/

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ 

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true

ఆల్ ది బెస్ట్... ఎట్టి పరిస్థితుల్లో అధైర్యాన్ని కోల్పోవద్దు... మీకు మేమున్నామని గుర్తుపెట్టుకోండి.

విజేతలుగా నిలుద్దాం...! సంతోషంగా జీవిద్దాం !!

( టెక్నికల్ గా ఓకే అయితే... వచ్చే ఆదివారం మీతో యూట్యూబ్ లైవ్ ఛాట్ చేద్దామనుకుంటున్నాను. వివరాలు శనివారం చెబుతాను )

Vishnu Kumar. M, Senior Journalist & Content Writer