
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) CHSL నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 4500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో Lower Division Clerk (or) Junior Secretariat Assistant, Data Entry Operator విభాగాల్లో Posts రిక్రూట్ చేస్తారు.
LDC పోస్టులకు జీతం రూ.19,900-రూ.63,200
డేటా ఎంట్రీ ఆపరేటర్ జీతం రూ.25,500-రూ.81,100 ఉంటుంది.
విద్యార్హతలు ఏంటి:
అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి (ఇంటర్మీడిట్) పాస్ అవ్వాలి.
Date Entry Operator పోస్టులకు అభ్యర్థి సైన్స్ స్ట్రీమ్ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులవ్వాలి (MPC) దీంతో పాటు… మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
ఫీజు ఎంత ?
SSC CHSL అప్లికేషన్ ఫీజు రూ.100 ( మహిళలు, SC, ST, దివ్వాంగులు, మాజీ సైనికులకు ఫీజు లేదు)
వయోపరిమితి:
అభ్యర్థుల వయస్సు జనవరి 01, 2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభమయ్యే తేది: డిసెంబర్ 06, 2022
దరఖాస్తులకు చివరి తేదీ : జనవరి 04, 2023
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : జనవరి 04, 2023
తప్పుల సవరణకు : జనవరి 09, 2023
టైర్ 1 ఎగ్జామ్ డేట్ : ఫిబ్రవరి లేదా మార్చి 2023
టైర్ 2 ఎగ్జామ్ డేట్: త్వరలో తెలియజేస్తారు
అప్లయ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్:
- CHSL ఎగ్జామ్ అప్లై చేసుకునే అభ్యర్థులు ఆధార్, పాన్ కార్డ్ , పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఏదో ఒక ID ప్రూఫ్ అవసరం.
- అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి డెబిట్/క్రెడిట్ కార్డ్
- కులం సర్టిఫికెట్, 10th, Inter (12th) మార్క్ షీట్లు
- ఈమధ్య దిగిన పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోగ్రాఫ్,
- అభ్యర్థి సంతకంను స్కాన్ చేసి పెట్టుకోవాలి.
ఎలా అప్లయ్ చేయాలి
- అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ nic.inకి వెళ్లండి.
- Home పేజీలో “SSC CHSL ONLINE APPLY” లింక్‌పై క్లిక్ చేయాలి
- User Name & Password లతో లాగిన్ అవ్వాలి.
- Passport Size Photograph, ఇతర Documents Upload చేయాలి
- అప్లికేషన్ submit చేశాక… దాని కాపీని ప్రింటవుట్ తీసి పెట్టుకోవాలి
Exam ఎలా ఉంటుంది ?
CHSL ఎగ్జామ్ రెండు విభాగాలుగా జరుగుతుంది.
టైర్-I – Descriptive Paper, Skill Test (or) Typing Test.
Computer based Objective Exam మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
ప్రతి కరెక్ట్ ఆన్సర్ కు 2 మార్కులు. ప్రతి తప్పు ఆన్సర్ కు 0.5 మార్కులు కట్ చేస్తారు.
టైర్-1 పరీక్షలో పాసైతేనే టైర్-2కి అర్హులు.
SSC CHSL అప్లయ్ చేయడానికి వెబ్ సైట్ లింక్ : https://ssc.nic.in/
SSC CHSL NOTIFICATION కోసం క్లిక్ చేయండి: Notice_chsl_06122022