రాష్ట్ర్రఎన్నికల సంఘం

1) 1992లో రాజ్యాంగంలో చేర్చబడ్డ ఏ రాజ్యాంగ సవరణలను అనుసరించి రాష్ట్ర్రాల్లో ప్రత్యేక ఎన్నికల సంఘాలను ఏర్పాటు చేశారు ?
జ: 73 రాజ్యాంగ సవరణ
2) ఏ అధికరణ ప్రకారం రాష్ట్ర్ర ఎన్నికల సంఘాన్ని ఏర్సాటు చేస్తారు ?
జ: 243(K) 243(ZA)
3) రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను ఎవరు నియమిస్తారు ?
జ: గవర్నర్
4) రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీకాలం ఎంత ?
జ: 5 సంవత్సరాలు
5) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు ?
జ: గవర్నర్ కు
6) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్దతిలోనే ఎవరు తొలగిస్తారు ?
జ: పార్లమెంట్ సిఫార్సుతో రాష్ట్ర్రపతి
7) పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ, నగర పాలక సంస్థలు... అంటే స్థానిక సంస్థల ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు ?
జ: రాష్ట్ర ఎన్నికల సంఘం
8) 1994లో ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్సాటు చేశారు. మొదటి ఎన్నికల ప్రధానాధికారి ఎవరు ?
జ: కాశీ పాండ్యన్
9) తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మొదటి కమిషనర్ ఎవరు ?
జ: వి.నాగిరెడ్డి
(నోట్: 2014 నవంబర్ 11 నుంచి కొనసాగుతున్నారు )